Home /News /movies /

WHEN AAMIR KHAN MOVIE DANGAL SAVED SMALL THEATRE OWNERS FROM BEING SHUT DOWN MNJ

Aamir Khan: ష‌ట్‌డౌన్‌ చేయాల‌నుకున్న‌ చిన్న‌ థియేట‌ర్ల‌ను కాపాడిన ఆమిర్ ఖాన్ సినిమా.. విడుద‌లై నాలుగేళ్లు.. !

అమీర్ ఖాన్

అమీర్ ఖాన్

త‌మ‌ను కాపాడారంటూ అప్ప‌ట్లో ఆమిర్‌(Aamir Khan)కి థ్యాంక్స్ చెబుతూ లేఖ రాశారు చిన్న థియేట‌ర్ ఓన‌ర్లు. ఇంత‌కు ఆ సినిమా ఏంటంటే దంగ‌ల్‌(Dangal). ప్ర‌ముఖ కుస్తీ క్రీడాకారుడు మ‌హ‌వీర్ సింగ్ పొగ‌ట్‌

    నాలుగేళ్ల క్రితం కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న కీల‌క నిర్ణ‌యంతో చిన్న థియేట‌ర్ య‌జ‌మానులంతా ఇబ్బందుల్లో ప‌డ్డారు. దానికి తోడు మ‌ల్టీఫ్లెక్స్‌ల‌తో పోటీ పెర‌గ‌డంతో ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకే త‌మ థియేట‌ర్‌ల‌ను మూసేయాల‌ని చాలా మంది థియేట‌ర్ య‌జ‌మానులు భావించారు. అయితే అలాంటి స‌మ‌యంలో వారంద‌రినీ కాపాడారు బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ష‌నిస్ట్ ఆమిర్ ఖాన్. దీంతో త‌మ‌ను కాపాడారంటూ అప్ప‌ట్లో ఆమిర్‌కి థ్యాంక్స్ చెబుతూ లేఖ రాశారు చిన్న థియేట‌ర్ ఓన‌ర్లు. ఇంత‌కు ఆ సినిమా ఏంటంటే దంగ‌ల్‌. ప్ర‌ముఖ కుస్తీ క్రీడాకారుడు మ‌హ‌వీర్ సింగ్ పొగ‌ట్‌, ఆయ‌న కుమార్తె గీత‌, బ‌బితా జీవిత క‌థ‌ల ఆధారంగా తెర‌కెక్కిన ఈ చిత్రం అప్ప‌ట్లో ఎన్నో రికార్డుల‌ను నెల‌కొల్పింది. ఆమిర్ కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రాల స‌ర‌స‌న నిలిచింది. అంతేకాదు ఎంతోమందికి స్ఫూర్తిని ఇచ్చింది.

    నాలుగేళ్ల క్రితం డిసెంబ‌ర్‌లో ప్ర‌ధాని మోదీ డీమానిటైజేషన్‌ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. దీంతో ప్ర‌జ‌లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నోట్ల‌ను మార్చుకునే ప‌నిలో ప‌డ్డ ప్ర‌జ‌లు.. సినిమాల‌పై కాస్త ఇంట్ర‌స్ట్‌ని త‌గ్గించారు. మ‌రోవైపు మల్టీఫ్లెక్స్‌ల హ‌వాతో చిన్న థియేట‌ర్ య‌జ‌మానులు త‌మ థియేట‌ర్‌ల‌ను మూసేందుకు సిద్ద‌మ‌య్యారు. అలాంటి స‌మ‌యంలో ఆమిర్ ఖాన్ దంగ‌ల్ డిసెంబ‌ర్ 23న విడుద‌లైంది.

    దంగల్ మూవీ


    సినిమాకు మొద‌టి నుంచి పాజిటివ్ టాక్ రావ‌డంతో థియేట‌ర్ల‌న్నీ కిక్కిరిపోయాయి. డీమానిటైజేష‌న్ న‌డుస్తున్న‌ప్పటికీ.. మంచి సినిమా అన్న టాక్ రావ‌డంతో దంగ‌ల్‌ని చూసేందుకు చాలా మంది ఆస‌క్తిని చూపారు. దీంతో చిన్న థియేట‌ర్ య‌జమానులు సైతం మంచి లాభాల‌ను పొందారు. ఈ క్ర‌మంలో త‌మ‌ను కాపాడారంటూ అప్ప‌ట్లో కొంత‌మంది థియేట‌ర్ య‌జ‌మానులు ఆమిర్‌కి థ్యాంక్స్ చెబుతూ లేఖ రాశారు. అయితే ఈ మూవీ భార‌త్‌లోనే కాదు చైనాలోనూ మంచి క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్ట‌డం మ‌రో విశేషం.

    దంగల్ మూవీ


    కాగా ఈ మూవీలో కుస్తీ క్రీడాకారుడిగా, న‌లుగురు పిల్ల‌ల తండ్రిగా ఆమిర్ ఖాన్ రెండు పాత్ర‌ల్లో మెరిశారు. ఇందుకోసం ఆయ‌న చాలానే క‌ష్ట‌ప‌డ్డారు. తండ్రి పాత్ర కోసం బాగా బ‌రువు పెరిగిన ఆమిర్‌.. కుస్తీ క్రీడాకారుడి కోసం మ‌ళ్లీ తగ్గారు. ఇక ఇందులో జైరా వ‌సీమ్‌, ఫాతిమా స‌నా షేక్‌, సాన్యా మ‌ల్హోత్రా త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. నితేష్ తివారీ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.
    Published by:Manjula S
    First published:

    Tags: Aamir Khan, Bollywood, Bollywood news, Dangal

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు