ఏంటి పిచ్చి ప్రశ్న.. RRR దర్శకుడు ఎవరో తెలియదా.. చిన్నపిల్లాడిని అడిగినా కూడా మరో సందేహం లేకుండా రాజమౌళి అని చెప్తాడు కదా.. అలాంటప్పుడు మరో దర్శకుడు ఎలా ఉంటాడు పిచ్చి కాకపోతేనూ అనుకుంటున్నారు కదా. అవును నిజమే.. కానీ ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది ఎవరో కాదు.. గూగుల్ తల్లి. ఏ అనుమానం వచ్చినా కూడా ముందు గూగుల్ చేస్తాం. కానీ అప్పుడప్పుడూ గూగుల్ తల్లికి కూడా కన్ఫ్యూజన్ వస్తుంది. అందుకే ఒకరి పేరుతో బదులు మరో పేరు చూపిస్తుంటుంది. ఇప్పుడు కూడా ఇదే చేసింది. RRR సినిమా దర్శకుడు ఎవరు అని కొడితే రాజమౌళితో పాటు మరొకరి కూడా కనిపిస్తుంది.

ఆర్ఆర్ఆర్ దర్శకుడిగా రాజమౌళితో పాటు మరొకరు (RRR movie director)
ఆయన పేరు సంజయ్ పాటిల్.. అసలు ఎవరీయన అని ఆరా తీస్తే బిజేపీ ఎమ్మెల్యే అని చూపిస్తుంది. ఆయన్ని తీసుకొచ్చి రాజమౌళి పక్కన పెట్టింది గూగుల్ తల్లి. అది చూసి అంతా షాక్ అవుతున్నారు. అదేంటి RRR దర్శకుడిగా రాజమౌళితో పాటు మరికొరి పేరు ఎలా కనిపిస్తుందబ్బా అని వాళ్లు కన్ఫ్యూజ్ అవుతున్నారు.

ఆర్ఆర్ఆర్ దర్శకుడిగా రాజమౌళితో పాటు మరొకరు (RRR movie director)
నిర్మాతల స్థానంలో కూడా దానయ్యతో పాటు మరికొందరు పేర్లు కూడా కనిపిస్తున్నాయి. ఇది చూసి రాజమౌళి అభిమానులు మండిపడుతున్నారు. తమ దర్శకుడితో పాటు మరొకరి పేరు కూడా కనిపించడం ఏంటి.. గూగుల్ కూడా ఇలా తప్పు చేస్తే ఎలా అంటున్నారు వాళ్లు. దీన్ని వీలైనంత త్వరగా మార్చేయాలని.. కరెక్ట్ చేయాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published:February 23, 2020, 15:50 IST