Jabardasth Kirak RP: జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పీ ఎక్కడున్నాడు.. ఇప్పుడేం చేస్తున్నాడు..?

కిరాక్ ఆర్పీ (kirak rp)

Jabardasth Kirak RP: 'జబర్దస్త్' కామెడీ షో చూసే వాళ్లకు కిరాక్ ఆర్పీతో పెద్దగా పరిచయం అవసరం లేదు. ఈయన ఎన్నో వందల స్కిట్స్ చేసాడు అక్కడ. మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నాడు. నటుడిగా కూడా కొన్ని సినిమాలు చేసాడు ఆర్పీ.

  • Share this:
'జబర్దస్త్' కామెడీ షో చూసే వాళ్లకు కిరాక్ ఆర్పీతో పెద్దగా పరిచయం అవసరం లేదు. ఈయన ఎన్నో వందల స్కిట్స్ చేసాడు అక్కడ. మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నాడు. నటుడిగా కూడా కొన్ని సినిమాలు చేసాడు ఆర్పీ. గతేడాది జబర్దస్త్ మానేసి అదిరింది వైపు అడుగులు వేసాడు. కానీ రెండు మూడు స్కిట్స్ చేసి అక్కడ్నుంచి కూడా మానేసాడు ఆర్పీ. అంత సడన్‌గా అక్కడ్నుంచి వెళ్లిపోవడానికి కారణం ఏంటి అని చాలా మంది ఆలోచనలో పడిపోయారు. పైగా కొన్ని రోజులుగా ఆర్పీ ఎక్కడున్నాడో కూడా ఎవరికీ తెలియదు. ఉన్నట్లుండి కనిపించడం మానేసాడు ఈయన. ప్రస్తుతం ఈయన దర్శకుడిగా మారుతున్నాడు. జబర్దస్త్ నుంచి ఎందరో నటులు వెలుగులోకి వచ్చారు. అయితే కేవలం నటులు మాత్రమే కాదు టెక్నీషియన్స్ కూడా ఉన్నారు. కొందరు ఇప్పటికే ఇండస్ట్రీలో సత్తా చూపిస్తున్నారు కూడా. ఇప్పటికే ప్రసన్న కుమార్ స్టార్ రైటర్ అయిపోయాడు. ఈయన రాసిన సినిమా చూపిస్త మావా, నేను లోకల్ లాంటి సినిమాలు మంచి విజయం సాధించాయి. ఇప్పుడు రవితేజతో పాటు మరికొందరు స్టార్ హీరోలకు కూడా కథలు రాస్తున్నాడు ప్రసన్న కుమార్. మరోవైపు షకలక శంకర్ టీంలో చేసే కమెడియన్ కూడా దర్శకుడిగా అదృష్టం పరీక్షించుకున్నాడు. ఇప్పుడు కిరాక్ ఆర్పీ కూడా మెగాఫోన్ పడుతున్నాడు. ఇప్పటికే సినిమా కూడా ఓపెన్ అయిపోయింది.

ప్రసన్న కుమార్ బెజవాడ ట్విట్టర్ ఫోటో (Writer Prasanna Kumar)
ప్రసన్న కుమార్ బెజవాడ ట్విట్టర్ ఫోటో (Writer Prasanna Kumar)


జబర్దస్త్ నుంచి అదిరింది వైపు అడుగులు వేసిన ఈయన.. ఇప్పుడు అక్కడ్నుంచి దర్శకుడిగా మారుతున్నాడు. అంతేకాదు ఈయన తొలి సినిమాలో కాస్టింగ్ కూడా బాగానే ఉంది. ప్రకాశ్ రాజ్, జేడీ చక్రవర్తి లాంటి సీనియర్ నటులు నటిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు ఆర్పీ. కరోనా కారణంగా షూటింగ్ ఆలస్యం అవుతుంది కానీ లేదంటే ఈ పాటికే పూర్తయ్యేది. అసలు తను ఇండస్ట్రీకి వచ్చింది దర్శకుడు కావాలనే అంటూ ముందు నుంచి చెప్తున్నాడు ఈయన. చెప్పినట్లే ఇప్పుడు ఆర్పీ దర్శకుడిగా మారుతున్నాడు.

జబర్దస్త్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన కిరాక్ ఆర్పీ (Kiraak RP)
జబర్దస్త్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన కిరాక్ ఆర్పీ (Kiraak RP)


'జబర్దస్త్'తో ఆర్పీకి మంచి గుర్తింపు వచ్చినప్పటికీ నాగబాబు వెంటనే ఆయన కూడా అదిరింది వైపు నడిచాడు. అంతేకాదు జబర్దస్త్‌పై సంచలన వ్యాఖ్యలు కూడా చేసాడు. అక్కడ అనుకున్న గుర్తింపు ఎప్పటికీ రాదని.. వాళ్లేం అందరికీ ఛాన్సులు ఇవ్వడం లేదని.. తమ టాలెంట్ వాడుకుంటున్నారంటూ కామెంట్ చేసాడు ఆర్పీ. మొత్తానికి అదిరింది కూడా ఆపేసి పూర్తిగా కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వంపై ఫోకస్ చేసాడు ఆర్పీ. మరి ఈయన దర్శకుడిగా ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి.
Published by:Praveen Kumar Vadla
First published: