చిరంజీవి, బాలకృష్ణ సీరియస్ డిస్కషన్.. దేని గురించి?

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ఇద్దరూ ఓ వేడుకలో కలిశారు. వారిద్దరూ కలసి సీరియస్‌గా చర్చించుకున్న విషయం ఈ ఫొటోను చూస్తే తెలుస్తోంది.

news18-telugu
Updated: February 6, 2020, 6:13 PM IST
చిరంజీవి, బాలకృష్ణ సీరియస్ డిస్కషన్.. దేని గురించి?
కోడి రామకృష్ణ కుమార్తె పెళ్లి వేడుకలో చిరంజీవి, బాలకృష్ణ
  • Share this:
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ఇద్దరూ ఓ వేడుకలో కలిశారు. గత ఏడాది ఫిబ్రవరిలో చనిపోయిన సీనియర్ దర్శకుడు కోడి రామకృష్ణ కుమార్తె వివాహ వేడుకలో చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరూ కలిశారు. సీనియర్ హీరోలు ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు. వారిద్దరూ కలసి సీరియస్‌గా చర్చించుకున్న విషయం ఈ ఫొటోను చూస్తే తెలుస్తోంది. అటు చిరంజీవి ముఖంలో కానీ, ఇటు బాలయ్య ముఖం చూసి ఏదో తీక్షణమైన అంశంపై చర్చ జరుగుతున్నట్టు కనిపిస్తోంది. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వారిద్దరూ ఏం చర్చించుకున్నారనే అంశం ఆసక్తికరంగా మారింది.

చిరంజీవి హీరోగా నటించిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమా ద్వారానే కోడి రామకృష్ణ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా అప్పట్లో సంవత్సరం రోజులు ఆడింది. ఆ తర్వాత వారిద్దరి కాంబినేషన్‌లో ఆలయ శిఖరం, గూఢచారి నెం1, సింహపురి సింహం, రిక్షావోడు, అంజి సినిమాలు వచ్చాయి.

chiranjeevi pramotes nandamuri balakrishna aditya 369 movie long back,balakrishna,chiranjeevi,chiranjeevi vs balakrishna,balakrishna aditya 369,aditya 369,chiranjeevi pramotes balakrishna aditya 369 movie,sye raa narasimha reddy movie review,balakrishna facebook,balakrishna instagram,chiranjeevi instagram,chiranjeevi facebook,chiranjeevi twitter,balakrishna twitter,balayya,nbk,chiru,megastar chiranjeevi,nandamuri balakrishna,balakrishna movies,megastar chiranjeevi,balakrishna chiranjeevi,balakrishna 100th movie,chiranjeevi balakrishna,chiranjeevi movies,chiranjeevi speech,#chiranjeevi,#balakrishna,chiranjeevi latest news,chiranjeevi 150th movie,balakrishna vs chiranjeevi,balakrishna about chiranjeevi,balakrishna new movie,mega star chiranjeevi,balakrishna new look,balakrishna songs,tollywood,telugu cinema,బాలకృష్ణ,చిరంజీవి,బాలకృష్ణ ఆదిత్య 369 చిరంజీవి,చిరంజీవి ఆదిత్య 369,బాలకృష్ణ ఆదిత్య 369,ఆదిత్య 369,ఆదిత్య 369 సినిమాను ప్రమోట్ చేసిన చిరంజీవి,చిరంజీవి,బాలకృష్ణ,బాలయ్య,చిరు,మెగాస్టార్ చిరంజీవి,సైరా నరసింహారెడ్డి,సైరా నరసింహారెడ్డి మూవీ రివ్యూ,
బాలకృష్ణ,చిరంజీవి మాటా మంతీ..


అటు బాలకృష్ణకు కూడా కోడి రామకృష్ణ హిట్ సినిమాలు అందించారు. అందులో మంగమ్మగారి మనవడు కూడా ఒకటి. బాలయ్య హీరోగా, కోడి రామకృష్ణ దర్శకత్వంలో ముద్దుల కృష్ణయ్య, మువ్వ గోపాలుడు, భారతంలో బాలచంద్రుడు, ముద్దుల మామయ్య, బాల గోపాలుడు, ముద్దుల మేనల్లుడు వంటి సినిమాలు వచ్చాయి. సుమారు వందకు పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన కోడిరామకృష్ణ 2019 ఫిబ్రవరి 22న చనిపోయారు. కోడి రామకృష్ణతో వారిద్దరికీ ఉన్న అనుబంధం దృష్ట్యా ఆయన కుమార్తె పెళ్లి వేడుకకు ఇద్దరు హీరోలు హాజరయ్యారు.telangana minister talasani srinivas yadav met tollywood heroes chiranjeevi nagarjuna,chiranjeevi,nagarjuna,nagarjuna akkineni,chiru,telangana minister talasani srinivas yadav,telangana minister talasani srinivas yadav chiranjeevi nagarjuna,megastar chiranjeevi,koratala siva,trs government chiranjeevi nagarjuna,tollywood,telugu cinema,చిరంజీవి,నాగార్జున.తలసాని శ్రీనివాస్ యాదవ్,తలసాని శ్రీనివాస్ యాదవ్,చిరంజీవి నాగార్జునతో తలసాని భేటి,కొరటాల శివ చిరంజీవి
చిరంజీవి, నాగార్జునలతో మంత్రి తలసాని భేటి (Twitter/Photo)


ఇటీవల సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. మెగాస్టార్ నివాసంలో చిరంజీవి, నాగార్జునతో భేటీ అయ్యారు. సినిమా పరిశ్రమతో సత్సంబంధాలను నెలకొల్పేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. అలాగే, మణికొండలో చిత్రపురి కాలనీలో సినీ పరిశ్రమకు చెందిన వారికి ఇళ్లు కేటాయింపు, భవనాల నిర్మాణానికి అదనపు భూములు, ఆస్పత్రి వంటి ఏర్పాట్లపై చర్చించినట్టు చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సినీ పరిశ్రమ నుంచి ఎలాంటి వేడుకలు ప్రభుత్వం పరంగా నిర్వహించలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం నంది అవార్డులను ప్రకటించేది. అయితే, కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అలాంటివేవీ ప్రకటించడం లేదు. ఈ అంశం కూడా చర్చకు వచ్చినట్టు తెలిసింది. తలసానితో భేటీ వివరాలను చిరంజీవి, బాలయ్య చర్చించి ఉండవచ్చని ఈ ఫొటోను చూస్తే అర్థం అవుతోంది. ఏపీలో టీడీపీ ప్రభుత్వ హయాంలో అవార్డులను ప్రకటించినా.. కొన్ని కారణాల వల్ల ఆ వేడుకలను నిర్వహించడం లేదు. జగన్ సీఎం అయిన తర్వాత చిరంజీవి ఆయనకు మద్దతు పలికారు. మూడు రాజధానులకు కూడా అండగా నిలిచారు. సినీ పరిశ్రమ లబ్ధి పొందాలంటే రెండు రాష్ట్రాల్లో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలనే అంశంపై వారిద్దరూ చర్చించి ఉండవచ్చనే అభిప్రాయం కూడా ఉంది.
First published: February 6, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు