Solo Brathuke So Better: థియేటర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది.. మునపటి కళ వచ్చిందా..?

ప్రతీకాత్మక చిత్రం Photo : Twitter

Solo Brathuke So Better: 9 నెలలు అయిపోయింది.. చూస్తుండగానే 9 నెలలు అయిపోయింది కరోనా వచ్చి.. దాని కారణంతో థియేటర్స్ మూతపడి. ఆ దెబ్బతో ఇప్పటి వరకు మరో సినిమా విడుదల కాలేదు.

  • Share this:
9 నెలలు అయిపోయింది.. చూస్తుండగానే 9 నెలలు అయిపోయింది కరోనా వచ్చి.. దాని కారణంతో థియేటర్స్ మూతపడి. ఆ దెబ్బతో ఇప్పటి వరకు మరో సినిమా విడుదల కాలేదు. మధ్యలో వచ్చినా కూడా ఓటిటిలో విడుదల చేసారు దర్శక నిర్మాతలు. థియేటర్స్ ఓపెన్ చేసిన తర్వాత పెద్ద సినిమాలు లేక అల్లాడిపోతున్నారు యాజమాన్యం. ఇలాంటి పరిస్థితుల్లో సోలో బ్రతుకే సో బెటర్ అంటూ వచ్చేసాడు సాయి ధరమ్ తేజ్. ఈయనే అందరికంటే ముందు ధైర్యం చేసాడు. దాంతో అంతా ఆసక్తిగా ఈ సినిమా కోసం చూసారు. ఈ ఒక్క సినిమా కోసం మొత్తం ఇండస్ట్రీ కదిలొచ్చింది. దీనికి ప్రమోషన్ చేసింది. థియేటర్స్‌కు వచ్చి సినిమాలు చూడండి అంటూ ప్రమోట్ చేసారు. ఇప్పుడు అందరూ అన్నట్లుగానే సినిమా థియేటర్స్‌లోకి వచ్చేసింది. మరి ఈ సినిమాకు వచ్చిన టాక్ ఎలా ఉంది.. థియేటర్స్ దగ్గర పరిస్థితులు ఎలా ఉన్నాయి..? ఇదే ఇప్పుడు అందరి మనసులోని ప్రశ్న. ఎందుకంటే థియేటర్స్ ఓపెన్ చేసినా కూడా మునపటి మాదిరి జనం వస్తారా అనేది ముందు నుంచి అందరికీ ఉన్న అనుమానమే. దానికితోడు 50 శాతం మాత్రమే టికెట్స్ అమ్మాలనే రూల్ పెట్టారు కాబట్టి అది ఎంతవరకు వర్కవుట్ అవుతుందనేది కూడా తెలియదు.
solo brathuke so better,solo brathuke so better review,sai dharam tej solo brathuke so better theatre response,solo brathuke so better movie talk,solo brathuke so better public talk,సోలో బ్రతుకే సో బెటర్,సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ థియేటర్ రెస్పాన్స్
సోలో బ్రతుకే సో బెటర్ (Solo Brathuke So Better movie)

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో మల్టీప్లెక్సులు అన్నిచోట్ల కూడా ఓపెన్ అయ్యాయి. అయితే సింగిల్ స్క్రీన్స్ మాత్రం చాలా చోట్ల ఓపెన్ చేయలేదు. దానికి కారణం థియేటర్స్‌కు ఆడియన్స్ రాలేదంటే వాళ్లకు అస్సలు గిట్టుబాటు కాదు. అందుకే మల్టీప్లెక్సులు మాత్రమే ఓపెన్ అయ్యాయి. అందులోనే ఇప్పుడు సోలో బ్రతుకే వచ్చింది. దీనికి కూడా రెస్పాన్స్ ఊహించినట్లుగా అయితే రావడం లేదు. హైదరాబాద్, వైజాగ్, విజయవాడ లాంటి మెయిన్ సిటీస్ మినహాయిస్తే మిగిలిన చోట్ల రెస్పాన్స్ అంతగా లేదు.
solo brathuke so better,solo brathuke so better review,sai dharam tej solo brathuke so better theatre response,solo brathuke so better movie talk,solo brathuke so better public talk,సోలో బ్రతుకే సో బెటర్,సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ థియేటర్ రెస్పాన్స్
సోలో బ్రతుకే సో బెటర్ (solo brathuke so better)

కొన్నిచోట్ల థియేటర్స్ దగ్గరికి వెళ్లి సెల్ఫీలు తీసుకుని మరీ పోస్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. 9 నెలల తర్వాత థియేటర్స్‌లో వచ్చిన సినిమా కావడంతో పండగ చేసుకుంటున్నారు. కానీ మునపటి జోష్ మాత్రం కనిపించడం లేదు. అది రావాలంటే మాత్రం మరో రెండు మూడు నెలలు పట్టేలా కనిపిస్తుంది. ఏదైనా భారీ సినిమా వస్తే కానీ థియేటర్స్ దగ్గర జనం అంతగా కనిపించరు. ఇప్పుడు మాత్రం సాయి ధరమ్ తేజ్ సినిమాకు జస్ట్ ఓకే అనే ఓపెనింగ్స్ మాత్రమే వస్తున్నాయి.
Published by:Praveen Kumar Vadla
First published: