సైకిల్ మెకానిక్‌కు రూ.1.25 ఎగ్గొట్టిన స్టార్ హీరో... చిన్ననాటి అందమైన జ్ఞాపకం...

చిన్నప్పుడు స్కూటర్‌లో సగం కిరోసిన్, సగం పెట్రోల్ పోసి నడిపించే వాడినని, డబ్బులు దాచుకోవడానికి తాను ఇలా చేసేవాడినని గుర్తుచేసుకున్నాడు.

news18-telugu
Updated: January 27, 2020, 3:14 PM IST
సైకిల్ మెకానిక్‌కు రూ.1.25 ఎగ్గొట్టిన స్టార్ హీరో... చిన్ననాటి అందమైన జ్ఞాపకం...
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన చిన్ననాటి అందమైన జ్ఞాపకాన్ని పంచుకున్నాడు. ఓ సైకిల్ మెకానిక్‌కు రూ.1.25 బకాయి పడిన విషయాన్ని హీరో గుర్తు చేసుకున్నాడు. ముంబై పోలీసుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా కపిల్ శర్మతో తన చిన్నప్పటి అందమైన అనుభవాలను పంచుకున్నాడు. ఈ మధ్య కాలంలో తనసైకిల్ తీసుకుని వెళ్లి ఓ మెకానిక్‌కు ఇచ్చి దాని టైర్ ఫిక్స్ చేయాల్సిందిగా సల్మాన్ ఖాన్ కోరాడు. అయితే, అందుకు డబ్బులు ఇద్దామంటే అతడి వద్ద డబ్బులు లేవు. ఉదయాన్నే ఓ ట్రాక్ పాంట్, టీ షర్ట్ వేసుకుని సైకిల్ మీద బయటకు వెళ్లిన సల్మాన్ ఖాన్ తన వెంట డబ్బులు తీసుకుని వెళ్లడం మర్చిపోయాడు. దీంతో ‘కాకా... డబ్బులు తీసుకు రాలేదు. మళ్లీ వచ్చి ఇస్తా. టైర్ ఫిక్స్ చెయ్యి.’ అని సల్మాన్ ఖాన్ కోరాడు. అయితే, అందుకు ఆ మెకానిక్ చెప్పిన సమాధానం విని కోట్లు ఆర్జిస్తున్న స్టార్ హీరోకు నామోషీగా అనిపించింది. ఆ మెకానిక్ ఏమన్నారంటే.. ‘బేటా.. నువ్వు చిన్నప్పుడు కూడా ఇలాగే సైకిల్ రిపేర్ చేయించుకుని రూ.1.25 ఇవ్వలేదు. ఇంకా ఆ బాకీ అలాగే ఉంది.’ అని అన్నాడు. దీంతో సల్మాన్ ఖాన్‌కు తలకొట్టేసినంత పనయింది.

సైకిల్‌తో సల్మాన్ ఖాన్ (Image:Yogen Shah)


వెంటనే తేరుకున్న సల్మాన్ ఖాన్.. ఆ విషయం గుర్తు చేసిన మెకానిక్‌ను అభినందించాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లి డబ్బులు తీసుకొచ్చి పాత బాకీ, కొత్తగా రిపేర్ చేసిన దానికి కూడా డబ్బులు ఇవ్వబోయాడు. కానీ, అందుకు ఆ మెకానిక్ ఒప్పుకోలేదు. ఇదొక్కటే కాదు. తాను చిన్నప్పుడు స్కూటర్‌లో సగం కిరోసిన్, సగం పెట్రోల్ పోసి నడిపించే వాడినని, డబ్బులు దాచుకోవడానికి తాను ఇలా చేసేవాడినని గుర్తుచేసుకున్నాడు.

First published: January 27, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు