Natural Star Nani: నాని కెరీర్‌కు ఏం జరుగుతుంది.. గత 5 సినిమాల్లో నాలుగు ఫ్లాప్..

న్యాచురల్ స్టార్ నాని (natural star nani)

Natural Star Nani: నాని అంటే రెండేళ్ల కింది వరకు మినిమమ్ గ్యారెంటీ హీరో. ఏ సినిమా వచ్చినా కూడా కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం ప్రేక్షకుల్లో కూడా కలిగించాడు న్యాచులర్ స్టార్. ఒకటి రెండు కాదు ఏకంగా 8 వరస విజయాలు..

  • Share this:
నాని అంటే రెండేళ్ల కింది వరకు మినిమమ్ గ్యారెంటీ హీరో. ఏ సినిమా వచ్చినా కూడా కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం ప్రేక్షకుల్లో కూడా కలిగించాడు న్యాచులర్ స్టార్. ఒకటి రెండు కాదు ఏకంగా 8 వరస విజయాలు కూడా అందుకున్నాడు నాని. ఈ తరం హీరోల్లో ఒక్కరికి కూడా సాధ్యం కాని రికార్డ్ ఇది. దానికితోడు సక్సెస్ రేట్ కూడా నానికి బాగానే ఉంది. అయితే ఈ మధ్య మళ్లీ ఈయనకు బ్యాడ్ టైమ్ మొదలైపోయినట్లు కనిపిస్తుంది. వరసగా పరాజయాలు పలకరిస్తున్నాయి. రెండేళ్లుగా ఐదు సినిమాలు చేస్తే అందులో ఒక్కటి మాత్రమే విజయం ఉంది. దాన్నిబట్టి నాని కెరీర్ మళ్లీ గాడి తప్పుతుందేమో అనే అనుమానాలు వస్తున్నాయి. 2015 ఎవడే సుబ్రమణ్యం నుంచి మొదలు పెట్టి 2017 ఎంసిఏ వరకు వరసగా 8 విజయాలు అందుకున్నాడు నాని. అయితే 2018లో వచ్చిన కృష్ణార్జున యుద్ధంతో ఫ్లాప్ అందుకున్నాడు ఈయన. ఆ తర్వాత వచ్చిన దేవదాస్ కూడా ఫ్లాప్ అయింది. 2019లో మాత్రం జెర్సీతో హిట్ కొట్టాడు. కానీ వెంటనే గ్యాంగ్ లీడర్ సినిమాతో మరో ఫ్లాప్ ఇచ్చాడు.

న్యాచురల్ స్టార్ నాని (natural star nani)
న్యాచురల్ స్టార్ నాని (natural star nani)


గతేడాది సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన వి సినిమాకు కూడా రెస్పాన్స్ సరిగ్గా రాలేదు. థియేటర్స్‌లో విడుదలయ్యుంటే కచ్చితంగా ఈ సినిమా డిజాస్టర్ అయ్యుండేదనే వాదన కూడా ఉంది. నాని డై హార్డ్ ఫ్యాన్స్‌కు కూడా ఈ సినిమా నచ్చలేదు. ఇలాంటి సమయంలో కచ్చితంగా మళ్లీ హిట్ కొట్టి తనను తాను నిరూపించుకోవాల్సిన పరిస్థితుల్లో పడిపోయాడు నాని. ప్రస్తుతం ఈయన నిన్ను కోరి దర్శకుడు శివ నిర్వాణతో టక్ జగదీష్ సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత రాహుల్ సంక్రీత్యన్ దర్శకత్వంలో శ్యామ సింగ రాయ్ సినిమాకు కమిటయ్యాడు. మరో మూడు సినిమాలు కూడా లైన్‌లో ఉన్నాయి.

న్యాచురల్ స్టార్ నాని (natural star nani)
న్యాచురల్ స్టార్ నాని (natural star nani)


అప్‌కమింగ్ దర్శకులతోనే ఈయన సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం నటిస్తున్న టక్ జగదీష్ సినిమా దర్శకుడు శివ నిర్వాణకు రెండు సినిమాల అనుభవం మాత్రమే ఉంది. నిన్ను కోరి, మజిలీ సినిమాలతో ఈయన వరస విజయాలు అందుకున్నాడు. ఆ తర్వాత శ్యామ్ సింగ రాయ్ దర్శకుడు రాహుల్ కూడా టాక్సీవాలాతో హిట్ కొట్టాడు. మరోవైపు మెంటల్ మదిలో, బ్రోచేవారెవురురా సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వివేక్ ఆత్రేయతో అంటే సుందరానికి సినిమా చేస్తున్నాడు. ఈ మూడు సినిమాలతో కచ్చితంగా హిట్ కొట్టాలని చూస్తున్నాడు ఈయన. ఇందులో రెండు 2021లో విడుదల కానున్నాయి.
Published by:Praveen Kumar Vadla
First published: