కరణ్ జోహార్ ఎక్కడ.. సుశాంత్ సింగ్ మరణం తర్వాత మాయం..

సుశాంత్ సింగ్ కరణ్ జోహార్ (sushant singh rajput karan johar)

Karan Johar: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత కరణ్ జోహార్ ఎక్కడున్నాడనేది ఎవరికీ అర్థం కావడం లేదు. ఈయన కూడా పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.

  • Share this:
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత కరణ్ జోహార్ ఎక్కడున్నాడనేది ఎవరికీ అర్థం కావడం లేదు. ఈయన కూడా పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అంతేకాదు అంతా విమర్శించే సరికి కరణ్ కూడా బాగా ఫీలయ్యాడని.. ఆయన కూడా డిప్రెషన్‌లోకి వెళ్తున్నాడని బాలీవుడ్ మీడియా ప్రచారం చేస్తుంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత ఈయన తీసుకుంటున్న నిర్ణయాలు.. చేస్తున్న పనులు చూసి అంతా ఇదే అనుకుంటున్నారు కూడా.

సుశాంత్ సింగ్ కరణ్ జోహార్ (sushant singh rajput karan johar)
సుశాంత్ సింగ్ కరణ్ జోహార్ (sushant singh rajput karan johar)


సుశాంత్ ఆత్మహత్య చేసుకోడానికి కరణ్ జోహార్ ముఖ్య కారణం అంటూ ఆయనపై కేసు కూడా ఫైల్ అయింది.బీహార్ కోర్టు దాన్ని తర్వాత కొట్టేసింది అది వేరే విషయం. అభిమానులు కూడా కరణ్ జోహార్‌పైనే కారాలు మిరియాలు నూరుతున్నారు. బాలీవుడ్‌లో ఎందుకూ పనికిరాని వాళ్లను తీసుకొచ్చి స్టార్స్‌గా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు.. ఈ క్రమంలోనే సుశాంత్ లాంటి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని హీరోలను తొక్కేస్తున్నాడు అంటూ కరణ్ జోహార్‌పై నిప్పులు కక్కుతున్నారు ఫ్యాన్స్.

కరణ్ జోహార్ (Karan Johar)
కరణ్ జోహార్ (Karan Johar)


ఆయనతో పాటు మరికొందరి పేర్లు కూడా వినిపిస్తున్నా.. ముఖ్యంగా కరణ్ అయితే అడ్డంగా బుక్ అయిపోయాడు. ఇప్పటి నుంచి నువ్వు నిర్మించే సినిమాలు కానీ.. తీసే సినిమాలు కానీ అస్సలు చూడమంటూ ప్రతిజ్ఞ చేస్తున్నారు ప్రేక్షకులు. ఇలాంటి టఫ్ సిచ్యువేషన్‌లోనూ బాలీవుడ్ నుంచి ఒక్కరు కూడా కరణ్ జోహార్ పక్షాన నిలబడటం లేదు. ఆయన గురించి మాట్లాడటం లేదు.. సైలెంట్‌గా ఉండిపోతున్నారు. దాంతో కరణ్ కూడా చాలా హర్ట్ అయ్యాడని తెలుస్తుంది.

సుశాంత్, సల్మాన్, ఆలియా, కరణ్ జోహార్ (File/Photos)
సుశాంత్, సల్మాన్, ఆలియా, కరణ్ జోహార్ (File/Photos)


అందుకే సోషల్ మీడియాలో అందర్నీ అన్ ఫాలో చేసేసాడు.. దాంతో పాటు ఇన్‌స్టాలో కూడా చాలా మందిని పక్కనబెట్టేసాడు. ఎవరితోనూ మాట్లాడకుండా ఉండిపోయాడని వార్తలు వినిపిస్తున్నాయి.కొన్ని రోజులుగా అసలు బయటికి కూడా రాకుండా ఇంట్లోనే ఉంటున్నాడని.. కనీసం ఇంటికి వస్తే కూడా పలకరించడానికి యిష్టపడటం లేదని తెలుస్తుంది. అంతేకాదు.. బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే MAMI ఫిల్మ్ డెవలప్‌మెంట్‌లో కీలకమైన పదవికి కూడా రాజీనామా చేసాడు కరణ్ జోహార్.

కరణ్ జోహార్ (Karan Johar)
కరణ్ జోహార్ (Karan Johar)


ఇవన్నీ ఆయన డిప్రెషన్‌తోనే చేస్తున్నాడని.. సుశాంత్ మరణం తర్వాత అందరూ తనను నిందిస్తుంటే అండగా ఎవరూ రావడం లేదనే బాధ కూడా కరణ్‌లో కనిపిస్తుందని సన్నిహితులు చెప్తున్నారు. మరోవైపు అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందను కూడా కరణ్ జోహార్ పరిచయం చేస్తాడనే వార్తలు వస్తున్నాయి. మరి చూడాలిక.. భవిష్యత్తులో ఇంకా కరణ్ జోహార్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాడో..?
Published by:Praveen Kumar Vadla
First published: