Home /News /movies /

WHAT ABOUT BIGG BOSS 5 TELUGU AND WHEN WILL START NEW SEASON HERE THE COMPLETE DETAILS PK

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ 5 తెలుగు ఎప్పట్నుంచి.. నాగార్జున ఉంటున్నాడా లేదా..?

బిగ్ బాస్ సీజన్ 4 (Bigg Boss 4 Telugu)

బిగ్ బాస్ సీజన్ 4 (Bigg Boss 4 Telugu)

Bigg Boss 5 Telugu: చూస్తుండగానే బిగ్ బాస్ 4 తెలుగు అయిపోయింది. 106 రోజుల పాటు ప్రేక్షకులను ఫుల్లుగా ఎంటర్‌టైన్ చేసిన బిగ్ బాస్ 4 అయిపోయింది. నువ్వా నేనా అని చివరి వరకు బరిలో ఉన్న అభిజీత్, అఖిల్‌లలో అభి విన్నర్ అయ్యాడు.

చూస్తుండగానే బిగ్ బాస్ 4 తెలుగు అయిపోయింది. 106 రోజుల పాటు ప్రేక్షకులను ఫుల్లుగా ఎంటర్‌టైన్ చేసిన బిగ్ బాస్ 4 అయిపోయింది. నువ్వా నేనా అని చివరి వరకు బరిలో ఉన్న అభిజీత్, అఖిల్‌లలో అభి విన్నర్ అయ్యాడు. ఈయన ట్రోఫీ అందుకుని ఇంటికి మహానాయకుడు అయిపోయాడు. అఖిల్ కూడా చివరి వరకు బాగానే పోరాడిన కొన్ని విషయాల్లో అభిజీత్‌ను బీట్ చేయలేకపోయాడు. ఇక సోహెల్ చాలా అంటే చాలా సేఫ్ గేమ్ ఆడాడు. విన్నర్ కంటే ఎక్కువ డబ్బులు గెలుచుకున్నాడు ఈయన. మూడో స్థానంతో సరిపెట్టుకోవడమే కాదు 25 లక్షలు కూడా గెలుచుకున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు సీజన్ 4 అయిపోయింది.. దాంతో అంతా నెక్ట్స్ సీజన్ గురించి మాట్లాడుకుంటున్నారు. అదేంటి అప్పుడే ఏంటి అనుకోవచ్చు.. అయితే ఈ సారి బిగ్ బాస్ సీజన్ జరగాల్సిన దానికంటే ఐదు నెలలు ఆలస్యంగా మొదలైంది. కోవిడ్ కారణంగా జూన్‌లోనే రావాల్సిన సీజన్ సెప్టెంబర్‌లో వచ్చింది. దాంతో ఇప్పుడు తర్వాతి సీజన్ కోసం ఏడాది వేచి చూడాల్సిన అవసరం లేదు. ఆర్నెళ్లు తిరిగే సరికి మళ్లీ బిగ్ బాస్ 5 వచ్చేస్తుంది. దాంతో ఆ సీజన్ గురించి ఇప్పట్నుంచే చర్చలు మొదలైపోయాయి.
bigg boss 4 telugu,bigg boss 4 telugu highlights,bigg boss 4 telugu comedy,bigg boss 4 telugu winner abijeet,bigg boss 5 telugu,bigg boss next season timings,telugu cinema,బిగ్ బాస్ 4 తెలుగు,బిగ్ బాస్ 5 తెలుగు,బిగ్ బాస్ నెక్ట్స్ సీజన్ ఎప్పుడు
అభిజీత్‌ (Abijeet Bigg Boss 4 Telugu)

వచ్చే సీజన్ కూడా కచ్చితంగా నాగార్జున హోస్ట్ చేస్తాడు ఆ కన్ఫ్యూజన్ అయితే ఎవరికీ లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నాగార్జున హోస్టుగా సెట్ అయిపోయినట్లే. దాంతో ఆయన్ని కాదని మరో హోస్ట్ కోసం స్టార్ మా వెతకడం కూడా అత్యాశే అవుతుందేమో..? దాంతో కొత్త సీజన్‌లో వచ్చే గెస్టులు.. ఎప్పుడు మొదలు కానుంది.. వీటి గురించే ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం మాత్రం 2021 మే చివరి వారంలో కానీ లేదంటే జూన్ మొదటి వారంలో కానీ బిగ్ బాస్ 5 తెలుగు మొదలు కానుంది.
bigg boss 4 telugu,bigg boss 4 telugu highlights,bigg boss 4 telugu comedy,bigg boss 4 telugu winner abijeet,bigg boss 5 telugu,bigg boss next season timings,telugu cinema,బిగ్ బాస్ 4 తెలుగు,బిగ్ బాస్ 5 తెలుగు,బిగ్ బాస్ నెక్ట్స్ సీజన్ ఎప్పుడు
బిగ్ బాస్ సీజన్ 4 (Bigg Boss 4 Telugu)

దీనికోసం మార్చ్ నుంచే గ్రౌండ్ వర్క్ కూడా జరగనుంది. ఈ సారి చాలా మంది తెలియని మొహాలను తీసుకొచ్చినా కూడా షో మాత్రం సూపర్ సక్సెస్ అయింది. కానీ వచ్చే సీజన్ మాత్రం కచ్చితంగా క్రేజీ మొహాలను తీసుకొచ్చేలా కనిపిస్తున్నారు. ఏదేమైనా కూడా సీజన్ 4 అయిన వెంటనే నెక్ట్స్ సీజన్‌పై అనుమానాలు మొదలైపోయాయి.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Bigg Boss 4 Telugu, Nagarjuna Akkineni, Telugu Cinema, Tollywood

తదుపరి వార్తలు