WHO IS THE RENU DESAI SECOND HUSBAND HERE IS DETAILS SB
Renu Desai: రేణు దేశాయ్ రెండో పెళ్లి? ఇలా ఓపెన్ అయిన పవన్ మాజీ భార్య !
Renu Desai Photo : Twitter
రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకుందని అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి. కానీ ఆమె పెళ్లి చేసుకున్నది ఎవర్నీ.. అతడు ఏం చేస్తాడు అన్న విషయాలు మాత్రం బయటకు రాలేదు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) రెండో భార్య రేణు దేశాయ్ (Renu desai)నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ఇద్దరు మధ్య మనస్పర్థలు రావడంతో ఆమె పవన్‌కు విడాకులు ఇచ్చారు. పవన్‌తో విడాకుల అనంతరం రేణు తన ఇద్దరు పిల్లలతో కలిసి పూణేలో తన తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. చాలా ఏళ్ల పాటు తల్లిదండ్రుల వద్దే ఉన్న రేణు గత ఏడాది రెండో పెళ్ళికి (Renu Desai Second Marriage) రెడీ అవుతున్నట్టు వార్తలు వచ్చాయి. అతడితో ఎంగేజ్మెంట్ జరిగిన ఫోటోను కూడా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే రెండో భర్తకు సంబంధించిన పోటోను మాత్రం ఇప్పటివరకు బయటకు చూపించలేదు. అయితే పెళ్లి జరిగిందా లేదా అన్న విషయంపై ఇప్పటివరకు ఎవరికి కూడా క్లారిటీ రాలేదు.
గతేడాది సరదాగా ఆలీతో షో కి వచ్చిన రేణుదేశాయ్ తన రెండో భర్త గురించి కొన్ని విషయాలు మాత్రం చెప్పింది. అతడు ఓ ఐటీ కంపెనీ మేనేజర్‌గా పనిచేస్తూ ఉంటాడని తెలిపారు. ముందు అతడు అమెరికాలో ఉద్యోగం చేసేవాడని.. తండ్రికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఇండియాకు వచ్చి పూణేలో ఐటి ఉద్యోగం చేస్తున్నాడు అని చెప్పింది. రెండో పెళ్లి పై చాలా రోజుల పాటు తాను ఆలోచన చేశానని. అయితే తన కోసం. తన పిల్లల కోసం రెండో పెళ్లి చేసుకోక తప్పడం లేదని ఓ సందర్భంలో ప్రస్తావించింది. రేణు దేశాయ్ పాల్గొన్న అదే షోలో రేణుక కాబోయే రెండో భర్త ఓ వాయిస్ ఓవర్ కూడా పంపించాడు. అతడు రేణును ఆకాశానికి ఎత్తేయడంతో పాటు తన జీవితం ఎంతో సంతోషంగా ఉండటానికి కారణం అంటూ ఆమెను మెచ్చుకున్నాడు.
అయితే వీరి ఎంగేజ్మెంట్ జరిగి కూడా ఏడాది అయింది. అయితే ఇప్పటివరకు రేణు రెండో భర్త ఎవరు ?అన్నదానిపై క్లారిటీ లేదు. మరోవైపు తాను రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటన చేసిన వెంటనే విమర్శించిన పవన్ అభిమానులు. ఇటీవల తమ పిల్లల కోసం రేణు - పవన్ కలిసినప్పుడు మాత్రం ఆమెను ప్రశంసిస్తూ కామెంట్లు పెట్టారు. రేణు దేశాయ్ పిల్లలు మాత్రం ఎప్పుడు కూడా మెగా ఫ్యామిలీతో కలుస్తూనే ఉన్నారు. తాజాగా అకీరా స్కూల్ గ్రాడ్యుయేషన్ పూర్తైన సందర్భంగా కూడా ఆ ఫంక్షన్‌కు పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యాడు.
Published by:Sultana Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.