Home /News /movies /

WEDDING BELLS RINGING IN TOLLYWOOD AND HEROES STARTING THEIR NEW INNINGS PK

టాలీవుడ్‌లో పెళ్లికళ.. వరసగా మోగుతున్న బాజాలు..

టాలీవుడ్‌లో పెళ్లికళ (tollywood marriage)

టాలీవుడ్‌లో పెళ్లికళ (tollywood marriage)

ఇప్పుడు ఇదే అనిపిస్తుంది. చాలా రోజులుగా బ్యాచ్‌లర్స్‌గా ఉన్న హీరోలంతా ఇప్పుడు పెళ్లి వైపు పరుగులు తీస్తున్నారు. పెళ్లికళ వచ్చేసిందే బాలా అంటూ పాటలు పాడుకుంటున్నారు.

ఇప్పుడు ఇదే అనిపిస్తుంది. చాలా రోజులుగా బ్యాచ్‌లర్స్‌గా ఉన్న హీరోలంతా ఇప్పుడు పెళ్లి వైపు పరుగులు తీస్తున్నారు. పెళ్లికళ వచ్చేసిందే బాలా అంటూ పాటలు పాడుకుంటున్నారు. తమ బ్రహ్మచర్యానికి వీడ్కోలు పలికి.. కొత్త ఇన్నింగ్స్ మొదలు పెడుతున్నారు. ఒకరో ఇద్దరో కాదు చాలా ఏళ్లుగా పెళ్లెప్పుడూ అనే ప్రశ్న ఫేస్ చేస్తున్న చాలా మంది హీరోలు ఈ ఏడాది తమ తోడు వెతుక్కున్నారు. ఇప్పటికే యువ హీరోలు నితిన్, నిఖిల్ పెళ్లి ఖాయమైపోయింది. అయితే కరోనా కారణంగా వాళ్లు ఇంకా పెళ్లి పీటలెక్కలేదంతే. ఈ ఇద్దరి నిశ్చితార్థం అయిపోయింది. ఇందులో నిఖిల్ మే 14న పెళ్లి చేసుకుంటున్నాడు.
కాబోయే భార్య పల్లవితో నిఖిల్ (nikhil)
కాబోయే భార్య పల్లవితో నిఖిల్ (nikhil)

నితిన్ కూడా పెళ్లి ఫిక్స్ చేసుకున్నాడు. కానీ డేట్ ఇంకా ఫిక్స్ చేసుకోలేదు. లాక్‌డౌన్ పూర్తయ్యాక ఈయన పెళ్లి ఘనంగా జరగనుంది. ఇప్పటికే టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు వైఘా రెడ్డిని రెండో వివాహం చేసుకున్నాడు. ఇంకా శుభవార్తలు వస్తూనే ఉన్నాయి. ఇన్ని రోజులు ఒంటరిగానే ఉన్న రానా దగ్గుబాటి ఉన్నట్లుండి తన ప్రేమికురాలిని పరిచయం చేశాడు. ఆమె ఓకే చెప్పిందని సోషల్ మీడియాలో ప్రకటించాడు.
రానా దగ్గుబాటి (Twitter/Photo)
రానా దగ్గుబాటి (Twitter/Photo)

దాంతో ఆయనకు కూడా అభినందనల వెల్లువ మొదలైంది. రానా, మిహికా బజాజ్‌ల వివాహం ఇదే ఏడాది జరుగుతుందని తండ్రి సురేష్ బాబు కూడా కన్ఫర్మ్ చేసాడు. ఇప్పటికే సాయి ధరమ్ తేజ్ కూడా ఇదే ఏడాది తాను పెళ్లి చేసుకోనున్నట్లు కన్ఫర్మ్ చేసాడు. శర్వానంద్ కూడా తనకు అమ్మాయిని చూస్తున్నారని చెప్పాడు. ఒక్క ప్రభాస్ తప్ప టాలీవుడ్ అంతా పెళ్లి బాజాలు మోగిస్తున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Dil raju, Nikhil Siddharth, Nithiin, Rana daggubati, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు