Bigg Boss Telugu 3: వితిక టార్చర్ భరించలేక పునర్నవితో వరుణ్...ఏం చెప్పాడంటే...?

తనకు యూఎస్ వెళ్లిపోవాలని ఉందని వరుణ్ పునర్నవితో అంటుండగానే, వీళ్లిద్దరి మధ్యలో కూర్చొని ఉన్న వితిక కాస్త సీరియస్ అయ్యింది. వీలుంటే డోర్ బద్దలు కొట్టుకొని వెళ్లిపో అని వరుణ్ తో విసుగ్గా చెప్పింది.

news18-telugu
Updated: September 10, 2019, 9:56 PM IST
Bigg Boss Telugu 3: వితిక టార్చర్ భరించలేక పునర్నవితో వరుణ్...ఏం చెప్పాడంటే...?
వరుణ్, వితిక, పునర్నవి (Image: star maa)
  • Share this:
బిగ్ బాస్ రోజురోజుకి థ్రిల్లింగ్ గా మారిపోతోంది. ఎలిమినేషన్స్ లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్న తరణంలో హౌస్ మేట్స్ తమ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. తాజాగా వరుణ్ సందేశ్, పునర్నవి మధ్య ఆసక్తికరమైన సంభాషణతో ఒక టీజర్ విడుదలైంది. ఇందులో వరుణ్ సందేశ్ తనకు బిగ్ బాస్ హౌస్ లో ఉండటం ఇష్టం లేదని, మరో రెండు వారాల్లో ఎలాగైనా ఎలిమినేట్ అయిపోతానని, తనకు యూఎస్ వెళ్లిపోవాలని ఉందని వరుణ్ పునర్నవితో అంటుండగానే, వీళ్లిద్దరి మధ్యలో కూర్చొని ఉన్న వితిక కాస్త సీరియస్ అయ్యింది. వీలుంటే డోర్ బద్దలు కొట్టుకొని వెళ్లిపో అని వరుణ్ తో విసుగ్గా చెప్పింది. అయితే వరుణ్ మాత్రం తనను ఎలాగైనా నామినేట్ చేయమని పునర్నవిని బతిమిలాడాడు. రీజన్ ఏంటని పునర్నవి అడిగినప్పటికీ స్పష్టంగా చెప్పలేదు.

అంతేకాదు వితికతో తాను అగ్రెసీవ్ గా ఉన్నానని అందుకే నామినేట్ చేయాలని వరుణ్ బతిమిలాడాడు. అయితే అందుకు పునర్నవి తనవల్ల కాదని వరుణ్ ప్రపోజల్ ను సున్నితంగా తిరస్కరించింది. కాగా వితిక టార్చర్ భరించలేకే వరుణ్ ఇలాఅంటున్నాడని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.



First published: September 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>