Home /News /movies /

WHAT IS THE CONNECTION BETWEEN KGF MOVIE AND LEGENDARY ACTOR KAIKALA SATYANARAYANA PK

KGF - Kaikala Satyanarayana: ‘కెజియఫ్’ సినిమాకు సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణకు సంబంధం ఏంటి..?

కెజియఫ్ కైకాల సత్యనారాయణ (KGF Kaikala Satyanarayana)

కెజియఫ్ కైకాల సత్యనారాయణ (KGF Kaikala Satyanarayana)

KGF - Kaikala Satyanarayana: చాలా రోజులుగా ఎంతోమందికి అర్థం కాని విషయం కూడా ఇదే. కెజియఫ్(KGF - Kaikala Satyanarayana) చిత్ర సమర్పకుడిగా కైకాల పేరు పడటం వెనక కారణం ఏంటనేది చాలా మందికి తెలియదు.

చాలా రోజులుగా ఎంతోమందికి అర్థం కాని విషయం కూడా ఇదే. కన్నడంలో యశ్ హీరోగా రూపొందిన కెజియఫ్ తెలుగులోనూ సంచలన విజయం సాధించింది. తెలుగుతో పాటు తమిళం, హిందీలోనూ ఈ చిత్రం సంచలన వసూళ్ళు తీసుకొచ్చింది. ఇప్పుడు రెండో భాగం కూడా రెడీ అవుతుంది. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి తెలుగు సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణకు సంబంధం ఏంటి అనేది చాలా మందికి అర్థం కాని విషయం. కెజియఫ్ సినిమా విడుదలైనపుడు ముందుగా కైకాల సత్యనారాయణ సమర్పించు అనే పడుతుంది. తెలుగులో ఈ చిత్రాన్ని అప్పట్లో సాయి కొర్రపాటితో కలిసి విజయ్ కిరగందూర్‌లతో పాటు కైకాల సత్యనారాయణ సమర్పించు అంటూ టైటిల్ కార్డ్ వేశారు. దాదాపు 700 సినిమాలకు పైగానే నటించిన కైకాల.. కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు.

వయోభారంతో ఆయన సినిమాలు చేయడం లేదు. అయితే ఒకప్పుడు రమా ఫిల్మ్స్ పేరుతో ఈయన సినిమాలు నిర్మించారు. ఈయన వారసుడు కూడా నటుడు కాకుండా నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టాడు. కెజియఫ్ చిత్ర సమర్పకుడిగా కైకాల పేరు పడటం వెనక కారణం కూడా అదే. ఈయన వారసుడు కన్నడంలో నిర్మాణ రంగంలో ఉన్నాడు. అక్కడ ఆక్ష్న కెజియఫ్ సినిమా సహ నిర్మాతగా కూడా ఉన్నాడు.
kgf movie,kgf chapter 2 movie,kgf chapter 2 movie release date,kgf chapter 2 movie kaikala satyanarayana,kaikala satyanarayana kgf movie,telugu cinema,కైకాల సత్యనారాయణ,కెజియఫ్ సినిమాకు కైకాలకు సంబంధం ఏంటి
కెజియఫ్ చాప్టర్ 2 (KGF Chapter 2)

ఆ సమయంలోనే సినిమా రేంజ్ ముందుగానే ఊహించిన కైకాల తనయుడు తెలుగులో ఈ చిత్ర రైట్స్ కోసం పోటీ పడ్డాడు. అయితే సాయి కొర్రపాటి లాంటి అగ్ర నిర్మాత అండగా ఉంటే మంచి రిలీజ్ వస్తుందని భావించి ఆయనతో కలిసి విడుదల చేసాడు. అందుకే కెజియఫ్ సినిమాకు ముందు కైకాల సత్యనారాయణ సమర్పణ అని పడుతుంది. ఈ సినిమా విడుదలై సంచలన విజయం సాధించిన తర్వాత కైకాల సత్యనారాయణకు సన్మానం కూడా చేసారు చిత్రయూనిట్. రెండో భాగానికి ఆయన పేరు పడుతుందా లేదా అనేది వేచి చూడాలి.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: KGF Chapter 2, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు