ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తే.. ఎన్టీఆర్ మాత్రం కొమరం భీమ్ క్యారెక్టర్లో కనిపించనున్నాడు. ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాలను చెందిన ఇద్దరు స్వాతంత్య్ర సమరయోధులు కలిస్తే.. ఎలా ఉంటుందనే కాల్పనిక కథాంశంతో రాజమౌళి ఈ సినిమాను భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ కథానాయకుడు అజయ్ దేవ్‌గణ్ ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రంపై తెలుగు చలన చిత్ర పరిశ్రమతో పాటు అన్ని ఇండస్ట్రీస్ వాళ్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక రాజమౌళితో సినిమా చేశాక ఏ హీరో ఆ స్థాయిలో విజయం నమోదు చేయలేకపోయారు. ఒక ప్రభాస్ కూడా బాహుబలి సిరీస్ తర్వాత ఎన్నో అంచనాలతో ‘సాహో’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. కేవలం బాలీవుడ్లో మాత్రం ఈ చిత్రం హిట్ అనిపించుకుంది.

RRR సినిమా లొకేషన్ ఫోటో (RRR movie shooting pic)
ఇక ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్.. ప్రస్తుతం ‘అల వైకుంఠపురములో’ సినిమాతో ఫామ్‌లో ఉన్న త్రివిక్రమ్‌తో నెక్ట్స్ సినిమా చేస్తున్నాడు. ఢిల్లీ రాజకీయాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి ‘అయినను పోయి రావలెను హస్తినకు’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. త్రివిక్రమ్ సినిమా కాకపోతే.. కొరటాల శివ దర్శకత్వంలో చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ఎలాగైనా రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత హిట్ కొట్టి సెంటిమెంట్ బ్రేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు ఎన్టీఆర్.

RRR సినిమా ప్రెస్ మీట్లో ఎన్టీఆర్,రామ్ చరణ్,రాజమౌళి
మరోవైపు రామ్ చరణ్ కూడా రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్ తర్వాత ఫ్లాప్ నుంచి తప్పించుకోవాలనే ఆలోచనతో కొరటాల శివతో నెక్ట్స్ సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. కొరటాల శివ ఇప్పటి వరకు తీసిన ప్రతి చిత్రం హిట్ కాబట్టి.. కొరటాల శివతో నెక్ట్స్ సినిమా చేస్తే ఫ్లాప్ నుంచి తప్పించుకోవచ్చనేది ఈ ఇద్దరి హీరోల అభిప్రాయంల ఉంది. ప్రస్తుతం కొరటాల శివ చిరంజీవితో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు ‘ఆచార్య’ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత కొరటాల శివ వీళ్లిద్దరిలో ఎవరితో చేయాలో అర్ధం కాకా అర్ధం కాక ఆలోచనలో పడ్డట్టు సమాచారం. మరి కొరటాల శివ ఎవరితో నెక్ట్స్ సినమా చేస్తాడో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
Published by:Kiran Kumar Thanjavur
First published:February 12, 2020, 20:55 IST