తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth )అంటే తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. కేవలం మన దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ఆయనకు అభిమానులు ఉన్నారు. అయితే ఇటీవల కొద్దిపాటి అనారోగ్యంతో హాస్పిటల్లో చేసిన రజనీకాంత్, గుండెకు శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఆయనకు చెన్నైలోని కావేరి హాస్పిటల్ డాక్టర్ల బృందం శుక్రవారం విజయవంతంగా సర్జరీ పూర్తి చేసింది. ఎపిసోడ్ ఆఫ్ గిడ్డినెస్తో 70 ఏళ్ల సూపర్‌స్టార్ ఆసుపత్రిలో చేరినట్టు కావేరీ ఆసుపత్రి మెడికల్ బులెటిన్‌లో వెల్లడించింది. గుండె శస్త్ర చికిత్సలో భాగంగా మెదడుకు రక్త సరఫరా పునరుద్ధరించడానికి వైద్యులు కరోటిడ్ ఆర్టరీ రీవస్కులరైజేషన్ (Carotid Artery Revascularization) సర్జరీ చేశారు.
ఈ చికిత్స ఎలా చేశారు
కరోటిడ్ ఆర్టరీ రీవస్కులరైజేషన్ ఎలా చేశారనేది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ వైద్య చికిత్సలో సూక్ష్మ నైపుణ్యాలు ఉపయోగించినట్టు కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆసుపత్రి గుండె జబ్బుల విభాగానికి చెందిన కన్సల్టెంట్, డాక్టర్ ప్రవీణ్ కహాలే ఇండియన్ ఎక్స్‌ప్రెస్ విలేకరుకు తెలిపారు. కరోటిడ్ ఆర్టరీ రీవస్కులరైజేషన్ ప్రక్రియ ద్వారా గుండె ధమనుల్లో ఏర్పడే అడ్డంకులు తొలగించి, రక్తప్రవాహాన్ని మెరుగుపరుస్తారని ఆయన చెప్పారు.
Gambling Case: నాగశౌర్య ఫామ్‌హౌజ్‌లో పేకాట.. అడ్డంగా బుక్కైన మాజీ ఎమ్మెల్యే.. అతడే కీలకం
ధమనుల్లో అడ్డంకులు ఎలా తొలగిస్తారు?
మెడకు కుడి, ఎడమ వైపు రెండు కరోటిడ్ ధమనులు ఉంటాయని డాక్టర్ ప్రవీణ్ కహాలే తెలిపారు. మెదడుకు రక్తం సరఫరా చేయడం వాటి ప్రధాన విధి. ఇది కూడా యాంజియోప్లాస్టీ, కార్డియాక్ యాంజియోప్లాస్టి శస్త్ర చికిత్స లాంటిదేనని డాక్టర్ ప్రవీణ్ చెప్పారు. గజ్జలో రంధ్రం చేయడం, లేదా చేతి ధమనుల్లో రంధ్రం చేయడం ద్వారా ధమనుల్లో అడ్డంకులు తొలగించేందుకు స్టెంట్ వేస్తామని ఆయన వివరించారు.
రోగి ప్రయోజనాలు ముఖ్యం
ఈ చికిత్సలో ధమనులను తెరవడం ద్వారా అడ్డంకులను తొలగించడం కోసం.. ధమనుల్లో ఎండోవాస్కులర్ స్టెంట్లు ( endovascular stent) అమరుస్తారు. రోగులకు ఈ చికిత్స ప్రయోజనాలు వివరించి వారి ప్రాధాన్యతలు కూడా పరిగణనలోకి తీసుకుంటారు. న్యూరాలజిస్టులు, కార్డియాలజిస్టులతో సంప్రదింపులు జరిపి రజనీకాంత్‌కు ఈ చికిత్స నిర్వహించినట్టు వైద్యులు తెలిపారు.
RRR Glimpse : విజువల్ వండర్.. అభిమానుల ఆకలి తీరుతుంది...
* ఎంత సమయం పడుతుంది
కరోటిడ్ ఆర్టరీ రీవస్కులరైజేషన్ ప్రక్రియకు 45 నుంచి 60 నిమిషాలు పడుతుంది. ఎండోవాస్కులర్ స్టెంటింగ్ సమయంలో రోగికి మత్తు మందు ఇస్తారు. ఈ చికిత్స తరువాత పరిశీలన సమయం కూడా ఎక్కువగా ఉండదు. ఈ చికిత్స తీసుకున్న రోగులను రెండు, మూడు రోజుల్లోనే ఆసుపత్రి నుంచి పంపిస్తారు.
ఇక రజనీకాంత్ సినిమాల విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం అన్నాత్తేలో నటిస్తున్నారు. ఈ సినిమాకు శివ దర్శకుడు. తెలుగులో పెద్దన్నగా డబ్ అవుతోంది. దీపావళీ సందర్భంగా నవంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. కీర్తి సురేష్, నయనతార ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Rajinikanth, Tollywood news