హోమ్ /వార్తలు /సినిమా /

Saaho Sujeeth: ‘సాహో’ సుజీత్ ఎక్కడ.. ఇప్పుడేం చేస్తున్నాడు.. నెక్ట్స్ ఏంటి..?

Saaho Sujeeth: ‘సాహో’ సుజీత్ ఎక్కడ.. ఇప్పుడేం చేస్తున్నాడు.. నెక్ట్స్ ఏంటి..?

saaho sujeeth

saaho sujeeth

Saaho Sujeeth: సాహో (Saaho) సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియన్ వైడ్‌గా పాపులర్ అయ్యాడు సుజీత్ (Sujeeth). సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ఈయన పేరు మార్మోగిపోయింది. మరిప్పుడు ఈ కుర్ర దర్శకుడు ఏం చేస్తున్నాడు.. నెక్ట్స్ సినిమా ఎవరితో ప్లాన్ చేసుకుంటున్నాడు..?

ఇంకా చదవండి ...

సాహో (Saaho) సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియన్ వైడ్‌గా పాపులర్ అయ్యాడు సుజీత్ (Sujeeth). సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ఈయన పేరు మార్మోగిపోయింది. ఒకే ఒక్క సినిమాతో ఇండియన్ వైడ్‌గా పాపులర్ అయ్యాడు సుజీత్. ఈ సినిమా ఎలా ఉందనే సంగతి పక్కన బెడితే 30 ఏళ్లు కూడా నిండకుండానే 350 కోట్ల సినిమాను హ్యాండిల్ చేసాడు సుజీత్. ఇదే మనోడి క్రేజ్ పెంచేసింది. ఇంత తక్కువ సమయంలో అలాంటి ఓ స్క్రిప్ట్ రాసుకుని.. అన్ని వందల కోట్లు పెట్టించడానికి నిర్మాతలను ఒప్పించడం అంటే చిన్న విషయం కాదు. సాహో టాక్‌తో పని లేకుండా 210 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. నిర్మాతలకు లాభాలు తీసుకొచ్చిన ఈ చిత్రం.. బయ్యర్లకు మాత్రం భారీ నష్టాలు తీసుకొచ్చింది. హిందీలో మాత్రం ఈ చిత్రం మంచి విజయం సాధించింది.

అక్కడ 150 కోట్లకు పైగా గ్రాస్.. 77 కోట్ల షేర్ వసూలు చేసింది సాహో. 66 కోట్ల బిజినెస్ చేసిన ఈ చిత్రం.. 11 కోట్లకు పైగా లాభాలు తీసుకొచ్చింది. ఇదిలా ఉంటే సాహో తర్వాత సుజీత్ ఏం సినిమా చేయబోతున్నాడు.. ఎలాంటి సినిమా చేయబోతున్నాడు.. ఎవరితో చేయబోతున్నాడనేది ఇప్పుడు ఆసక్తికరమే. ఎందుకంటే అన్ని భారీ సినిమా తర్వాత ఈ కుర్రాడి అడుగులు ఎక్కడ పడతాయనేది అంతా ఆసక్తిగా చూస్తున్న అంశం. ఆ మధ్య చిరంజీవి (Chiranjeevi) లూసీఫర్ (Lucifer) రీమేక్ బాధ్యతలు ముందుగా ఈయనకే ఇచ్చారు.

Jr NTR Car number: జూనియర్ ఎన్టీఆర్ అన్ని కార్లకు ‘9999’ మాత్రమే ఎందుకు ఉంటుందో తెలుసా..?


దీనిపై అధికారికంగా ప్రకటన కూడా వచ్చింది. చిరంజీవి స్వయంగా తన సినిమాను సుజీత్ తెరకెక్కించబోతున్నట్లు చెప్పాడు. అయితే కథ విషయంలో మార్పులు చేర్పులు చేయడంలో సుజీత్ విఫలం కావడంతో.. ఆయన్ని పక్కనబెట్టి మోహన్ రాజా (Mohan Raja)ను తెచ్చుకున్నాడు చిరంజీవి. దాంతో సుజీత్ మళ్లీ ఖాళీ అయిపోయాడు. అయితే ఈయనేం చేయబోతున్నాడనేది ఆసక్తికరంగా మారింది. ఓ చిన్న సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు ప్రచారం జరిగింది. అలాగే నితిన్ (Nithiin) హీరోగా సినిమా చేస్తాడనే టాక్ కూడా వచ్చింది.

Chiranjeevi Sarja son name: కన్నడ దివంగత హీరో చిరంజీవి సర్జ కొడుకు పేరేంటో తెలుసా..?


ఒకప్పుడు మగధీర లాంటి భారీ సినిమా తర్వాత చాలా తెలివిగా ఎలాగైతే రాజమౌళి (Rajamouli) మర్యాద రామన్న సినిమా చేసాడో.. సుజీత్ కూడా ఇప్పుడు ఇదే దారిలో వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు వార్తలొచ్చాయి. అయితే స్క్రిప్ట్ ప్రస్తుతానికి సిద్ధం కాలేదని.. త్వరలోనే అన్ని వివరాలు చెప్తాడంటున్నారు అతడి టీం. మరోవైపు ప్రభాస్‌తోనే మరో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. ప్రభాస్‌ను పోలీస్ ఆఫీసర్‌గా చూపిస్తూ అదిరిపోయే యాక్షన్ స్క్రిప్ట్ సిద్ధం చేసాడని.. దీన్ని కూడా UV క్రియేషన్స్ నిర్మించబోతుందని తెలుస్తుంది. మొత్తానికి ఈ కన్ఫ్యూజన్ పోవాలంటే సుజీత్ క్లారిటీ ఇవ్వాల్సిందే.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Director sujeeth, Prabhas saaho, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు