Chiranjeevi: చిరంజీవికి కథలు దొరకడం లేదా.. మన దర్శకులపై నమ్మకం పోయిందా..?

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)

Chiranjeevi: రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మెగాస్టార్ (Chiranjeevi) తీసుకుంటున్న నిర్ణయాలు.. ఆయన ఎంచుకుంటున్న కథలు చాలా మందికి అసంతృప్తినే మిగిలిస్తున్నాయి. వరస సినిమాలు చేస్తున్నాడనే పేరే కానీ ఆయన చేస్తున్న సినిమాలు మాత్రం ఓ వర్గం ప్రేక్షకులకు నిరాశనే మిగిలిస్తున్నాయి.

  • Share this:
అదేంటి అంత మాట అనేసారు అనుకుంటున్నారా..? ఇప్పుడు చిరంజీవి (Chiranjeevi) చేస్తున్న పనులు చూసిన తర్వాత ఎవరికైనా ఇదే అనుమానాలు కలగక మానదు. బయటికి చెప్పడం లేదు కానీ ఇండస్ట్రీలో కూడా చాలా మంది ఫీలింగ్స్ ఇవే. ఎందుకంటే రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మెగాస్టార్ (Megastar) తీసుకుంటున్న నిర్ణయాలు.. ఆయన ఎంచుకుంటున్న కథలు చాలా మందికి అసంతృప్తినే మిగిలిస్తున్నాయి. వరస సినిమాలు చేస్తున్నాడనే పేరే కానీ ఆయన చేస్తున్న సినిమాలు మాత్రం ఓ వర్గం ప్రేక్షకులకు నిరాశనే మిగిలిస్తున్నాయి. అంతగా ఆయనేం చేసాడబ్బా అనుకుంటున్నారా..? ఏం లేదు.. ఎక్కువగా రీమేక్ సినిమాలకే ఓకే చెప్పేస్తున్నాడు మెగాస్టార్. ఇదే చాలా మంది దర్శకులకు కూడా నచ్చట్లేదు. ఆయన ఊ అనాలే కానీ మెగాస్టార్ కోసం అదిరిపోయే మాస్ కథలు సిద్ధం చేయడానికి చాలా మంది దర్శకులు సిద్ధంగా ఉన్నారు తెలుగులో.

హరీష్ శంకర్(Harish Shankar), పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) లాంటి దర్శకులు అయితే చిరు ఎప్పుడెప్పుడు అవకాశమిస్తారా అని వేచి చూస్తున్నారు. కానీ మెగాస్టార్ మాత్రం సింపుల్‌గా రీమేక్ సినిమాలకు ఓకే చెప్తున్నాడు. రిస్క్ తీసుకోడానికి సాహసించడం లేదా.. లేదంటే నిజంగానే సొంత కథలపై నమ్మకం పోయిందా అనేది అర్థం కావడం లేదు. తన ఇమేజ్‌కు సరిపోయే కథలు తెలుగులో రావడం లేదని మెగాస్టార్ రీమేక్ కథల వైపు వెళ్తున్నారా అని ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఒకటి రెండు అంటే ఏమో అనుకోవచ్చు కానీ రీ ఎంట్రీ ఇచ్చిన దగ్గర్నుంచి కూడా చిరు రీమేక్ కథలనే ఎక్కువగా నమ్ముకుంటున్నాడు.

Tollywood Drugs Case: ఈడీ ముందు పూరీ జగన్నాథ్.. మిగిలిన 11 మంది సినీ ప్రముఖులను విచారించే తేదీలు ఇవే..


పదేళ్ళ తర్వాత ఆయన చేసిన ఖైదీ నెం 150 (Khaidi No 150).. తమిళంలో బ్లాక్‌బస్టర్ అయిన కత్తి సినిమాకు రీమేక్. మరోవైపు సైరా నరసింహారెడ్డి (Syeraa Narasimha Reddy) కూడా ఉయ్యాలవాడ జీవిత చరిత్ర కానీ సొంత కథ కాదు. ఇప్పుడు ఆచార్య మాత్రమే కొరటాల శివపై నమ్మకం ముందడుగేస్తున్నాడు. ఆ తర్వాత లూసీఫర్ రీమేక్ గాడ్ ఫాదర్.. వేదాళం రీమేక్ భోళా శంకర్ (Bhola Shankar) సినిమాలు లైన్‌లో ఉన్నాయి. ఇక బాబీ (Bobby) దర్శకత్వంలో నటించబోయే సినిమా స్ట్రెయిట్ కథే. ఇదిలా ఉంటే తాజాగా మరో రీమేక్‌పై కూడా చిరు మనసు పారేసుకున్నాడని ప్రచారం జరుగుతుంది.

Tridha Choudhury: బికినీతో సూర్యుడికే చెమటలు పట్టిస్తున్న ‘సూర్య వర్సెస్ సూర్య’ హీరోయిన్ త్రిదా చౌదరి..


అజిత్ (Ajith) హీరోగా వచ్చిన ఎన్నై అరింధాల్ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని చిరు భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా తెలుగులో ఎంతవాడు గానీ పేరుతో డబ్ అయింది. అయినా కూడా మళ్లీ చిరు రీమేక్ చేయాలనుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. వెంకీ కుడుములకు ఈ సినిమాను రీమేక్ చేసే ఛాన్స్ ఇస్తున్నాడని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. రీమేక్ సినిమాలు చేస్తే తప్పేంటి.. ఇవి కూడా కథలే కదా అని చెప్తుంటారంతా. కానీ చిరంజీవి లాంటి మెగాస్టార్ వరసగా రీమేక్ సినిమాలకే పరిమితం కావడం కూడా అంత మంచిది కాదని విశ్లేషకుల వాదన.
Published by:Praveen Kumar Vadla
First published: