Home /News /movies /

WHAT WAS THE REASON BEHIND THE DEMISE OF THE TV ACTOR DEEPESH BHAN SB

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. క్రికెట్ ఆడుతూ కమెడియన్ మృతి..!

దీపేష్ మృతి

దీపేష్ మృతి

శుక్రవారం నాడు తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుకుంటూ ఉండగా, అకస్మాత్తుగా అతను కుప్పకూలిపోయాడు. దీంతో అతని స్నేహితులు కంగారు పడి వెంటనే ఆసుపత్రికి తరలించారు.

    సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు చాలామంది మరణించారు. అటు కొందరు మోడల్స్.. కూడా వరుసగాఈ కాలంలో ఆత్మహత్యలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. పలు విభాగాలకు చెందిన టెక్నీషియన్లు అలాగే నిర్మాతలు,నటులు కన్నుమూసిన సంగతి తెలిసిందే. మీనా భర్త, రాధికా శరత్ కుమార్ మాజీ భర్త, అర్జున్ తల్లి, నోయల్ తండ్రి ఇలా చాలామంది మరణించారు.

    తాజాగా బాలీవుడ్ కు చెందిన ఓ కమెడియన్ క్రికెట్ ఆడుతూ మరణించడం… అందరినీ ఆందోళన కలిగిస్తుంది. విషయంలోకి వెళితే… బాలీవుడ్ స్మాల్ స్క్రీన్ పై అత్యంత ప్రజాదరణ పొందిన షోగా 'భాభి జీ ఘర్ పర్ హై' ని చెప్పుకోవచ్చు.ఈ షోతో పాపులర్ అయిన వారిలో దీపేష్ భన్ కూడా ఒకరు. 'భాభి జీ ఘర్ పర్ హై' అనే బుల్లితెర షో లో మల్ఖాన్ సింగ్ పాత్రతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు దీపేష్ భన్.



    అయితే శుక్రవారం నాడు తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుకుంటూ ఉండగా, అకస్మాత్తుగా అతను కుప్పకూలిపోయాడు. దీంతో అతని స్నేహితులు కంగారు పడి వెంటనే దీపేష్ ని ఆసుపత్రికి తరలించారు.కానీ అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.ఇక దీపేష్ మరణ వార్తని ప్రముఖ దర్శకుడు, నటుడు అయిన వైభవ్ మాథుర్.. వెల్లడించారు. దీపేష్ మరణవార్తతో బాలీవుడ్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. పలువురు సెలబ్రిటీలు,టీవీ నటులు ఆయన మృతికి తీవ్ర సంతాపం తెలిపారు. పలువురు ఆయన ఇంటికి వెళ్లి శ్రద్ధాంజలి ఘటిస్తూ.. కంటతడి పెట్టుకున్నారు. దిపేష్ వయసు కేవలం 41 సంవత్సరాలే.  చిన్న వయసులోనే ఇలా అకస్మాత్తుగా చనిపోవడంతో.. ఆయన తోటి నటులు, అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Bollywood, Tv actress

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు