అవును బాలకృష్ణ ..ఎన్నడు లేనట్టుగా తన కొత్త సినిమా కోసం మేకోవర్ అయ్యాడు. ఏదో అయ్యాడని కాదు కానీ.. కొత్త లుక్‌తో మాత్రం కేక పుట్టిస్తున్నాడు. రీసెంట్‌గా వచ్చిన ‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో తన తండ్రి పాత్ర కోసం తన వయసు కంటే ఎక్కువ పాత్రలో నటించిన బాలయ్య.. ఇపుడు కే.యస్.,రవికుమార్ దర్శకత్వంలో చేస్తోన్న 105వ సినిమాలో మాత్రం పూర్తిగా సరికొత్తగా లుక్‌లోకి మారిపోయాడు. ఈ సినిమాలో కథ ప్రకారం బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్. ఆ తర్వాత గ్యాంగ్ స్టర్‌గా మారాడనేది ఈ సినిమా స్టోరీ. ఈ లుక్ వెనక రీజన్ కూడా ఉంది. గత కొన్నేళ్లుగా బాలకృష్ణ ఒకే మూసలో అదే ఆహార్యంతో సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. మధ్యలో గౌతమిపుత్ర శాతకర్ణి, పైసావసూల్ సినిమాల్లో మాత్రం కాస్తంత డిఫరెంట్‌గా కనపబడ్డాడు.
మరోవైపు తన తండ్రి జీవిత చరిత్రపై తెరకెక్కిన ‘ఎన్టీఆర్’ బయోపిక్ కోసం వివిధ గెటప్స్‌లో కనిపించాడు. అందుకే ఇపుడు చేయబోతున్న కొత్త సినిమాలో హాలీవుడ్ తరహా కొత్త లుక్‌తో కనిపించి ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేయనున్నట్టు సమాచారం. తాజాగా విడుదలైన ఈ లుక్ చూస్తుంటే గ్యాంగ్ స్టర్ అని చెప్పొచ్చు. గ్యాంగ్‌స్టర్‌గా బాలకృష్ణ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాదు బాలయ్య సరసన ఈ సినిమాలో సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్టైనర్ వస్తోన్న ఈ సినిమాలో బాలయ్య మరోసారి డ్యుయల్ రోల్‌లో కనిపించనున్నాడని తెలుస్తోంది. మరి ఈ సినిమాతో బాలయ్య తాను కోరుకున్న సక్సెస్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Balakrishna, K. S. Ravikumar, NBK, NBK 105, Sonal chauhan, Telugu Cinema, Tollywood