WHY JR NTR CALM ON POLITICS HERE ARE THE DETAILS TA
రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ మౌనానికి కారణాలు అవేనా.. ? ఇంతకీ తారక్ అడుగులు ఎటువైపు..
జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ప్రచారం
రాముడు పెట్టిన తేలుగుదేశం పార్టీలో ఆయారాం- గయారాంలు.. ఎక్కువయ్యారు. చిన్న రాముడ్నైనా కాపాడుకుంటారా అంటే అదీ లేదు. ఇదీ సగటు టీడీపీ కార్యకర్త ఆవేదన. ఇంతకీ దేశం వర్సెస్ జూనియర్ ఇష్యూ ఏం చెబుతోంది? తెలుగుదేశంలోకి రామయ్య రీ ఎంట్రీ ఉంటుందా లేదా.
రాముడు పెట్టిన తేలుగుదేశం పార్టీలో ఆయారాం- గయారాంలు.. ఎక్కువయ్యారు. చిన్న రాముడ్నైనా కాపాడుకుంటారా అంటే అదీ లేదు. ఇదీ సగటు టీడీపీ కార్యకర్త ఆవేదన. ఇంతకీ దేశం వర్సెస్ జూనియర్ ఇష్యూ ఏం చెబుతోంది? తెలుగుదేశంలోకి రామయ్య రీ ఎంట్రీ ఉంటుందా లేదా. తాతయ్య తేజం.. చిన్నాన్న నైజం.. కలిసున్న పసి రూపం.. అనే పాట జూ. ఎన్టీఆర్ కి అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. సీనియర్ ఎన్టీఆర్ పేరు పుణికిపుచ్చుకుని.. నట వారసత్వంలో ఆయన అడుగు జాడల్లో దూసుకుపోతున్నాడీ చిన్నఎన్టీఆర్. అలాంటి బుడ్డోడు ఇప్పుడు టీడీపీకి ఏమవుతాడు? ఈక్వేషన్లను బట్టీ జూనియర్ ఇటా అటా? ఇలాంటి అందగాడ్ని.. నిండు చందురూడ్ని.. దేశం నిజంగానే కూరలో కరివేపాకుల వాడుకోని ఒదిలేసిందా..నందమూరి ఫ్యామిలీ థార్డ్ జనరేషన్లో.. మోస్ట్ పవర్ఫుల్.. ఎఫిషియంట్.. ఎఫెక్టివ్.. జూనియర్ ఎన్టీఆర్. మనవాడు నందమూరి బ్యాచ్ లోకెల్లా యంగ్ అండ్ డైనమిక్ హీరో. యాక్టింగ్ స్కిల్స్ లో సీనియర్ కు ఏ మాత్రం తీసి పోని టాలెంట్ చూపుతాడనడంలో డౌట్ లేదు.
బాలయ్యతో జూనియర్ ఎన్టీఆర్
ఇప్పటి వరకూ జూనియర్ ప్రేక్షకులను అలరించిన తీరు అమోఘం. వారి నాడి పట్టి ఆడించే నటన అద్భుతం. అభిమానులను సొంతం చేసుకున్న తీరు కూడా అమేయం. అదే కాన్ఫిడెన్స్. అదే పవర్.
ఎన్టీఆర్ కీ టీడీపీకీ రాజకీయంగా విడదీయలేని అనుబంధం. పాపం ఈ విషయం ఎంత అయిష్టమైనా చంద్రబాబు కూడా ఒప్పుకోక తప్పని పరిస్థితి. ఇక నటవారసత్వంలో బాలకృష్ణ తర్వాత ఆ బాధ్యతలు భుజానికెత్తుకుని జూనియర్ ఒక రేంజ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు హిట్టు మీద హిట్టు కొడుతు మంచి టెంపర్ మీదున్నాడు. ఇవి ప్రత్యక్షంగా పరోక్షంగా టీడీపీకి టానిక్కుల్లా పనిచేస్తుంటాయి. ఆ పార్టీ వారు ఎంత స్ట్రాటజీ ప్లే చేసినా.. టీడీపీకి సూటబుల్ బ్రాండ్ అంబాసిడర్ జూనియరే. అందుకు రీజన్లు లేక పోలేదు. తేజంలో.. రూపంలో.. నైజంలో.. నందమూరి నాయకుల గుణగణాలే టీడీపీకి ఆయువు పట్లు.
జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ప్రచారం
2009 ఎన్నికల్లో జూనియర్ టీడీపీ తరుపున కాలికి బలం కట్టుకొని మరి ప్రచారం చేసాడు. అంతేకాదు ఎలక్షన్ చివర్లో యాక్సిడెంట్‌కు గురయ్యాడు. ఐనా బెడ్ మీదు నుంచి ప్రచారం చేసాడు. ఆ తర్వాత తెలుగు దేశం పార్టీని జూనియర్ ఎన్టీఆర్‌ను పూర్తిగా పక్కన పెట్టింది. ఆ తర్వాత టీడీపీకి ఎన్టీఆర్ దూరం పాటిస్తూనే ఉన్నాడు.కట్ చేస్తే 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో మాత్రం అభిమానులతో పాటు ప్రజలందరు ఓటెయమని చెప్పినా.. తెలుగు దేశానికి కించిత్ ప్రచారం కూడా చేయలేదు. అంతేకాదు జూనియర్ ఎన్టీఆర్‌కు స్వయానా పిల్లనిచ్చిన మామ వైసీపీలో జాయిన్ అయిన కిక్కురు మనలేదు. అంతేకాదు 2018 చివర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సొంత అక్క సుహాసిని పోటీ చేసిన అక్కడ ప్రచారానికి కూడా వెళ్లలేదు. కేవలం అక్కకు ఓటేయని ఏదో నామ్ కే వాస్తే చెప్పాడు కానీ ఎక్కడ రంగంలోకి దిగి ప్రచారం చేయలేదు.
ఎన్టీఆర్ సుహాసిని ఫైల్ ఫోటోస్
ప్రస్తుతం పరిస్థితుల్లో కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న ఈ సమయంలో అనవసరంగా రాజకీయాల్లో ప్రవేశించి లేనిపోని తలనొప్పులు తెచ్చుకోవడం కంటే వాటికి దూరంగా ఉండటమే బెటర్ అని జూనియర్ ఎన్టీఆర్ ఆలోచనలా ఉంది. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తులోనైనా తెలుగు దేశం పగ్గాలు చేపడతాడా లేదా అన్నదానికి సమాధానం దొరకాలంటే ఇంకొన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సిందే.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.