పరువు తీసేసిన యాంకర్ సుమ... సరిలేరు నీకెవ్వరు అంటూ...

పరువు తీసేసిన యాంకర్ సుమ... సరిలేరు నీకెవ్వరు అంటూ... (credit - YT - Lahari Music | T-Series)

Actress Rashmika Mandanna Speech : సరిలేరు నీకెవ్వరు మెగా సూపర్ ఈవెంట్‌లో యాంకర్ సుమ చేసిన ఓ కామెంట్‌పై దుమారం రేగుతోంది. ఆమె ఏమంది? ఏంటా వివాదం?

 • Share this:
  Sarileru Neekevvaru : ఎవర్ గ్రీన్ హీరో మహేష్ బాబు నటించిన... సరిలేరు నీకెవ్వరు సినిమా... మరో నాల్రోజుల్లో (జనవరి 11) ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. మహేష్ అభిమానులైతే... టెన్షన్ తట్టుకోలేకపోతున్నారు. ఎప్పుడు సినిమా రిలీజవుతుందా... ఎప్పుడు చూసేద్దామా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంగా... చిత్ర యూనిట్... ఎల్బీ స్టేడియంలో మెగా ఈవెంట్ నిర్వహించింది. ఈ ఈవెంట్‌కి మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా రావడం... 15 ఏళ్ల తర్వాత విజయశాంతి మళ్లీ ఈ సినిమాలో నటించి... ఈ ఈవెంట్‌కి రావడంతో... ఇది సూపర్ సక్సెస్ అయ్యింది. ఐతే... ఇదే ఈవెంట్‌కి యాంకర్ కమ్ ప్రజెంటర్‌గా చేసిన సుమ కనకాల వేసిన ఓ డైలాగ్‌పై ఇప్పుడు ఇండస్ట్రీ గుర్రుగా ఉంది. ఆమె అలా ఎలా అంటారని ప్రశ్నిస్తున్నారు సినీ ప్రముఖులు.

  అసలేం జరిగింది? : సరిలేరు నీకెవ్వరు ఈవెంట్‌లో సినిమాకి సంబంధించిన సినీ ప్రముఖులంతా... ఒకరి తర్వాత ఒకరుగా స్టేజ్‌పైకి వచ్చి స్పీచ్ ఇస్తున్నారు. ఇలా వచ్చినవారు సినిమాలో నటులను, దర్శక, నిర్మాతలను, టెక్నికల్ టీమ్‌ను మెచ్చుకోవడం, అలాగే... తమ పాత్ర గురించి వివరించడం సహజం. సరిలేరు నీకెవ్వరు ఈవెంట్‌లో కూడా అదే జరిగింది. ఆ క్రమంలో హీరోయిన్ రష్మిక మందన్నను స్టేజ్‌పైకి పిలిచారు సుమ. చక్కగా నవ్వుతూ... ఎంతో ఉత్సాహంతో వచ్చిన రష్మిక... ఓ నాలుగు డైలాగ్స్ మాట్లాడింది. ఆ తర్వాత... ఇంత మంది మహేష్ అభిమానులను చూస్తుంటే... తనకు ఏం మాట్లాడాలో తెలియట్లేదని... ఎక్సైట్‌మెంట్‌తో చెప్పింది. వెంటనే అందుకున్న సుమ... పర్వాలేదు మాట్లాడు... "ఎవరి డబ్బా వాళ్లు కొట్టుకోవాలి మీరు మాట్లాడండి" అనేశారు. ఆ తర్వాత... మరి కాసేపు మాట్లాడి రష్మిక వెళ్లిపోయింది.

  సుమ వేసిన ఎవరి డబ్బా వాళ్లు కొట్టుకోవాలి డైలాగ్‌పై ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఈ డైలాగ్ ద్వారా సుమ... సరిలేరు నీకెవ్వరు చిత్ర యూనిట్ మొత్తాన్నీ అవమానించారనీ, స్టేజ్ పైకి వచ్చేవాళ్లు డబ్బా కొట్టుకుంటున్నారని ఆమె ఎలా అంటారని ప్రశ్నిస్తున్నారు. టాలీవుడ్‌లో సుమ కనకాలకు ఎంతో మంచి పేరుంది. షో ప్రజెంటర్‌గా ఆమె ఏ ఈవెంట్‌నైనా చక్కగా నిర్వహిస్తారనీ... ఎంతో హోమ్లీగా నడిపిస్తారనే పాజిటివ్ టాక్ ఉంది. అలాంటి ఆమె... ఇలా పరువు తీసేసేలా మాట్లాడటమేంటన్న వాదన ఇప్పుడు టాలీవుడ్‌లో వినిపిస్తోంది. దీనిపై సుమ ఇంకా స్పందించలేదు. ఆమె ఏ ఉద్దేశంతో అలా అన్నారో చెప్పాలనే డిమాండ్ మహేష్ బాబు ఫ్యాన్స్ నుంచీ వినిపిస్తోంది.
  Published by:Krishna Kumar N
  First published: