Saaho | సుజిత్‌కి అంత భారీ రెమ్యునరేషన్ ఇచ్చారా?

ప్రభాస్, సుజిత్

టాలీవుడ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో సుజిత్ రెమ్యునరేషన్‌ను క్యాష్‌గా కాకుండా వాటాల రూపంలో ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.

  • Share this:
    సాహో. తెలుగు నుంచి మరో భారీ బడ్జెట్ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈనెల 30న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ మూవీని యూవీ క్రియేషన్స్ సంస్థ గ్రాండ్‌గా నిర్మించింది. సుమారు రూ.330 కోట్ల బడ్జెట్ అయి ఉంటుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో మార్కెట్ కూడా అదే స్థాయిలో జరిగిందని ట్రేడ్ టాక్. తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఇంత భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు సుజిత్‌కు ఎంత రెమ్యునరేషన్ దక్కి ఉంటుందనే చర్చ జోరందుకుంది. సుజిత్‌ పెద్ద దర్శకుడేం కాదు. గతంలో రన్ రాజా రన్ సినిమాకు మాత్రమే దర్శకత్వం వహించాడు. ఆ సినిమా మంచి హిట్ అయింది. మళ్లీ అదే బ్యానర్‌లో ప్రభాస్‌తో సాహో సినిమా తీశాడు. కేవలం ఓ చిన్న సినిమాను తీసిన డైరెక్టర్ మీద నమ్మకంతో అంత భారీ బడ్జెట్ పెట్టడం అంటే నిర్మాతలు చాలా డేర్ చేశారు. అయితే, ఇంత భారీ బడ్జెట్ సినిమాలో సుజిత్‌కు దక్కింది ఎంత?

    టాలీవుడ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో సుజిత్ రెమ్యునరేషన్‌ను క్యాష్‌గా కాకుండా వాటాల రూపంలో ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. సినిమా ప్రీరిలీజ్ బిజినెస్‌‌‌‌లో సుమారు 3 శాతం వాటా సుజిత్‌కు రెమ్యునరేషన్‌‌గా ఇచ్చారని చెబుతున్నారు. ఈ సినిమా కోసం సుజిత్ ఆరేళ్లుగా కష్టపడుతున్నాడు. రన్ రాజా రన్ 2014 ఆగస్ట్‌లో రిలీజ్ అయింది. ఆ సినిమా టైమ్ నుంచే సాహో కోసం సుజిత్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నాడు.
    First published: