సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘మహర్షి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా హీరోగా మహేశ్ బాబుకు 25వ సినిమా. దీంతో ఈ సినిమాపై మహేష్ బాబు చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఐతే ‘మే’ నెలలో మహేష్ బాబు హీరోగా నటించిన ‘నిజం’,‘నాని’,‘బ్రహ్మోత్సవం’,సినిమాలు ఒక దాన్ని మించి ఇంకొకటి ఫ్లాప్ అయ్యాయి. అందువలన మే నెల తనకు అంతగా కలిసిరాదని మహేష్ బాబుకు తెలుసు. అందుకే మే నెలలో రిలీజ్ అంటే మహేష్ బాబు ఫ్యాన్స్‌తో పాటు ఆయనకు ఒకింత భయం. ఈ సినిమాను ఏప్రిల్ లో రిలీజ్ చేయాలని మహేష్ బాబు ఎంతో ట్రై చేసాడు కానీ షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లేట్ అవ్వడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ సినిమాను ‘మే’ నెలలో రిలీజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ‘మహర్షి’ చిత్ర నిర్మాతలైన దిల్ రాజుతో పాటు సి.అశ్వినీదత్‌లకు మే నెల బాగానే కలిసొచ్చినా.. తనకు కలిసి వస్తుందో లేదో అని మహేష్ బాబులో ఒక రకమైన బెరుకు ఉండేది. అందుకే ఈసారి కొత్త సెంటిమెంట్‌ను నమ్ముకున్నాడు మహేష్ బాబు. ఆ సెంటిమెంటే వెంకటేస్.
రీసెంట్గా వెంకటేష్ ‘మజిలీ’, ‘జెర్సీ’ సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతేకాదు ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాలనే రాబట్టింది. అందుకున్న సంగతి తెలిసిందే కదా. అందుకే మహేష్ బాబు ..సెంటిమెంట్ ప్రకారం వెంకటేష్‌ను ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా పిలిచాడు. ఈ విషయాన్ని మహేష్ బాబు ‘మహర్షి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పడం విశేషం. ఈ సెంటిమెంట్ వర్కౌటౌ ‘మహర్షి’ బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధిస్తుందా లేదా అనేది చూడాలి. ఇక మరికొంత మంది నెటిజన్స్ మాత్రం సినిమాలో దమ్ము ఉండాలే కానీ.. ఇలాంటి సెంటిమెంట్స్ పనిచేయవని చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ashwini Dutt, Dil raju, Maharshi, Maharshi Movie Review, Mahesh Babu, Pooja Hegde, PVP, Telugu Cinema, Tolllywood, Venkatesh