డేనియల్ క్రేగ్ తర్వాత నెక్ట్స్ జేమ్స్ బాండ్ ఎవరు ?

ఇప్పటి వరకు క్రేగ్ నాలుగు చిత్రాల్లో బాండ్‌గా నటించాడు. ఇపుడు నటిస్తున్న సినిమా ఐదోది. ఆ తర్వాత వచ్చే బాండ్ చిత్రాల్లో జేమ్స్ బాండ్‌గా ఎవరు నటిస్తారనేది ఇపుడు ఆసక్తికరంగా మారింది.

news18-telugu
Updated: September 4, 2018, 1:28 PM IST
డేనియల్ క్రేగ్ తర్వాత నెక్ట్స్ జేమ్స్ బాండ్ ఎవరు ?
జేమ్స్ బాండ్ డేనియల్ క్రేగ్ (ఫైల్ ఫోటో)
  • Share this:
అతడు చేసే అడ్వెంచర్లకు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్. రహస్యాలను ఛేదించడంలో అతడికతడే సాటి. ట్రిగ్గర్ మీద వేలు పెట్టాడంటే ఆడియన్స్‌లో నరాలు తెగే ఉత్కంఠ.అతడే బాండ్..జేమ్స్ బాండ్. 007గా ఇంకా ఫేమస్.

జనరల్ గా సీక్వెల్స్ అంటే 5 లేదా 6కు మించి తీయడం అసాధ్యం. తీసినా చూడ్డానికి బోర్ కొడుతుంది. అలాంటిది.. జేమ్స్ బాండ్ సిరిస్‌లో 24 సీక్వెల్స్ రావడం అంటే మాటలు కాదు. అంతేనా  ఒక కేరెక్టర్ 55 ఏళ్లు గా ప్రపంచ ప్రేక్షకులను అలరించడం నాటే జోక్. అలాంటి అరుదైన ఘనత సాధించాయి జేమ్స్ బాండ్ సినిమాలు.

ఈ యేడాది చివర్లో బాండ్ సిరీస్‌లో 25వ సినిమా రాబోతుంది. హీరోగా డేనియల్ క్రేగ్‌కు ఇది చివరి చిత్రం. ఇప్పటి వరకు క్రేగ్ నాలుగు చిత్రాల్లో బాండ్‌గా నటించాడు. ఇపుడు నటిస్తున్న సినిమా ఐదోది. ఆ తర్వాత వచ్చే బాండ్ చిత్రాల్లో జేమ్స్ బాండ్‌గా ఎవరు నటిస్తారనేది ఇపుడు ఆసక్తికరంగా మారింది.

ఐతే చివరగా చేసిన ‘స్పెక్టర్’ టైంలోనే ఇక తాను బాండ్ పాత్రలో నటించబోనని తెగేసి చెప్పాడు క్రెయిగ్. అంతేకాదు బాండ్ సినిమాలు చేయడం నరకప్రాయమని తన అభిప్రాయాన్ని వెల్లడించి విమర్శల పాలైయ్యాడు. మరోసారి డేనియల్ క్రేగ్‌కు భారీ పారితోషకం ఆఫర్  చేయడం ద్వారా బాండ్ నిర్మాణ సంస్థ అతనితో మరో సినిమా చేయిస్తోంది.

ఈ మూవీ తర్వాత మాత్రం డేనియల్ క్రెయిగ్ బాండ్‌గా కొనసాగడం లేదు. ఈ నేపథ్యంలో కొత్త బాండ్ కోసం అపుడే వేట మొదలు పెట్టారు. సంప్రదాయానికి భిన్నంగా ఈసారి బాండ్ పాత్ర విషయంలో ఈ ప్రొడక్షన్ హౌస్ ఒక ప్రయోగం చేయబోతున్నారట. తొలిసారిగా ఒక నల్లజాతి నటుడిని బాండ్‌గా పరిచయం చేయనున్నట్లు హాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.


మరోవైపు బిట్రిష్ నటుడు ఇద్రీస్ ఎల్బా పేరును కూడా పరిశీలిస్తున్నారట. ఇప్పటి వరకు జేమ్స్‌బాండ్‌గా యాక్ట్ చేసిన నటులందరూ శ్వేత జాతీయులే. మరి బాండ్ పాత్రలో ఒక నల్ల జాతీయుడిని ప్రేక్షకులు అంగీకరిస్తారా అన్నది చూడాలి.

ఐతే విల్‌స్మిత్ సహా ఎంతోమంది నల్లజాతి నటులు హాలువుడ్‌లో పెద్ద స్టార్లుగా ఎదిగారు. ఈ నేపథ్యంలో బాండ్‌గా నల్లజాతీయుడిని పెట్టినా ఎటువంటి ప్రాబ్లెమ్ ఉండదని కొంద మంది చెబుతున్నారు. మరి ఇద్రీన్ ఎల్బానే నెక్ట్స్ బాండ్ అవుతాడో లేదో వెయిట్ అండ్ సీ.ఇది కూడా చదవండి

సంజయ్ దత్‌తో బాలీవుడ్ హాట్ బ్యూటీ ఆలియా

ఎన్టీఆర్ ఇంట్లో రానా..! దేని కోసమే తెలుసా..!

ముహూర్తం ఫిక్స్ చేసుకున్న ప్రభాస్

 
First published: September 4, 2018, 1:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading