ఎన్టీఆర్ హనుమాన్ మాల వేసుకోవడంపై అనేక రకాల అంశాలు బయటకు వస్తున్నాయి. ఆయన రాజమౌళి సెంటిమెంట్‌ను పోగొట్టుకొనేందుకే.. ఇలా మాల వేసుకున్నాడన్న వార్తలు వస్తున్నాయి.
ఆర్ఆర్ఆర్ సక్సెస్ తర్వాత.. ఆ సినిమాలో నటించిన రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు మాలలు ధరించారు. రామ్ చరణ్ అయ్యప్ప మాల వేసుకుంటే.. జూనియర్ ఎన్టీఆర్ హనుమాన్ మాల వేసుకున్నాడు. అయితే రామ్ చరణ్ విషయానికి వస్తే.. చరణ్ ప్రతీ ఏడాది అయ్యప్ప మాల వేసుకుంటాడు. చాలా సందర్భల్లో చరణ్‌ను అయ్యప్ప దీక్షలో మనంచూశాం. కానీ ఎన్టీఆర్ మాత్రం ఇంతవరకు ఎలాటి దీక్షకు దిగలేదు. దీంతో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ హనుమాన్ మాల ఎందుకు వేసుకున్నాడో అనేది ఇప్పుడు హట్ టాపిక్‌గా మారింది.
2018లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అరవింద సమేత సినిమా తర్వాత గత నాలుగు సంవత్సరాల నుంచి ఎన్టీఆర్ ఎలాంటి సినిమాలలో నటించలేదు. అయితే అంత పెద్ద గ్యాప్ తర్వాత వచ్చిన RRR సినిమా మంచి విజయాన్ని అందుకున్న ఎన్టీఆర్ ఈ సినిమా సక్సెస్ అవడంతో హనుమాన్ దీక్ష తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈ ఈ విధంగా ఎన్టీఆర్ హనుమాన్ దీక్ష తీసుకోవడానికి కారణం ఏంటి అనే విషయంపై పలువురు ఆరా తీశారు.
ఎన్టీఆర్ హనుమాన్ దీక్ష తీసుకోవడం వెనక ఓ కారణం ఉంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.కేవలం దోష నివారణ కోసమే ఎన్టీఆర్ హనుమాన్ దీక్ష తీసుకున్నారని పెద్ద ఎత్తున వార్తలు వినపడుతున్నాయి. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తే ఆ హీరో తదుపరి చిత్రం ఫ్లాప్ అవుతుందనే సెంటిమెంట్ ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ఇదే విషయాన్ని ఇటీవలే ఆచార్య ప్రిరిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి కూడా అన్నారు. ఆ సెంటిమెంట్‌ను తాను నమ్మనన్నారు చిరు. చరణ్ ఆచార్యతో రాజమౌళి హీరోలకు సంబంధించి వెంటాడుతున్న ఆ సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తాడన్నారు మెగాస్టార్.
చిరంజీవి లాంటి పెద్ద హీరో అలా అన్న కూడా... హీరోలను మాత్రం రాజమౌళి సెంటిమెంట్ టెన్షన్ పుట్టిస్తుందనే చెప్పాలి. ఈ క్రమంలోనే RRR సినిమా ద్వారా మంచి విజయాన్ని అందుకున్న ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం కూడా విజయవంతం కావాలని, ఈ సెంటిమెంట్ అనే దోషం నుంచి తప్పించుకోవడం కోసమే హనుమాన్ దీక్ష తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విధంగా హనుమాన్ దీక్షతో తన జాతకంలో వున్న దోషాలు కూడా తొలగిపోవడం కోసం త్వరలోనే హోమం కూడా చేయబోతున్నారు అంటూ ఆయన సన్నిహితులు వెల్లడిస్తున్నారు.
Published by:Sultana Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.