WHEN DID VARUN TEJ GET MARRIED NAGABABU ANSWER GOES VIRAL SR
Nagababu | Varun Tej Marriage : వరుణ్ తేజ్ పెళ్లి ఎప్పుడు? నాగబాబు ఆన్సర్ ఇదే..
Varun Tej with Ritu Varma Lavanya Tripathi Photo : Twitter
Nagababu | Varun Tej Marriage : మెగా బ్రదర్ నాగబాబు (Nagababu) తాజాగా వరుణ్ తేజ్ (Varun Tej Marriage) పెళ్లి విషయంలో స్పందించారు. వరుణ్ పెళ్లి విషయంలో నాగబాబు చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మెగా బ్రదర్ నాగబాబు (Nagababu) తాజాగా వరుణ్ తేజ్ (Varun Tej Marriage) పెళ్లి విషయంలో స్పందించారు. వరుణ్ పెళ్లి విషయంలో నాగబాబు చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విషయంలోకి వెళితే.. తాజాగా నాగబాబు ఫ్యాన్స్‌తో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నాగబాబుకు 'వరుణ్‌తేజ్ పెళ్లెప్పుడు?' అనే ప్రశ్నను సందించారు అభిమానులు. దీంతో ఇప్పటికే ఎన్నోసార్లు ఈ ప్రశ్న విని, దానికి సమాధానాలు చెప్పిన నాగబాబు ఈసారి బంతిని వరుణ్‌తేజ్ కోర్ట్లోకి విసిరారు. పెళ్లి విషయంలో వరుణ్ తేజ్ (Varun Tej Marriage) ఆన్సరిస్తాడని చెప్పి తెలివిగా తప్పించుకున్నారు. పెళ్లి విషయంలో అనేక సమాధానాలు చెప్పిన నాగబాబు ఈ సారి మాత్రం ఇలా తప్పించుకున్నారు. ఇక వరుణ్ తేజ్ (Varun) విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం గని అనే సినిమాను చేస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమా దాదాపు రూ.35 కోట్లతో భారీగా తెరకెక్కింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు రెడీ అయ్యింది. ఈ సినిమా ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్‌లో భాగంగా ఈనెల 17న ఉదయం 10.30 గంటలకు (Varun Tej - Ghani Trailer )ట్రైలర్ విడుదల చేసింది టీమ్. ట్రైలర్ అదిరిపోయింది. ’గని’ మూవీకి సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికేట్ జారీ చేశారు. ఈ సినిమా టోటల్ రన్ టైమ్ 2 గంటల 31 నిమిషాల 17 సెకన్లు ఉంది. ఇక ఈ సినిమాలో వరుణ్ ఫిజిక్ అదిరిందని అంటున్నారు నెటిజన్స్. ఈ సినిమాపై వరుణ్ తేజ్ భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా విడుదలైన పాటలు ఇప్పటికే మంచి ఆదరణ పొందాయి. థమన్ (Thaman) సంగీతం అందించారు.
గని సినిమాను కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో వరుణ్ (Varun Tej) ఫిజిక్ అదిరిందని అంటున్నారు నెటిజన్స్. గనిలో వరుణ్ తేజ్‌కు జోడీగా సాయి మంజ్రేకర్ (Saiee Manjrekar ) నటిస్తున్నారు. గెస్ట్ రోల్స్‌లో సునీల్ శెట్టి, ఉపేంద్ర, జగపతి బాబు కూడా నటిస్తున్నారు. ఒక ప్రత్యేకమైన పాత్రలో నదియా కనిపించనున్నారు. గని సినిమాను అల్లు బాబీ, సిద్ధు ముద్ద సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా దాదాపు రూ.35 కోట్లతో భారీగా తెరకెక్కుతోంది.
ఇక ఈ సినిమాతో పాటు వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఎఫ్ 3లో కూడా నటిస్తున్నారు. ఎఫ్ 3లో వరుణ్‌కు జంటగా మెహ్రీన్ నటిస్తుండగా.. మరో జంటగా వెంకటేష్ తమన్నాలు నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. తొలి భాగంతో పోలిస్తే సీక్వెల్ మరింత కామెడీ ఉంటుందని.. పొట్టలు చెక్కలయ్యేలా అనిల్ రావిపూడి ఈ సినిమా స్క్రిప్ట్‌ను రెడీ చేసారట. భార్యలు మితిమీరిన ఖర్చులతో చేసిన అప్పులు తట్టుకోలేక.. వెంకటేష్, వరుణ్ తేజ్‌లు కలిసి ఓ హోటల్ పెడతారు. అక్కడ్నుంచి వాళ్లకు ఎదురయ్యే సమస్యలు.. పడే పాట్లేఅనేది ఈ సినిమా కథ అంటున్నారు.
అప్పులు తీర్చడానికి పడే తిప్పలు ఫన్నీగా చూపించబోతున్నారట దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ సినిమా సమ్మర్ కానుకగా.. ఏప్రిల్ 28న కాకుండా.. మే 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు తాజాగా ప్రకటించారు. మరోవైపు వరుణ్ మరో సినిమాలో కూడా నటిస్తున్నట్లు టాక్. వరుణ్ ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru) దర్శకత్వంలో కూడా నటించనున్నట్లు తెలుస్తోంది. ప్రవీణ్ సత్తారు చెప్పిన స్టోరీ లైన్ నచ్చి వరుణ్ వెంటనే ఆ ప్రాజెక్టును ఓకే చేశారట. పవర్ పుల్ కథతో వస్తున్న ఈ సినిమా షూటింగ్.. కథ ప్రకారం మొత్తం లండన్‌లోనే జరుపుకోనుందట.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.