Tamanna Simhadri: తమన్నా సింహాద్రి ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది కదా..అవును బిగ్ బాస్ 3 సీజన్ లో ముప్పుతిప్పలు పెట్టిన కంటెస్టెంట్. ట్రాన్స్ జెండర్ గా తొలిసారి బిగ్ బాస్ షో లో పాల్గొన్న తమన్నా వైల్డ్ కార్డ్ ఎంట్రీ తో బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చింది. ప్రతి ఒక్క కంటెస్టెంట్ ను ఎలా ఇబ్బంది పెట్టిందో అంటే సీజన్ 3 చూసిన వాళ్ళకే తెలుస్తుంది. నోటికి వచ్చినట్టు హద్దులు దాటిన మాటలతో బాగా హాట్ టాపిక్ గా మారింది.
నిజానికి బిగ్ బాస్ సీజన్ 3 మొదట్లో ఎంత రేటింగ్ ను పెంచుకుందో.. తమన్నా ఎంట్రీ తో రేటింగ్ కాస్త తగ్గిందని అప్పట్లో సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయ్. అంతేకాకుండా చాలా మంది ప్రేక్షకులు ట్రాన్స్ జెండర్ ను తీసుకురావడమే పెద్ద పొరపాటని కామెంట్స్ కూడా చేశారు. నిజానికి తమన్నా వల్ల చాలామంది ట్రాన్స్ జెండర్ లు ఇలాగే చేస్తారా అనే అనుమానాలు కూడా ఎదురయ్యాయి. ఇక తమన్నా తన ప్రవర్తనను చూసి ప్రేక్షకులే కాకుండా పలువురు సెలబ్రిటీలు కూడా విసుగు చెందారు.
View this post on Instagram
ఇక ఆమె ధరించే డ్రెస్సులపై కూడా అప్పట్లో విమర్శలు వచ్చాయ్. నిజమైన ట్రాన్సజెండార్లు ఇలా ఉండరని కొందరు ట్రాన్సజెండార్లు కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ కు కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు. తమన్నా బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్లిన తర్వాత సోషల్ మీడియా ద్వారా మళ్లీ ప్రేక్షకులకు దగ్గరయ్యింది. అయితే ఆమెకు బిగ్ బాస్ షో ద్వారా ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది కానీ పెద్దగా ఎక్కడ పాల్గొనలేదు. నిత్యం హాట్ లుక్ లతో.. తన డాన్స్ స్టెప్ లతో ఇప్పుడు ఇంస్టాగ్రామ్ లో ప్రేక్షకులకు దగ్గరగా ఉంటుంది. మూడు నెలల క్రితం యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించగా సెలబ్రెటీలు పిలిచి ఇంటర్వ్యూస్ కూడా చేసింది. తమన్నా సింహాద్రి చేసే ఇంటర్వ్యూకు ఎంతోమంది ప్రేక్షకులు ఫిదా అయ్యారు.. ఆ స్థాయిలో తమన్నా అందరిని ఫిదా చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bigg Boss 3 Telugu, Tamanna simhadri, Transgender contestant Tamanna Simhadri