పుట్టినరోజున జనసేనాని పవన్ కళ్యాణ్.. ఏం నిర్ణయం తీసుకోబోతున్నాడు..

news18-telugu
Updated: September 1, 2019, 8:59 PM IST
పుట్టినరోజున జనసేనాని పవన్ కళ్యాణ్.. ఏం నిర్ణయం తీసుకోబోతున్నాడు..
పవన్ కళ్యాణ్ ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: September 1, 2019, 8:59 PM IST
తెలుగు సినిమా హీరోల్లో పవన్ కళ్యాణ్ ది డిఫరెంట్ స్టైల్. ఆయన ఏది చేసినా సెన్సేషనే. తన మూవీలతో కొత్త ట్రెండ్‌కు ‌సుస్వాగతం పలికిన పవన్ స్టార్. మెగాస్టార్ తమ్ముడిగా సినీ రంగంలో అడుగుపెట్టి, తనకంటూ స్పెషల్ ఐడెంటిటీ ఏర్పచుకున్నాడు పవన్ కల్యాణ్. అన్నయ్య వారసత్వాన్ని తొలి రెండు సినిమాలకే పరిమితం చేసుకున్నాడీ తమ్ముడు. తనదైన స్టైల్‌తో, మేనరిజమ్స్‌తో తక్కువకాలంలోనే స్టార్ డమ్ సంపాదించుకున్నాడు.  భిమానులకు పవర్ స్టార్‌గా చిర పరిచితమైన పవన్ కల్యాణ్ .... 1971, సెప్టెంబర్ 2న కే.వేంకట్రావు, అంజనాదేవిలకు మూడో కొడుకుగా జన్మించాడు.  ఆయన అసలు పేరు కళ్యాణ్ కుమార్.స్క్రీన్ పై పవన్ కనిపిస్తే చాలు అభిమానులకు  జల్సాయే.

pavan
పవన్ కళ్యాణ్ (ఫేస్‌బుక్ ఫోటో)


23 ఏళ్ల ఫిల్మ్ కెరీర్‌లో 23 సినిమాల్లో హీరోగా నటించాడు పవన్ కళ్యాణ్. చిరంజీవి హీరోగా వచ్చిన ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’, ‘శంకర్ దాదా జిందాబాద్’ సినిమాల్లో గెస్ట్ రోల్స్ కలుపుకొని మొత్తంగా 25 సినిమాల్లో నటించాడు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం సినిమాలకు అజ్ఞాతవాసి’ల మారిన ఈ పవర్ స్టార్ ఇపుడు జనసేనానిగా రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. మొన్నటి ఎన్నికల్లో పార్టీతో పాటు తాను ఓడిపోయినా ఎక్కడా వెరవకుండా పార్టీ బలోపేతంపై దృష్టి పెడుతున్నాడు. కానీ పవర్ స్టార్ అభిమానులు మాత్రం పవన్‌ను పొలిటికల్ లీడర్‌గా కాకుండా సినిమా హీరోగా చూడాలని కోరకుంటున్నారు. ఎనీ హౌ పవన్ కళ్యాన్ మరోసారి సినిమాల్లో వస్తే చూడాలనుకునే అభిమానులు చాలా మందే ఉన్నారు. హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా స్టార్ డమ్ ను ఏలుతున్న ఏకైక స్టార్. మళ్లీ ఎన్నికలకు ఇంకా ఐదేళ్ల సమయం ఉండటంతో పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల వైపు అడుగులు వేస్తాడా లేకపోతే ఇచ్చిన మాటకు కట్టుబడి రాజకీయాలకే తన జీవితాన్ని అంకితం చేస్తాడా అనేది చూడాలి.

 

First published: September 1, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...