Home /News /movies /

WHY AMMA RAJASEKHAR SURYA KIRAN DEVI NAGAVALLI NOT ATTEND FOR BIGG BOSS 4 REUNION MNJ

Bigg Boss 4: 'బిగ్‌బాస్ 4' రీయూనియ‌న్‌.. ఆ ముగ్గురు మాజీ కంటెస్టెంట్‌లు ఎందుకు రాలేదు..!

బిగ్‌బాస్ 4 రీయూనియ‌న్‌

బిగ్‌బాస్ 4 రీయూనియ‌న్‌

తెలుగు బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 4(Bigg Boss 4 Telugu) ఫైనల్ కి వచ్చేసింది. నాగార్జున(Nagarjuna) వ్యాఖ్యతగా వ్యవహరిస్తోన్న ఈ సీజన్ గ్రాండ్ ఫినాలే ఈ వారాంతం జరగనుండగా.. మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ముఖ్య అతిథిగా రానున్నారు

ఇంకా చదవండి ...
    తెలుగు బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 4 ఫైనల్ కి వచ్చేసింది. నాగార్జున వ్యాఖ్యతగా వ్యవహరిస్తోన్న ఈ సీజన్ గ్రాండ్ ఫినాలే ఈ వారాంతం జరగనుండగా.. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రానున్నారు. దీంతో ఇటు బిగ్‌బాస్ అభిమానులే కాదు అటు మెగాభిమానులు కూడా బిగ్‌బాస్ ఫైనల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సారి టైటిల్ ఎవ‌రు సొంతం చేసుకుంటారు..? ర‌న్న‌ర‌ప్‌గా ఎవ‌రు నిలుస్తారు..? వ‌ంటి ప్ర‌శ్న‌లకు స‌మాధానం మ‌రో రోజులో తేల‌నుంది. ఇక బిగ్‌బాస్ ఫైనల్ కి రావడంతో శుక్రవారం నాటి ఎపిసోడ్ లో మాజీ కంటెస్టెంట్ లు సందడి చేశారు. మొదట మోనాల్ హౌజ్ లోకి రీఎంట్రీ ఇవ్వగా.. ఆ తరువాత ఒక్కొక్కరుగా వచ్చారు. అయితే కరోనా నేపథ్యంలో ఈ సారి లోపలికి ఎవ్వరూ వెళ్లకుండా గ్లాస్ ని అడ్డుపెట్టగా.. మాజీ కంటెస్టెంట్ లు బయటి నుంచే హౌజ్ లోని వారితో ఇంటరాక్ట్ అయ్యారు. ఇక ఇవాళ గంగవ్వ హౌజ్ లోకి రానుంది.

    అయితే ఈ రీయూనియన్ కి ముగ్గురు మాజీ కంటెస్టెంట్ లు మాత్రం దూరమయ్యారు. ఈ సీజన్ లో పాల్గొన్న అమ్మ రాజశేఖర్, సూర్య కిరణ్, దేవీ నాగవల్లిలు రీయూనియన్ కి రాలేదు. వీరు ఎందుకు రాలేదన్న దానిపై ప్రస్తుతం బిగ్ బాస్ అభిమానుల్లో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో వారు ముగ్గురికి సంబంధించిన కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

    ఈ సీజన్ లో మొదటగా ఎలిమినేట్ అయిన దర్శకుడు సూర్య కిరణ్ కొన్ని వ్యక్తిగత కారణాల వలన రీయూనియన్ కి రాలేదట. అయితే గ్రాండ్ ఫినాలేకు వస్తానని నిర్వాహకులతో చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే వృత్తి రీత్యా బిజీగా ఉండటం వలన జర్నలిస్ట్ దేవీ నాగవల్లి కూడా ఈ రీయూనియన్ కి రానట్లు సమాచారం.

    Bigg Boss 4 Telugu, Bigg Boss 4 final journey, Bigg Boss 4 Grand Finale, Bigg Boss 4 reunion, Bigg Boss 4 updates, Bigg Boss 4 winner
    బిగ్‌బాస్ 4 రీయూనియ‌న్‌


    అయితే వీరిద్దరిని అటు ఉంచితే అమ్మ రాజశేఖర్ మాస్టర్ రాకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హౌజ్ లోకి వెళ్లిన తరువాత మాస్టర్ గ్రాఫ్ బాగానే ఉన్నప్పటికీ.. రానురాను పడిపోతూ వచ్చింది. ముఖ్యంగా అభిజీత్, అఖిల్ లు అంటే మాస్టర్ కి పెద్దగా నచ్చరు. బయటకు వచ్చాక పలు ఇంటర్వ్యూల్లో మాస్టర్ అదే వెల్లడించారు. వారిద్దరు బిగ్‌బాస్ కి అర్హులు కారంటూ కామెంట్లు చేశారు ఇప్పుడు ఆ ఇద్దరు టాప్ 5లో ఉన్నారు. అందుకే మాస్టర్ రానట్లు టాక్ నడుస్తోంది. అయితే మరోవైపు స్టార్ మాలో త్వరలో ప్రారంభం కాబోతున్న డ్యాన్స్ ప్లస్ లో ఒక జడ్జిగా అమ్మ రాజశేఖర్ ఉండనున్నారట. దానికి సంబంధించిన పనుల్లో ఉండటం వలనే రాలేకపోయాడని కూడా తెలుస్తోంది. మరి ఈ ముగ్గురు గ్రాండ్ ఫినాలే సమయంలోనైనా వస్తారేమో చూడాలి.
    Published by:Manjula S
    First published:

    Tags: Bigg Boss 4 Telugu, Megastar Chiranjeevi, Nagarjuna Akkineni, Television News

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు