బాలకృష్ణ ప్రవర్తన వెనక అసలు కారణం అదేనా..

ఎన్నడు లేనట్టు టీడీపీ హిందూపురం ఎమ్మెల్యే నటుడు నందమూరి బాలకృష్ణ..తన ఎన్నికల ప్రచారంలో మీడియాపై అభిమానులపై అసహనం ప్రవర్తించడం ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: April 10, 2019, 4:38 PM IST
బాలకృష్ణ ప్రవర్తన వెనక అసలు కారణం అదేనా..
నందమూరి బాలకృష్ణ(ఫైల్ ఫోటో)
  • Share this:
ఎన్నడు లేనట్టు టీడీపీ హిందూపురం ఎమ్మెల్యే నటుడు నందమూరి బాలకృష్ణ..తన ఎన్నికల ప్రచారంలో మీడియాపై అభిమానులపై అసహనం ప్రవర్తించడం ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నడు లేనిది ఆయన మీడియాపై అభిమానులపై అకారణంగా చేయి చేసుకోవడం ఆయన ఫ్యాన్స్‌ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అంతేకాదు ఈసారి ఎన్నికల ప్రచారంలో బాలయ్య మొఖంలో ఎక్కడా నవ్వు కనిపించలేదని టీడీపీతో పాటు బాలయ్య సన్నిహితులే చెప్పుకుంటున్నారు. బాలయ్య కోపం వెనక పెద్ద కారణమే ఉందంటున్నారు. ఆయన ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తన తండ్రి జీవితంపై క్రిష్ దర్శకత్వంలో చేసిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’,‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాలు ఒక దాన్ని మించి మరొకటి ఫ్లాప్ అయ్యాయి. ఫ్లాపులు ఎపుడు వచ్చిన అంతగా పట్టించుకోని బాలకృష్ణ మాత్రం తన తండ్రి జీవితంపై తానే నిర్మాతగా తెరకెక్కించిన ఎన్టీఆర్ బయోపిక్ డిజాస్టర్‌ కావడంతో ఓ రేంజ్‌లో రగిలిపోతున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నారు. ఇక బాలయ్య తెలుగుదేశం కోసం ప్రచారం చేయడం ఇదే మొదటిసారి కాదు. ఎన్నో సార్లు పార్టీ కోసం ప్రచారం నిర్వహించారు.

Why nandamuri balakrishna behaving election campaigning like this with his followers rude behavior,balakrishna slaps his fan,balakrishna angry on fan,balakrishna beats fan,balakrishna fires on fans,balakrishna slaps fan,andhra pradesh news,andhra pradesh politics,tollywood news,telugu cinema,balakrishna fires,balakrishna actor slaps a fan,balakrishna slaps a fan,balakrishna slapped fan,balakrishna fires on fan,balakrishna attack mojo tv,balakrishna ntr biopic flop effect,ram gopal varma balakrishna,balakrishna hindupur,balakrishna lakshmis ntr ram gopal varma,అభిమానిపై చేయి చేసుకున్న బాలయ్య, నందమూరి బాలకృష్ణ అభిమానిని కొట్టాడు, మళ్లీ అభిమానిని కొట్టిన బాలకృష్ణ, నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారం, విజయనగరంలో అభిమానిపై బాలయ్య దాడి,బాలకృష్ణ,బాలయ్య,బాలకృష్ణ ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు,ఏపీ న్యూస్,ఏపీ పాలిటిక్స్,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,
నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారం

గతంలొ ప్రచారం చేసేటపుడు జోక్స్ పేలుస్తూ ఉండేవాడు. ఈసారి మాత్రం ఏదో పోగొట్టుకున్న వాడిలా అనుక్షణం ఎన్టీఆర్ బయోపిక్ ప్లాప్‌ను తలుచుకుంటూ ఎన్నికల ప్రచారంలో ఆయన మాడ్లాడే మాటలు గాడి తప్పుతున్నాయని ఆయన ప్రసంగాలను గమనిస్తున్న విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. సాంకేతిక విప్లవం పెరిగిన పుణ్యామా అని ఇపుడు అందరి చేతుల్లో ఫోన్లు వచ్చాయి. సమాచారం క్షణాల్లో ఒక చోటు నుంచి మరో చోటుకు చేరిపోతుంది. ఆ కాస్తా విషయం తెలిసిన బాలయ్య ఆ సంగతిని పట్టించుకోక తన మానానా తను అనుకున్నది చేసుకుంటూ పోతున్నాడు. ఇదే ఆయన కొంప ముంచుతుంది.

Why nandamuri balakrishna behaving election campaigning like this with his followers rude behavior,balakrishna slaps his fan,balakrishna angry on fan,balakrishna beats fan,balakrishna fires on fans,balakrishna slaps fan,andhra pradesh news,andhra pradesh politics,tollywood news,telugu cinema,balakrishna fires,balakrishna actor slaps a fan,balakrishna slaps a fan,balakrishna slapped fan,balakrishna fires on fan,balakrishna attack mojo tv,balakrishna ntr biopic flop effect,ram gopal varma balakrishna,balakrishna hindupur,balakrishna lakshmis ntr ram gopal varma,అభిమానిపై చేయి చేసుకున్న బాలయ్య, నందమూరి బాలకృష్ణ అభిమానిని కొట్టాడు, మళ్లీ అభిమానిని కొట్టిన బాలకృష్ణ, నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారం, విజయనగరంలో అభిమానిపై బాలయ్య దాడి,బాలకృష్ణ,బాలయ్య,బాలకృష్ణ ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు,ఏపీ న్యూస్,ఏపీ పాలిటిక్స్,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,
నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారం
ఒకసారి ఒక టీవీ ఛానెల్‌పై ఆగ్రహం వ్యక్తం చేసి తర్వాత బాలయ్య క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే కదా.  గత కొంతకాలంగా నోరి జారి, చెయ్యి చేసుకోని కెమెరాలకు దొరికిపోయినా.. ఆ విషయాలను మాత్రం బాలయ్య అంతగా పట్టించుకోవడం లేదు. ఇది చాలదు అన్నట్టు శ్రీకాకుళం జిల్లా చీపురు పల్లిలో బాలయ్య స్పీచ్ వినడానికి అభిమానులు పోటెత్తారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో కోపగించిన బాలయ్య ట్రాఫిక్ క్లియరెన్స్ చేద్దామని అక్కడికి చేరిన తన అభిమానులను అని చూడకుండా ఒక తోపు తోయడంతో అభిమానులు చాలా ఫీలయ్యారు. మొత్తానికి ఎన్టీఆర్ బయోపిక్‌ దారుణంగా ఫెయిల్ అవ్వడము ఒక  కారణం. మరోవైపు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను తెలంగాణలో రిలీజ్‌ను ఆపలేకపోయానన్న అసహనము బాలయ్య కోపాని కారణమని చెబుతున్నారు విశ్లేషకులు.  ఏపీలో మాత్రం విడుదల కాకుండా అడ్డుకోగలిగారు. ఏమైనా బాలయ్య తన సన్నిహితులపై, అభిమానులపై అసహనాన్ని ప్రదర్శించడం సినీ,రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
First published: April 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు