WHY MAHESH NOT ACCEPTED SUKUMARS STORY WHAT HAPPEND BEFORE ALLU ARJUN MOVIE ANNOUCEMENT TA
మహేష్ నో చెప్పాడు.. అల్లు అర్జున్ సై అన్నాడు.. మధ్యలో ఏం జరిగింది..
మహేష్,. అల్లు అర్జున్ (Allu Arjun Mahesh)
‘రంగస్థలం’ వంటి భారీ సక్సెస్ తర్వాత సుకుమార్.. మహేష్ బాబుతో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో నెక్ట్స్ ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అయ్యాడు. అప్పటికే మహేష్‌తో చేయబోయే సినిమా కథకు సంబంధించిన లైన్ చెప్పి ఓకే చేయించుకున్న సుకుమార్.. ఆ తర్వాత పూర్త కథతో మహేష్‌ను సంతృప్తి పరచలేకపోయాడు. మరోవైపు అదే కథకు అల్లు అర్జున్ ఓకే చెప్పాడు. అల్లు అర్జున్ ఈ కథకు ఓకే చెప్పక ముందు అసలేం జరిగింది.
‘రంగస్థలం’ వంటి భారీ సక్సెస్ తర్వాత సుకుమార్.. మహేష్ బాబుతో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో నెక్ట్స్ ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అయ్యాడు. అప్పటికే మహేష్‌తో చేయబోయే సినిమా కథకు సంబంధించిన లైన్ చెప్పి ఓకే చేయించుకున్న సుకుమార్.. ఆ తర్వాత పూర్త కథతో మహేష్‌ను సంతృప్తి పరచలేకపోయాడు. ఆల్రెడీ ‘నేనొక్కడినే’ సినిమా విషయంలో జరిగిన పొరపాట్లను ఈ సినిమాలో పునరావృతం కాకుండా చూడాలని మహేష్..సుకుమార్‌కు సూచించాడు. కానీ సుకుమార్ మాత్రం కథ విషయంలో మార్పులు చేర్పులు చేయడానికి అంగీకరించకపోవడంతో మహేష్ బాబు.. ఈ సినిమా చేయోద్దని డిసైడ్ అయ్యాడు. అంతేకాదు మర్యాద ఈ ప్రాజెక్ట్ నుండి పక్కకు తప్పుకున్నాడు. అంతేకాదు సుకుమార్‌కు ఎంతో హుందాగా ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఆల్రెడీ ‘రంగస్థలం’ సినిమా అపుడే మైత్రీ మూవీ మేకర్స్‌తో సుకుమార్ మరో ప్రాజెక్ట్ చేస్తానని ఒప్పుకున్నాడు. వారి నుంచి ఒత్తిడి ఎక్కువ కావడంతో, ఎన్టీఆర్ కలిసి తదుపరి సినిమా తనతో ఉంటుందని అనౌన్స్ చేయమన్నాడు.
సుకుమార్ మహేష్ బాబు
ఐతే రాజమౌళి సినిమా ఎప్పటికీ పూర్తయ్యేది తెలియదు కాదు కాబట్టి అనౌన్స్ చేయలేనని ఎన్టీఆర్ సుకుమార్‌కు చెప్పాడట. అపుడే సుకుమార్.. అల్లు అర్జున్ను అప్రోచ్ అయి ఈ సినిమా కథను వినిపించాడు. అప్పటికే సుకుమార్ పరిస్థితి అర్థం చేసుకున్న బన్ని..త్రివిక్రమ్ సినిమా తర్వాత సుకుమార్ మూవీ ఉంటుందని అఫీషియల్‌గా అనౌన్స్ చేసాడు. అప్పటికే వీళ్లిద్దరి కలయికలో వచ్చిన ఆర్య, ఆర్య2 సినిమాలు నటుడిగా అల్లు అర్జున్‌కు మంచి పేరు తీసుకొచ్చాాయి. దీంతో ముచ్చటగా మూడోసారి సుకుమార్‌తో కలిసి పనిచేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం.
అల్లు అర్జున్ సుకుమార్
మొత్తానికి సుకుమార్ కథను ఎన్టీఆర్ ఎందుకు ఒద్దనుకున్నాడో తెలియదు కానీ..ఈ మ్యాటర్ మాత్రం ఫిల్మ్ నగర్లో జోరుగా ప్రచారం జరుగుతుంది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.