• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • WHO WAS BEHIND FIRE ACCIDENT ON PRABHAS ADIPURUSH SETS MHN

Prabhas - Adi Purush: ప్రభాస్ ‘ఆది పురుష్’ ఫైర్ యాక్సిడెంట్ ప్రమాదం కాదా...?

Prabhas - Adi Purush: ప్రభాస్ ‘ఆది పురుష్’ ఫైర్ యాక్సిడెంట్ ప్రమాదం కాదా...?

Who was behind fire accident on Prabhas Adipurush sets

Prabhas - Adi Purush: ప్రభాస్ హీరోగా ఓంరావుత్ తెరకెక్కించిన ‘ఆదిపురుష్’ సెట్ రీసెంట్‌గా అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి

  • Share this:
    పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ లిస్టులో ఉన్న మ‌రో భారీ బ‌డ్జెట్ మూవీ ‘ఆది పురుష్’. ఓంరావుత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ సినిమా షూటింగ్ రీసెంట్‌గా ముంబైలోని ఓ స్టూడియోలో ప్రారంభం కావాల్సి ఉండ‌గా అగ్ని ప్ర‌మాదం చోటు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. సినిమా కోసం సెట్ అంతా ఈ ఫైర్ యాక్సిడెంట్‌లో బూడిదైంది. నిర్మాత‌ల‌కు కోట్ల రూపాయ‌ల్లో న‌ష్టం వాటిల్లింది. అయితే ముందు ఈ అగ్నిప్ర‌మాదం .. ఏదో ప్ర‌మాదం వ‌ల్ల జ‌రిగింద‌ని అందరూ అనుకున్నారట‌. అయితే ఈ ప్ర‌మాదం ప్ర‌మాద‌వ‌శాత్తు జ‌ర‌గ‌లేద‌ని బాలీవుడ్ మీడియాలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయ‌ట‌.

    నిర్మాత‌లు ఈ ప్ర‌మాదానికి సంబంధించి అన్వేష‌ణ కోసం ఓ టీమ్‌ను ఏర్పాటు చేసింద‌ట‌. ఈ టీమ్ నిజ నిర్దార‌ణ కోసం రీసెర్చ్ చేస్తుంద‌ట‌. ఈ అన్వేష‌ణ‌లో ఓ నిజం తెలిసింద‌ట‌. అదేంటంటే.. ఈ సినిమా ప్రారంభానికి ముందు, ఇందులో రావ‌ణాసురుడుగా న‌టించ‌బోయే సైఫ్ అలీఖాన్, త‌న పాత్ర సినిమాలో గొప్పగా ఉంటుందని ఓ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. దీంతో కొంద‌రు మ‌త చాంద‌స‌వాదులు రాముడు కంటే రావ‌ణాసురుడు పాత్ర ఎలా గొప్ప‌గా ఉంటుంద‌ని పెద్ద గొడ‌వ చేశారు. చివ‌ర‌కు సైఫ్ అలీఖాన్‌, క్ష‌మాప‌ణ‌లు చెప్పుకున్నాడు.

    అయితే సైఫ్ సారీ చెప్పినా, ఓ వ‌ర్గం అందుకు శాంతించ‌లేదు. ఆ ఆగ్ర‌హాజ్వాల‌ల కార‌ణంగానే, ఆదిపురుష్ సెట్ అగ్ని ప్రమాదం అని టాక్ వినిపిస్తోంది. భూషణ్‌కుమార్‌, కృష్ణ‌కుమార్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో ప్ర‌భాస్ రాముడిగా న‌టిస్తుంటే, సైఫ్ అలీఖాన్ రావ‌ణాసురుడుగా న‌టిస్తున్నాడు. సీత పాత్ర‌లో కృతిస‌న‌న్ న‌టించే అవ‌కాశం ఉంద‌ని టాక్‌. వ‌చ్చే ఏడాది ఆగ‌స్ట్ 11న ఈ సినిమాను విడుద‌ల చేస్తామ‌ని చిత్ర యూనిట్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది.
    Published by:Anil
    First published:

    అగ్ర కథనాలు