WHY JABARDASTH ANCHOR RASHMI GAUTAM WEAR SMALL GOWNS NK
మళ్లీ పొట్టి బట్టల్లో రష్మీగౌతమ్... ఇదీ ప్లాన్
రష్మీ గౌతమ్ (credit - YT - ETV Jabardasth)
Rashmi Gautam : తెలుగు ప్రజల గుండెల్లో నిద్రపోయే యాంకర్లలో రష్మీ గౌతమ్ ప్రత్యేకం. హాట్ అందాలతో హీట్ పుట్టించే ఈ బ్యూటీ... తాజాగా మళ్లీ పొట్టి గౌనుల్లో కనిపిస్తూ సందడి చేస్తోంది.
జబర్దస్త్ కామెడీ షోల నుంచీ నాగబాబు వెళ్లిపోయిన తర్వాత... ఆ షోల్లో చాలా మార్పులు వస్తున్నాయి. టీమ్స్ మారాయి. ఒక్కో ఎపిసోడ్‌కి ఒక్కో సెలబ్రిటీ జడ్జి వస్తున్నారు. స్కిట్లలో కూడా సెలబ్రిటీ స్కిట్లు తెస్తున్నారు. అటు ఎమ్మెల్యే రోజా, ఇటు యాంకర్ రష్మీ గౌతమ్.... టీమ్ లీడర్లు ఈ షోలను నిలబెట్టేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో యాంకర్ రష్మీ... ఇదివరకట్లా ఫుల్ డ్రెస్సుల్లో కాకుండా... పొట్టి డ్రెస్సుల్లో దర్శనమిస్తోంది. చలికాలంలో హీట్ పెంచుతూ... చాలీ చాలని గౌనుల్లో కనిపిస్తూ... ఫ్యాన్స్‌కి గిలిగింతలు పెడుతోంది. ఇంతకు ముందు శారీల్లో కనిపించిన రష్మీ... ఇప్పుడు పొట్టి గౌనులు వేసుకోవడం వెనక జబర్దస్త్ రేటింగ్స్‌ను నిలబెట్టడానికేనని తెలిసింది. డిసెంబర్లో తొలి ఎక్స్ట్రా జబర్దస్త్ షోలో వైట్ శారీతో కనిపించి అలరించిన ఈ బ్యూటీ... ఆ తర్వాత వరుసగా రెండు ఎపిసోడ్లలో గౌనుల్లోనే కనిపిస్తూ... కుర్రకారుకు కిక్కెక్కిస్తోంది.
రష్మీ గౌతమ్ (credit - YT - ETV Jabardasth)
ఇలా చెయ్యడం వల్ల షోకి రేటింగ్స్‌తో పాటూ... రష్మీ కెరీర్ గ్రాఫ్ కూడా మళ్లీ దూసుకెళ్లే ఛాన్స్ ఉంటుందా అన్నది ఇప్పుడు టాలీవుడ్ హాట్ టాపిక్స్‌లో ఒకటి. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ... అవకాశం ఉన్నప్పుడు అడపా దడపా సినిమాలు చేస్తూ... తగిన మోతాదుల్లో అందాలను కనువిందు చేస్తూ... తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంటోంది రష్మీ. ఆ మధ్య రష్మీ నటించిన 'గుంటూరు టాకీస్' కేవలం రష్మీ పేరు, ఆమె అందచందాలతోనే హిట్ అయ్యిందని అంటారు ఆమె అభిమానులు. ఇదే సమయంలో... ఫొటోషూట్లతో కూడా రష్మీ తన గ్రాఫ్ పడిపోకుండా జాగ్రత్త పడుతోంది.
రష్మీ గౌతమ్ (credit - YT - ETV Jabardasth)
ఇక నాగబాబు కొత్తగా జడ్జిగా వ్యవహరిస్తున్న జీతెలుగులోని "అదిరింది" షో... ఆదివారం (డిసెంబర్ 22) నుంచీ ప్రసారం కాబోతోంది. ఇప్పటికే ప్రోమోకి మంచి క్రేజ్ వచ్చినప్పటికీ... ఇది జబర్దస్త్‌కి కాపీలా ఉందని అంటున్నారు. నాగబాబు మాత్రం దీన్ని గట్టెక్కించి... జబర్దస్త్‌కి గట్టి పోటీ ఇవ్వాలని చూస్తున్నారు. ఈ షోలో నాగబాబుకు తోడుగా ఆయన కూతురు నిహారిక కొణిదెల కూడా ఉండటం మరో హైలెట్. ఇక ఇందులో ధనరాజ్, వేణు, చమ్మక్ చంద్ర, ఆర్పీలు టీమ్ లీడర్లుగా ఉన్నారు. టీవీ నటి సమీరా యాంకర్‌గా కనిపించబోతోంది. ఇది హిట్టైతే... జబర్దస్త్ లాగా దీన్ని కూడా వారానికి రెండు ఎపిసోడ్లు చేసే ప్లాన్‌లో యూనిట్ ఉన్నట్లు తెలిసింది.
అదిరింది (credit - YT - Zee Cinemalu)
Published by:Krishna Kumar N
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.