Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి సినిమాలో నటించే కొత్త అమ్మాయి ఎవరంటే..

Pawan Kalyan Photo : Twitter

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఓ సినిమాలో నటిస్తున్నారు. పవన్ 29వ చిత్రంగా వస్తున్నఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 • Share this:
  పవన్ కళ్యాణ్.. (Pawan Kalyan) ప్రస్తుతం మలయాళంలో సూపర్ హిట్టైనా చిత్రం అయ్యప్పనమ్ కోషీయమ్ తెలుగు రీమేక్ భీమ్లా నాయక్‌ (Bheemla Nayak)లో నటిస్తున్నసంగతి తెలిసిందే. ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ పోలీస్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలవనుంది.ఈ సినిమాతోపాటు పవన్ కళ్యాణ్ స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఓ సినిమాలో నటిస్తున్నారు. పవన్ 29వ చిత్రంగా వస్తున్నఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

  ఈ సినిమాలో పవన్‌కు జోడీగా ఒక కొత్తమ్మాయి నటించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. పవన్ సరసన సాక్షి వైద్య అనే మోడల్ నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ అమ్మాయి సురేందర్ రెడ్డి ప్రస్తుతం తెరకెక్కిస్తోన్న అఖిల్ 'ఏజెంట్' సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. 'ఏజెంట్' సినిమాలో ఆమె నటన చూసి ఇంప్రెస్ అయిన సురేందర్ రెడ్డి, పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక చేశారని తెలుస్తోంది. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.

  Rashmika Mandanna : చీరలో అదరగొట్టిన రష్మిక మందన్న.. కూర్గ్ భామ అందాలకు ఫిదా అవ్వాల్సిందే...

  సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు వక్కంతం వంశీ కథను అందిస్తున్నారు. రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీ కాంబినేషన్‌లో గతంలో కిక్, రేసుగుర్రం వంటి హిట్ సినిమాలు వచ్చి మంచి విజయాలను అందుకున్నాయి. ఈ సినిమాకు కూడా పవర్ స్టార్ ఇమేజీకి తగ్గట్టుగా వంశీ ఓ కథ సిద్ధం చేశారట. ఈ సినిమా కథ గురించి.. ఇతర తారాగణం, టెక్నికల్ సిబ్బంది గురించి తెలియాల్సి ఉంది.
  View this post on Instagram


  A post shared by Sakshi (@_vaidyasakshi)

  ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న మరో సినిమా భీమ్లా నాయక్.. ఈ చిత్రంల పవన్ కళ్యాణ్‌తో పాటు రానా దగ్గుబాటి (Rana Daggubati) పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. వీరికి జంటగా నిత్యా మీనన్, (Nithya menen) సంయుక్తా మీనన్‌లు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) మాటలు అందిస్తుండగా, సాగర్ కే చంద్ర (Sagar K Chandra) దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది.

  Love Story : ఆంధ్రలో నష్టాలను మిగిల్చిన లవ్ స్టోరి.. తెలంగాణలో మాత్రం సూపర్ హిట్.. కారణం ఇదే..

  ఇక ఆ సినిమాతో పాట పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో గబ్బర్ సింగ్ అనే సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ పూర్తిగా కమర్షియల్ అంశాలతో రాసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్  లెక్చరర్‌గా కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్‌ కూడా పూర్తైంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది టీమ్. ఈ సినిమాకు భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

  ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) అనే సినిమాను ఖరారు చేశారు. కాగా పవన్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం ఎప్రిల్ 29, 2022న విడుదల కానున్నట్లు ప్రకటించారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వ‌జ్రాల దొంగగా క‌నిపించ‌నున్నాడ‌ని అంటున్నారు.

  పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న మొదటి పాన్ ఇండియన్ సినిమా ఇది. హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ (Nidhi Aggerwal) హీరోయిన్ గా నటిస్తుండగా కీరవాణి (Keeravani) సంగీతం అందిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏ యం రత్నం (AM Ratnam) నిర్మిస్తున్నారు. ఈ సినిమా పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. బాలీవుడ్ సుందరి జాక్వలైన్ ఫెర్నాండేజ్ స్పెషల్ రోల్ లో కనిపించనున్నదని టాక్.
  Published by:Suresh Rachamalla
  First published: