hether The Controversy Is Over With Noel Selfie Among Three Bigg Boss Contestants
Bigg Boss 4 - Noel Selfie: తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ పార్టీ చేసుకున్నారు. ఇందులో అభిజీత్, అఖిల్, సోహైల్ మినహా మిగతా అందరూ పాల్గొన్నారు. ఇందులో నోయల్ తీసిన సెల్ఫీతో అంతకు ముందు బిగ్‌బాస్ హౌస్‌లో గొడవపడ్డ నోయల్, అమ్మ రాజశేఖర్, అవినాష్ మధ్య గొడవ సమసినట్టే కనిపిస్తుంది.
తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ 4 గత ఆదివారంతో ముగిసింది. ఆదివారం జరిగిన ఫైనల్లో అభిజీత్, బిగ్‌బాస్ నాలుగో సీజన్ విన్నర్‌గా నిలిచాడు. ఈ సీజన్లో మొత్తం పదహారు మంది కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. చాలా ట్విస్టులు, టర్న్‌లతో కోవిడ్ నేపథ్యంలో సజావుగానే బిగ్‌బాస్ 4 ముగిసింది. ఈ హౌస్‌లో ఉన్నంత కాలం సందర్భానుచితం ఒకరిపై ఒకరు ప్రేమను చూపించుకోవడం, ఒకరిపై ఒకరు కోపాన్ని చూపించడం చేసే ఉంటారు. దాన్ని ప్రేక్షకులు కూడా చూసే ఉంటారు.ఏదైతేనేం అదంతా గేమ్.. అందులో గెలవాలనే ఆలోచనతో కంటెస్టెంట్స్ అలా ప్రవర్తిస్తారు. అయితే రియాలిటీ షో అయిపోగానే మేమంతా ఒకటే అని అందరూ కలుసుకుని సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు. ఈ సెలబ్రేషన్స్‌ను ప్రతి సీజన్లోనూ చూస్తుంటాం. ఈసారి కూడా అంతే అయ్యింది. బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ అందరూ కలుసుకుని గట్టిగానే పార్టీ చేసుకున్నారు. ఈ సెలబ్రేషన్స్ ఫొటోలను నోయల్ తన ఇన్‌స్టాలో షేర్ చేశాడు.
ఫొటోలతో పాటు ‘‘అందరూ నా జీవితంలో ప్రత్యేక స్థానాన్ని పొందారు. వారి గడిపిన ప్రతి నిమిషం చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇందులో కొందిరినీ మిస్ అయ్యాను’’ అని మెసేజ్ పోస్ట్ చేసిన నోయల్.. గంగవ్వతో ప్రత్యేకమైన అనుబంధం ఉందని, అందుకనే తామిద్దరం బిగ్‌బాస్ 4 నుండి ఎలిమినేట్ కాలేదని, తమకు తాముగా బయటకు వచ్చేశామని మెసేజ్ పోస్ట్ చేశాడు. బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ అందరితో కలిసి ఉన్న ఫొటోను నోయల్ షేర్ చేశాడు. అంతా బాగానే ఉంది కానీ..బిగ్‌బాస్ 4 హౌస్ నుండి బయటకు వచ్చేస్తున్న సమయంలో నోయల్‌కు అవినాష్, అమ్మ రాజశేఖర్ మాస్టర్‌తో పెద్ద గొడవే అయ్యింది. నోయల్ హౌస్ నుండి బయటకు వెళుతూ తమను విలన్స్‌గా చూపించే ప్రయత్నం చేశాడని అమ్మ రాజశేఖర్, అవినాష్ అన్నారు. మరిప్పుడు ఈ ఫొటోలో చూస్తే నోయల్ తీసిన సెల్ఫీలో అవినాష్, అమ్మ రాజశేఖర్ కూడా ఉన్నారు. అంటే నోయల్ సెల్ఫీతో నోయల్, అవినాష్, అమ్మ రాజశేఖర్ మధ్య ఉన్న గొడవ సద్దుమణిగినట్లేనని అందరూ అనుకుంటున్నారు.
ఇప్పుడు నోయల్ తీసుకున్న సెల్ఫీలో మిస్ అయిన వాళ్లలో బిగ్‌బాస్ 4 విన్నర్ అభిజీత్, రన్నర్ అఖిల్, సోహైల్ మాత్రం మిస్ అయ్యారు. మరి వారెందుకు రాలేదనే విషయాన్ని మాత్రం నోయల్ ఎక్కడా చెప్పలేదు. మరో సందర్భంలో ఏమైనా ఈ ముగ్గురు మిగతా కంటెస్టెంట్స్‌ను కలుసుకుంటారేమో చూడాలి.
Published by:Anil
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.