మహేష్ బాబు, అల్లు అర్జున్ (mahesh babu vs allu arjun)
ఈ సంక్రాంతికి ఒకరోజు గ్యాప్‌లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటంచిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో పాటు.. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమా విడుదలయ్యాయి. ఐతే.. సోషల్ మీడియాలో ఆయా హీరోల అభిమానులు మాత్రం తమ హీరోనే రియల్ సంక్రాంతి హీరో అంటూ లెక్కలతో సహా చెబుతున్నారు.
ఈ సంక్రాంతికి ఒకరోజు గ్యాప్‌లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటంచిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో పాటు.. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమా విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలు పాజిటివ్ టాక్‌తో మంచి విజయాలనే అందుకున్నాయి. ముఖ్యంగా మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ముఖ్యంగా బీ,సీ సెంటర్స్‌లో మంచి కలెక్షన్స్ రాబట్టింది. ‘అల వైకుంఠపురములో’ సినిమా మాత్రం ఏ సెంటర్స్‌తో పాటు ఓవర్సీస్లో మంచి కలెక్షన్సే రాబట్టింది. ప్రచారం విషయాలు ఎలా ఉన్నా.. అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ సినిమా ఓ అడుగు ముందులో ఉంది. ఐతే.. సోషల్ మీడియాలో ఆయా హీరోల అభిమానులు మాత్రం తమ హీరోనే రియల్ సంక్రాంతి హీరో అంటూ లెక్కలతో సహా చెబుతున్నారు.
‘అల వైకుంఠపురములో’ సినిమా విజయం టీమ్ వర్క్ వల్లే లభించందనే చెప్పాలి. ఈ సినిమాకు హీరోగా అల్లు అర్జున్‌తో పాటు త్రివిక్రమ్ దర్శకత్వంతో పాటు థమన్ మ్యూజిక్ ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఇలా ‘అల వైకుంఠపురములో’ టీమ్ అందరు సమిష్టిగా కృషితో ఈ విజయం దక్కింది.
మహేష్ బాబు అల్లు అర్జున్
మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా విషయానికొస్తే.. కథ, దర్శకత్వం, మ్యూజిక్ ఇలా ‘అల వైకుంఠపుమురములో’ సినిమాతో పోలిస్తే కాస్తా వెనకబడిందనే చెప్పాలి. ఈ సినిమా మొత్తం మహేష్ బాబు స్టార్డమ్ పైనే నడిచింది. మహేష్ బాబు ఒక్కడే ఈ సినిమా మొత్తం తన భుజాలపైనే మోసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ‘అల వైకుంఠపురములో’ సినిమా విషయానికొస్తే హీరో ఎవరైనా హిట్ అయ్యేదనే టాక్ మహేష్ బాబు అభిమానులు చెబుతున్నారు. ఇక ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా మాత్రం మహేష్ బాబు వన్ మ్యాన్ షో అని.. వేరే హీరో అయితే ఫ్లాప్ అయి ఉండేదని మహేష్ బాబు అభిమానులతో వేరే హీరో ఫ్యాన్స్ బాహాటంగానే చెబుతున్నారు. 0ఈ రకంగా చూసుకుంటే.. ఈ సంక్రాంతికి అసలు సిసలైన హీరో మహేష్ బాబు అని చెబుతున్నారు ఆయన అభిమానులు. దర్శకులను పోల్చి చూస్తే.. త్రివిక్రమ్ తన మ్యాజిక్‌తో ప్రేక్షకులను కట్టిపడేశారని చెబుతున్నారు. అదే అనిల్ రావిపూడి.. మాములు స్టోరీని మహేష్ బాబు వంటి స్టార్‌తో కామెడీతో కిచిడీ చేసాడనే పేరు తెచ్చుకున్నాడు. ఈ చిత్రాన్ని కుటుంబ సభ్యులతో కూర్చొని చూసే విధంగా తెరకెక్కించాడు. మొత్తంగా చూసుకుంటే.. సంక్రాంతి దర్శకుడిగా త్రివిక్రమ్ తన ‘అల వైకుంఠపురములో’ సినిమాతో మాయ చేసాడని చెప్పుకుంటున్నారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.