Mega Star Chiranjeevi - Manchu Mohan Babu: నిన్న విష్ణు.. ఈరోజు మోహ‌న్‌బాబు..చిరుతో బేటీ వెనుక ఆంత‌ర్య‌మేంటి?

Why have Manchu Vishnu and Mohan Babu met Chiranjeevi

Mega Star Chiranjeevi - Manchu Mohan Babu: మెగాస్టార్ చిరంజీవి షూటింగ్ చేస్తోన్న ఆచార్య సెట్స్‌ను ఈరోజు మోహన్‌బాబు విజిట్ చేశారు

  • Share this:
    ఇద్దరు ఒకప్పుడు కలసి హీరోలుగా నటించారు. కాల క్రమేణ ఒకరు అగ్ర కథానాయకుడు కాగా.. మరొకరు తిరుగులేని విలక్షణ న‌టుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆ ఇద్ద‌రూ ఎవ‌రో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఒక‌రు మెగాస్టార్ చిరంజీవి కాగా..మరొక‌రు క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు. కొన్ని సంద‌ర్భాల్లో ఇద్ద‌రూ ప్ర‌త్య‌క్షంగా ఒక‌రిపై ఒక‌రు కామెంట్స్ కూడా విసురుకున్నారు. త‌ర్వాత క‌లిసి పోయారు కూడా. రెండు కుటుంబాలు మ‌ధ్య ఇప్పుడు స‌త్సంబంధాలు నెల‌కొన్నాయి. మంగ‌ళ‌వారం మెగాస్టార్‌ను హీరో మంచు విష్ణు క‌లిసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఎందుకు క‌లిసిందో మాత్రం త‌ర్వాత చెబుతానంటూ విష్ణు సస్పెన్స్ కొన‌సాగించాడు. ఈరోజు అంటే బుధ‌వారం చిరుని.. మంచు విష్ణు తండ్రి, క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు ప్ర‌త్యేకంగా క‌లిశారు. అస‌లు ఎందుకు వీరిద్ద‌రూ క‌లిశార‌నేది తెలియ‌డం లేదు. కానీ ఇండ‌స్ట్రీకి సంబంధించిన ప‌లు విష‌యాల‌పై వీరు ముచ్చ‌టించుకున్నార‌ట‌. అయితే మోహన్ బాబు కచ్చితంగా మంచు విష్ణు సినిమాకు సంబంధించి మెగా హెల్ప్ కోసం వచ్చి ఉంటాడని సినీ వర్గాలు అనుకుంటున్నాయి.

    ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే.. చిరంజీవి ఆచార్య సినిమా సెట్స్‌లోకి వెళ్లి మోహ‌న్‌బాబు క‌ల‌వ‌డం విశేషం. ప్ర‌స్తుతం మోహ‌న్‌బాబు కూడా స‌న్ ఆఫ్ ఇండియా సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. డైమండ్ ర‌త్న‌బాబు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమాకు మోహ‌న్‌బాబు స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ఇది దేశభక్తి చిత్రంగా రూపొందుతోంది. చాలా గ్యాప్ తర్వాత మోహన్ బాబు నటిస్తోన్న చిత్రమిది. ఆకాశం నీ హద్దురాలో నటించాడు కానీ.. అది గెస్ట్ పాత్ర మాత్రమే.

    ఇక చిరంజీవి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 152వ సినిమా ఆచార్య షూటింగ్‌లో ఉన్నారు. దేవాదాయ శాఖ‌లోని అవినీతిన ప్ర‌శ్నించేలా ఈ సినిమాను కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో చిరంజీవి మాజీ న‌క్స‌లైట్ నాయ‌కుడు పాత్ర‌లో న‌టిస్తుండ‌గా.. రామ్‌చ‌ర‌ణ్ న‌క్స‌లైట్ నాయ‌కుడుగా ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. రామ్‌చ‌ర‌ణ్‌, నిరంజ‌న్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
    Published by:Anil
    First published: