‘సైరా’ ప్రమోషన్స్‌కు అమితాబ్ ఎందుకు దూరంగా ఉన్నారు..

చిరంజీవి హీరోగా నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా విడుదలకు వారం రోజులు మాత్రమే మిగిలి ఉన్నా.. అమితాబ్ మాత్రం ఈ సినిమా పై సైలెంట్ మెయింటేన్ చేయడం వెనక ఇద్దరి మధ్య ఏదో జరిగిందా అని బీ టౌన్ వర్గాలతో పాటు ఫిల్మ్ నగర్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

news18-telugu
Updated: September 23, 2019, 9:48 PM IST
‘సైరా’ ప్రమోషన్స్‌కు అమితాబ్ ఎందుకు దూరంగా ఉన్నారు..
సైరా నరసింహా రెడ్డిలో సైరా గురువు పాత్రలో అమితాబ్ బచ్చన్
  • Share this:
మెగాస్టార్ చిరంజీవి డ్రీం ప్రాజెక్ట్ ‘సైరా నరసింహారెడ్డి’. తండ్రి కలను నెరవేర్చడంలో భాగంగా చిరు తనయుడు రామ్ చరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బిగ్గెస్ట్ హిస్టారికల్ మూవీ ఇది. ఈ సినిమా రిలీజ్ బరిలో దిగడానికి సై అంటోంది. అక్టోబర్ 2న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను ఈ నెల 22న నిర్వహించారు. ఇప్పటికే ముంబాయిలో ఘనంగా ఈ సినిమా టీజర్‌ను గ్రాండ్‌గా లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇదిలా ఉంటే ఈ మూవీలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురువైన గోసాయి వెంకన్నపాత్రలో నటించారు. ఐతే తమ సినిమాలో బిగ్‌బీ  భాగం కావడాన్ని మెగాస్టార్ గౌరవంగా ఫీలవుతున్నాను అంటూ పులు సందర్భాల్లో  వెల్లడించారు. అంతేకాకుండా ప్రయాణానికి తాము ఏర్పాట్లు చేస్తామని చెప్పినా.. బిగ్ బీ తన సొంత చార్టర్ ఫ్లైట్‌లోనే షూటింగ్‌కు వచ్చే వారని.. తన సినిమాలో అమితాబ్ భాగం అవ్వడం తన అదృష్టమని చిరు సంతోషంగా చెప్పుకొచ్చారు.ఐతే.. బిగ్ బీ మాత్రం ‘సైరా’ సినిమాపై ఎప్పటినుంచో సైలెంట్‌గా ఉంటూ వస్తున్నారు.

cold war between chiranjeevi and amitabh bachchan for sye raa narasimha reddy movie these are the reasons,sye raa narasimha reddy trailer,sye raa narasimha reddy trailer talk,chiranjeevi,amitabh bachchan,chiranjeevi amitabh bachchan,chiranjeevi amitabh bachchan cold war,sye raa narasimha reddy chiranjeevi amitabh bachchanSye Raa Narasimha Reddy,Sye Raa Narasimha Reddy movie,Sye Raa Narasimha Reddy trailer,chiranjeevi twitter,chiranjeevi instagram,sye raa trailer,Sye Raa digital and satellite rights,Sye Raa Narasimha Reddy digital rights,sye raa satellite rights,telugu cinema,సైరా,సైరా డిజిటల్ రైట్స్,సైరా శాటిలైట్ రైట్స్,తెలుగు సినిమా,సైరా నరసింహా రెడ్డి,అమితాబ్ బచ్చన్,చిరంజీవి,అమితాబ్ బచ్చన్ చిరంజీవి,సైరా నరసింహారెడ్డి అమితాబ్ బచ్చన్ చిరంజీవి,
‘సైరా నరసింహారెడ్డి’ కొత్త పోస్టర్ (Twitter/Photo)

అటు ఏ ఇంటర్వ్యూలో గానీ.. ఇటు తన ట్విట్టర్‌లో గానీ ఈ మూవీ గురించి అమితాబ్ స్పందించకపోవడం విశేషం. సినిమా షూటింగ్‌ ప్రారంభమైన మొదట్లో అమితాబ్.. ఈ సినిమాలో భాగం కావడాన్ని గౌరవంగా భావిస్తున్నట్టు ట్వీట్ చేసారు. ఆ తర్వాత ‘సైరా..నరసింహారెడ్డి’ విషయమై అమితాబ్ బచ్చన్ ఒక ట్వీట్ కూడా చేయకుండా సైలెంట్ మెయింటెన్ చేస్తున్నారు.

cold war between chiranjeevi and amitabh bachchan for sye raa narasimha reddy movie these are the reasons,sye raa narasimha reddy trailer,sye raa narasimha reddy trailer talk,chiranjeevi,amitabh bachchan,chiranjeevi amitabh bachchan,chiranjeevi amitabh bachchan cold war,sye raa narasimha reddy chiranjeevi amitabh bachchanSye Raa Narasimha Reddy,Sye Raa Narasimha Reddy movie,Sye Raa Narasimha Reddy trailer,chiranjeevi twitter,chiranjeevi instagram,sye raa trailer,Sye Raa digital and satellite rights,Sye Raa Narasimha Reddy digital rights,sye raa satellite rights,telugu cinema,సైరా,సైరా డిజిటల్ రైట్స్,సైరా శాటిలైట్ రైట్స్,తెలుగు సినిమా,సైరా నరసింహా రెడ్డి,అమితాబ్ బచ్చన్,చిరంజీవి,అమితాబ్ బచ్చన్ చిరంజీవి,సైరా నరసింహారెడ్డి అమితాబ్ బచ్చన్ చిరంజీవి,
అమితాబ్,చిరంజీవి

తాను నటించే ప్రతి సినిమా విశేషాలను అమితాబ్ సాధారణంగా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూనే ఉంటారు . అయితే ఈ సినిమాలో నటించినప్పటికీ బిగ్‌బీ  మాత్రం ఎలాంటి ప్రమోషన్లుకు హాజరు కాకపోవడం గమనర్హం. ముంబాయిలో జరిగిన ప్రమోషన్‌లో కూడా పాల్గొనలేదు కాదుకదా ట్వీట్ కూడా చేయలేదు. మరి ఈ నేపథ్యంలో ఈ సినిమా విషయమై..అమితాబ్, మెగా ఫ్యామిలీ మధ్య ఏమైనా జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తిప్పికొడితే.. సైరా విడుదలకు మరో వారం రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇలాంటి సమయంలో  ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా విషయమై అమితాబ్ బచ్చన్ స్పందిస్తారా లేదా అనేది చూడాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: September 23, 2019, 9:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading