హోమ్ /వార్తలు /సినిమా /

Nagarjuna Wild Dog: నాగార్జున సినిమా ఎక్కడుంది.. ‘వైల్డ్ డాగ్’‌ను అంతా మరిచిపోయారేంటి..?

Nagarjuna Wild Dog: నాగార్జున సినిమా ఎక్కడుంది.. ‘వైల్డ్ డాగ్’‌ను అంతా మరిచిపోయారేంటి..?

వైల్డ్ డాగ్: ఈ సమ్మర్ సీజన్‌ను అందరికంటే ముందు మొదలు పెడుతున్నాడు అక్కినేని నాగార్జున. ఈయన నటిస్తున్న వైల్డ్ డాగ్ ఎప్రిల్ 2న విడుదల కానుంది. ముందు నెట్ ఫ్లిక్స్‌లో నేరుగా విడుదల చేయాలనుకున్నా కూడా తర్వాత అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుని మరీ థియేటర్స్‌లోకి తీసుకొస్తున్నారు దర్శక నిర్మాతలు.

వైల్డ్ డాగ్: ఈ సమ్మర్ సీజన్‌ను అందరికంటే ముందు మొదలు పెడుతున్నాడు అక్కినేని నాగార్జున. ఈయన నటిస్తున్న వైల్డ్ డాగ్ ఎప్రిల్ 2న విడుదల కానుంది. ముందు నెట్ ఫ్లిక్స్‌లో నేరుగా విడుదల చేయాలనుకున్నా కూడా తర్వాత అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుని మరీ థియేటర్స్‌లోకి తీసుకొస్తున్నారు దర్శక నిర్మాతలు.

Nagarjuna Wild Dog: తెలుగు ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోల్లో నాగార్జున కూడా ఉంటాడు. ఇప్పటికీ ఈయనకు మంచి మార్కెట్ ఉంది. కొన్నిసార్లు సరైన సినిమా పడిందంటే బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుంటాడు మన్మథుడు.

తెలుగు ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోల్లో నాగార్జున కూడా ఉంటాడు. ఇప్పటికీ ఈయనకు మంచి మార్కెట్ ఉంది. కొన్నిసార్లు సరైన సినిమా పడిందంటే బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుంటాడు మన్మథుడు. కానీ ఈ మధ్య కాలంలో నాగార్జునకు సరైన హిట్ రాలేదు. భారీ అంచనాలతో వచ్చిన దేవదాస్ లాంటి సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యేసరికి కాస్త బ్రేక్ తీసుకున్నాడు నాగార్జున. మన్మథుడు 2 తర్వాత నాగార్జున నుంచి సినిమాలు రాలేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు తెలుగులో వరసగా అన్ని సినిమాల రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే చాలా సినిమాలు ఫలానా తేదీల్లో వస్తున్నాయని చెప్పారు. కానీ నాగార్జున సినిమా విషయంలో మాత్రం ఇప్పటికీ డేట్ చెప్పలేదు. ఈయన వైల్డ్ డాగ్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా బిగ్ బాస్ సమయంలోనే అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తైపోయింది. థియేటర్లు పున:ప్రారంభం అయినప్పటికీ ముందే ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్‌లో విడుదల చేస్తామని ఒప్పందం చేసుకున్నారు నిర్మాతలు. ఈ క్రమంలోనే రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26నే విడుదల చేస్తామని చెప్పారు కూడా. కానీ అన్నీ అయిపోతున్నా ఇప్పటి వరకు నాగార్జున సినిమాపై ఎలాంటి ప్రకటన రాలేదు. కనీసం టీజర్ రాలేదు.. ఫస్ట్ లుక్ తప్ప వైల్డ్ డాగ్ నుంచి మరో ముచ్చటే లేదు. కొత్త దర్శకుడు సోలోమెన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

nagarjuna,nagarjuna twitter,nagarjuna instagram,nagarjuna movies,nagarjuna wild dog movie,nagarjuna wild dog in netflix,telugu cinema,nagarjuna wild dog release date,నాగార్జున,నాగార్జున వైల్డ్ డాగ్,నాగార్జున వైల్డ్ డాగ్ అప్ డేట్స్
‘వైల్డ్ డాగ్’గా నాగార్జున ఫస్ట్ లుక్ (Twitter/Photo)

పూర్తిగా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా వస్తుంది. ఈ సినిమా విషయంలో నాగ్ సైతం మౌనంగానే ఉన్నాడు. ఎందుకో తెలియదు కానీ వైల్డ్ డాగ్ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ఏవీ రావడం లేదు. ఇప్పటికే నాగ చైతన్య లవ్ స్టోరీ సినిమా విషయంలో అప్ డేట్ వచ్చింది. అఖిల్ కూడా మేలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌గా వస్తున్నాడు. కానీ నాగార్జున మాత్రమే సైలెంట్‌గా ఉన్నాడు. దాంతో అక్కినేని అభిమానులు వైల్డ్ డాగ్ అప్ డేట్స్ కావాలంటున్నారు. మరి దీనిపై నాగార్జున ఏం చేస్తాడో.. ఏం చెప్తాడో.. ఎలాంటి అప్ డేట్స్ ఇస్తాడో చూడాలి.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Nagarjuna, Telugu Cinema, Tollywood, Wild Dog Movie

ఉత్తమ కథలు