సమంత అక్కినేని.. పక్కింటి అమ్మాయిలా ఉంటుంది. ఓపెన్ మైండెడ్. ప్రతి సినిమాకు వేరియేషన్ చూపిస్తూ, అందాల ఆరబోతకు అడ్డుచెప్పకుండా కెరీర్‌లో ఉన్నత స్థితికి ఎదిగింది, కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే అక్కినేని వారసుడు నాగచైతన్యను పెళ్లాడింది. హిందూ, క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతిలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో బిజీ అయిపోయిన సమంత.. ఈ మధ్య ఓ బేబీ సినిమాలో కేక పుట్టించే హావభావాలను ప్రదర్శించింది. ఇప్పుడు శర్వానంద్ సరసన ‘96’ రీమేక్‌లో నటిస్తోంది. అయితే.. సమంత అక్కినేని వారింట్లో జరిగే కార్యక్రమాలకు, ఫంక్షన్లకు హాజరు కావడం లేదట. మొన్నీమధ్య జరిగిన ఏఎన్‌ఆర్ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. దానికి అక్కినేని ఇంటి వారంతా హాజరయ్యారు. ఒక్క సమంత తప్ప. బాలీవుడ్ నటి రేఖ, దివంగత నటి శ్రీదేవికి అవార్డు ఇచ్చారు. ఆ ఫంక్షన్‌కు రాకపోయినా.. కనీసం సోషల్ మీడియాలో ఒక్క పోస్టు కూడా పెట్టలేదు. అయితే.. షూటింగ్ వల్ల వీలుకాలేదని తర్వాత వివరణ ఇచ్చారు. కానీ..
నాగార్జున సోదరుడు వెంకట్ ఇంట జరిగిన వేడుకకు కూడా సమంత హాజరు కాలేదట. వెంకట్ కుమారుడి నిశ్చితార్ధ వేడుక చెన్నైలో జరిగింది. దీనికి నాగార్జున కుటుంబమంతా వెళ్లినా సమంత వెళ్లలేదట. వాస్తవానికి ప్రతి చిన్న సందర్భంలో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టే సమంత.. హాజరు కాలేకపోతున్నందుకు ఎందుకు పోస్ట్ పెట్టలేదని, అసలు ఏం జరిగింది? నాగచైతన్య, సమంత మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయా? అంటూ నెటిజన్లు జోరుగా కామెంట్లు పెడుతున్నారు. అయితే.. వీటికి అక్కినేని కుటుంబం వివరణ ఇస్తే తప్ప ఊహాగానాలకు తెర పడే ఛాన్స్ లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Akhil, Amala Akkineni, Naga Chaitanya Akkineni, Nagarjuna Akkineni, Samantha akkineni, Venkatesh