WHO IS THE US BOX OFFICE WINNER MAHESH BABU SARILERU NEEKEVVARU OR ALLU ARJUN ALA VAIKUTHAPURRAMLOO MOVIE IN SANKRANTI RACE TA
యూఎస్ బాక్సాఫీస్ దగ్గర మహేష్, బన్ని ఇద్దరిలో ఎవరెంత వసూళు చేసారంటే..
అల్లు అర్జున్, మహేశ్ బాబు
సంక్రాంతి పండగ సందర్భంగా పోటా పోటీగా మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’.. అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ సినిమాలు ఒక రోజు గ్యాప్‌లో రిలీజైయ్యాయి. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ టాక్‌తో మంచి వసూళ్లనే సాధిస్తున్నాయి. యూఎస్ బాక్పాఫీస్ దగ్గర ఎవరు ఎంత వసూళు చేసారంటే..
సంక్రాంతి పండగ సందర్భంగా పోటా పోటీగా మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’.. అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ సినిమాలు ఒక రోజు గ్యాప్‌లో రిలీజైయ్యాయి. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ టాక్‌తో మంచి వసూళ్లనే సాధిస్తున్నాయి. మొత్తంగా మంగళవారం వరకు ఈ చిత్రాలు యూఎస్ బాక్సాఫీస్ దగ్గర చెప్పుకోదగ్గ వసూళ్లనే రాబట్టాయి. సరిలేరు నీకెవ్వరు సినిమా భోగి రోజున 200 లొకేషన్స్ నుంచడి 91,700 డాలర్స్ వసూలు చేసినట్టు యూఎస్ ట్రేడ్ వర్గాలు లెక్కలు విడుదల చేసారు. మొత్తంగా చూసుకుంటే ఇప్పటి వరకు అందిన రిపోర్ట్స్ ప్రకారం 1.8 మిలియన్ డాలర్లు వసూళు చేసినట్టు సమాచారం. బుధవారం కలిపితే.. 2 మిలియన్ డాలర్స్ క్రాస్ చేసే అవకాశాలున్నాయి.
త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమా యూఎస్ ఆడియన్స్ టేస్ట్‌కు తగ్గట్టు ఉంది. మంగళవారం అందించిన బాక్సాఫీస్ రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా భోగి రోజు వరకు 1.74 మిలియన్ డాలర్స్ వసూలు చేసినట్టు చెబుతున్నారు. మొత్తంగా సరిలేరు నీకెవ్వరు 5 రోజుల్లో వసూళ్లు చేసిన దాని కంటే ‘అల వైకుంఠపురుమలో’ సినిమా 4 రోజుల్లోనే ఈ వసూళ్లను కొల్లగొట్టడం విశేషం. యూఎస్‌లో త్రివిక్రమ్ సినిమాలకు మంచి మార్కెట్ ఉంది. దానికి అల్లు అర్జున్ తోడై ఈ సినిమా యూఎస్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. సరిలేరు నీకెవ్వరు ఔట్ అండ్ ఔట్ మాస్ మూవీ అయినా.. యూఎస్ మార్కెట్లో మహేష్ బాబు కింగ్ కాబట్టి ఈ మాత్రం వసూళ్లు వచ్చాయని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మొత్తంగా థియేట్రికల్ రన్ ముగిసేవరకు యూఎస్ బాక్సాఫీస్ దగ్గర ‘అల వైకుంఠపురములో’ సినిమానే పై చేయి సాధించేలా కనిపిస్తుంది.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.