Prabhas - Deepika padukone: ప్ర‌భాస్ దృష్టిలో సూప‌ర్‌స్టార్ ఎవ‌రు?

Prabhas - Deepika padukone: ప్ర‌భాస్ దృష్టిలో సూప‌ర్‌స్టార్ ఎవ‌రు?

Whom does Prabhas consider as Superstar

Prabhas - Deepika padukone: రెబెల్‌ స్టార్‌ ప్రభాస్‌ దీపికా పదుకొనె పుట్టినరోజు సందర్భంగా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంలో ప్రభాస్‌ దీపికను ఏమని పిలిచాడో తెలుసా?

  • Share this:
    టాలీవుడ్ బార్డ‌ర్లు దాటి ఎప్పుడో ప్యాన్ ఇండియా స్టార్ అయ్యారు ప్ర‌భాస్‌. నాట్ ఒన్లీ ప్యాన్ ఇండియా, ఇప్పుడు ఏకంగా ప్యాన్ వ‌ర‌ల్డ్ వైపు అడుగులు వేయిస్తానంటూ ఆ మ‌ధ్య నాగ్ అశ్విన్ ట్విట్ట‌ర్ వేదిక‌గా మాట కూడా ఇచ్చేశారు. సో ఇప్పుడు ప్ర‌భాస్ ప్రూవ్డ్ ప్యాన్ ఇండియా స్టార్ అండ్ అప్‌క‌మింగ్ ప్యాన్ వ‌ర‌ల్డ్ స్టార్ అన్న‌మాట‌.మ‌రి ఇత‌ని దృష్టిలో సూప‌ర్‌స్టార్ ఎవ‌రు? కాసేపు హీరోల గురించి ప‌క్క‌న పెట్టేస్తే హీరోయిన్ల‌లో ప్ర‌భాస్ దృష్టిలో సూప‌ర్‌స్టార్ ఎవ‌రు? సౌత్‌లో టాప్ లీగ్‌లో ఉన్న అనుష్క‌, న‌య‌న‌తార‌, త్రిష‌తో పాటు ప్ర‌భాస్ జోడీ క‌ట్టిన హీరోయినే లేదు. ఈ మ‌ధ్య నార్త్ భామ‌ల‌ను కూడా ట్రై చేస్తున్నారు.అలాంట‌ప్పుడు ప్ర‌భాస్ దృష్టిలో సూప‌ర్‌స్టార్ ఎవ‌రు? ఈ ఇంట్ర‌స్టింగ్ ప్ర‌శ్న‌కి ఓ క్యూట్ ఆన్స‌ర్ ఇచ్చేశారు ప్ర‌భాస్‌. అది కూడా త‌న ఇన్‌స్టా వేదిక‌గా!

    ప్ర‌భాస్ దృష్టిలో లేడీ సూప‌ర్‌స్టార్ ఎవ‌రు అన‌గానే అంద‌రూ అనుష్క పేరును ఎక్స్ పెక్ట్ చేస్తారు. లేకుంటే న‌య‌న‌తార పేరును కొంత వ‌ర‌కు ఆశిస్తారు. కానీ అంద‌రి అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తూ ప్ర‌భాస్ త‌న మ‌న‌సులో సూప‌ర్‌స్టార్ అని ఎవ‌రిని ఫిక్స‌య్యారు డైర‌క్ట్ అండ్ ఇన్ డైర‌క్ట్ గానే చెప్పేశారు.ప్ర‌భాస్ అనుకుంటున్న సూప‌ర్‌స్టార్ ఇంకెవ‌రో కాదు.... దీపికా ప‌దుకోన్‌. నాగ్ అశ్విన్ డైర‌క్ష‌న్‌లో త‌న‌తో జోడీ క‌ట్ట‌బోయే దీపిక పుట్టిన‌రోజు ఈ రోజు. ఈ సంద‌ర్భంగా ప్ర‌భాస్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెను విష్ చేశారు. అది కూడా గార్జియ‌స్ సూప‌ర్‌స్టార్ అనే ట్యాగ్‌లైన్‌తో అన్న‌మాట‌.








    View this post on Instagram






    A post shared by Prabhas (@actorprabhas)






    సూప‌ర్‌స్టార్ అనే ప‌దాన్ని అంత తేలిగ్గా వాడ‌రు. అందులోనూ ప్ర‌భాస్ వాడారంటే, దీపిక ఫ్యాన్స్ ఫాలోయింగ్ గ్రాఫ్ ఇప్ప‌టికిప్పుడు సౌత్‌లో అమాంతం రెయిజ్ అయినా... ఆశ్చ‌ర్య‌పోవ‌డానికేం లేదు..ఎనీవే మ‌నం కూడా గార్జియ‌స్ సూప‌ర్‌స్టార్‌కి బ‌ర్త్ డే విషెస్ చెప్పేద్దాం.
    Published by:Anil
    First published:

    అగ్ర కథనాలు