మహర్షికి యూఎస్‌లో షాక్... కలెక్షన్స్ అందుకే పడిపోయాయా?

Mahesh Movie Maharshi : మహేష్ అభిమానులే కాదు... సినిమా యూనిట్ కూడా షాకవుతున్న పరిస్థితి. డివైడ్ టాక్ రావడమే కారణమా?

Krishna Kumar N | news18-telugu
Updated: May 11, 2019, 1:12 PM IST
మహర్షికి యూఎస్‌లో షాక్... కలెక్షన్స్ అందుకే పడిపోయాయా?
మహేష్ బాబు (File)
  • Share this:
రికార్డులకు బ్రాండ్ అంబాసిడర్‌ అని చెబుతుంటారు ప్రిన్స్ మహేష్‌బాబును. అలాంటి ఆయన 25వ సినిమా మహర్షికి... తొలి రోజు నుంచే కలెక్షన్లు డౌనవుతూ వచ్చాయి. సరే తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్ ఫీవర్ ఉంది, సమ్మర్ హీట్ ఎక్కువగా కాబట్టి సినిమాపై ప్రేక్షకులు ఎక్కువ ఆశలు పెట్టుకోలేదని అనుకోవచ్చు. చిత్రమేంటంటే, ప్రతిసారీ ఓవర్సీస్ కలెక్షన్స్ కుమ్మేసే మహేష్ బాబుకు... మహర్షి విషయంలో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. ఈజీగా వన్ మిలియన్ మార్క్ దాటేస్తుందనుకున్న మూవీకి అలా జరగలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఏమాత్రం జనానికి ఎక్కని వన్ నేనొక్కడినే... విదేశాల్లో మంచి కలెక్షన్లు రాబట్టింది. మహర్షి విషయంలో కలెక్షన్లు బాగా పడిపోయాయి. నైజాం తర్వాత అతిపెద్ద మార్కెట్‌గా మారిన ఓవర్సీస్‌లో, ముఖ్యంగా ఆమెరికాలో సడన్‌గా వసూళ్లు తగ్గిపోయాయి. ఇందుకు కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. ఇందుకు సినిమాపై డివైడ్ టాక్ రావడం ఓ కారణమైతే... స్టోరీ నేరేషన్‌లో గ్రిప్ లేకపోవడం, సాగదీసినట్లు ఉండటం, రొటీన్ ఫార్ములాలా కనిపించడం వంటివి కొన్ని కారణాలుగా చెబుతున్నారు.

మహర్షి సినిమాకి ప్రీమియర్ల పరంగా అర మిలియన్‌ డాలర్లు మాత్రమే వచ్చాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏమాత్రం నచ్చని స్పైడర్‌ సినిమా... విదేశాల్లో మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది. మహర్షి మూవీ దాని కంటే చాలా బెటర్ అంటున్నారు. అలాంటిది ప్రీమియర్‌ టాప్‌ 10 లిస్ట్‌లో కూడా మహర్షిని నిలబడలేకపోయింది. సడన్‌గా ప్రీమియర్ ఆఫర్లు తొలగించడం వల్లే ఇలా జరిగిందని డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు.

ఈమధ్య టాలీవుడ్‌లో హిట్ టాక్ తెచ్చుకున్న జెర్సీ, మజిలీకి... ఓవర్సీస్‌లో సాదా సీదా వసూళ్లే వచ్చాయి. అలాంటప్పుడు యావరేజ్ టాక్ వచ్చిన మహర్షికి మిలియన్ డాలర్లు రాకపోవడం సాధారణ విషయమే అంటున్నా్రు ట్రేడ్ ఎనలిస్టులు. ఓపెనింగ్స్ నుంచే సినిమాకి మంచి మార్కులు పడలేదనీ... అందువల్ల ఈ పరిస్థితి తలెత్తిందని అంటున్నారు. మరి ఎవర్ గ్రీన్ మహేష్‌కే అలాగైతే, మిగతా హీరోల సంగతేంటని టెన్షన్ పడుతున్నారట బయ్యర్లు.

 ఇవి కూడా చదవండి :

పెళ్లైన యువతిని వేధించిన మైనర్ బాలుడు... ఆమె భర్తను చితకబాది...

బ్యాలెన్స్ ఫార్ములాతో లగడపాటి సర్వే... వైసీపీ షాక్ ఇస్తుందా...?ఫలితాల తర్వాత కలుద్దాం... చంద్రబాబు ప్రయత్నాలకు మమతా బెనర్జీ బ్రేక్...

రెస్ట్ లేని జగన్... లోటస్‌పాండ్‌కి నేతల క్యూ... సీనియర్ల సలహాలు...
First published: May 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు