యాంకర్ సుమ.. సినిమాల్లో చిరంజీవి తన డ్యాన్స్‌లతో, నటనతో తనదైన మేనరిజంతో ఎంత పేరు తెచ్చుకున్నాడో.. టీవీల్లో కూడా సుమ తన దైన స్టైల్లో యాంకరింగ్‌కు చేస్తూ అప్పటికప్పుడు సమయస్పూర్తిగా వ్యవహరిస్తూ అంత పేరు తెచ్చుకుంది. ఓ రకంగా టీవీ మెగాస్టార్ అని సుమను అనోచ్చు. దశాబ్ధాలుగా సుమ టీవీ తెరపై అద్భుతాలు చేస్తూనే ఉంది. వయసు 40 దాటినా కూడా ఇప్పటికీ యాంకరింగ్‌లో ఆమెను అందుకునే శక్తి కానీ.. దాటే అర్హత కానీ, ఆ హుషారు కానీ ఎవరికీ కనిపించడం లేదు. కనీసం సుమ దరిదాపుల్లో కూడా ఎవరూ కనిపించడం లేదు. పెద్ద హీరోలకు సంబంధించిన ఏ ఈవెంట్ అయినా.. సరే తన మాటలతో మాయ చేయడం సుమ స్పెషాలిటీ. తెలుగువారు ఆమెను ఓ యాంకర్‌గా కాకుండా తమ ఇంటి సభ్యరాలిగానే భావిస్తారు. అంతలా తెలుగు వారికి కనెక్ట్ అయిపోయింది ఈ మలయాళీ కుట్టి. తన మాటలతో గానీ చేతలతో గానీ ఎవరనీ నోప్పించని సుమ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ ఫేస్ బుక్ ద్వారా పలకరించింది. కరోనా లాక్ డౌన్ కారణంగా గత రెండు నెలలుగా షూటింగ్స్ అన్ని బంద్ అయిన సంగతి తెలిసిందే.
అయితే తాజాగా తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్లో సడలింపులు ఇవ్వడంతో ప్రస్తుతం టీవీ సిరీయల్స్‌తో పాటు రకరకాల ప్రోగ్రామ్స్ షూటింగ్ జరుపుకుంటున్నాయి. దీంతో స్టార్ యాంకర్ సుమ కూడా షూటింగ్లో పాల్గోంటుంది. అయితే రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోవడంతో ఓ పక్క షూటింగ్ జరుపుకుంటూనే.. జాగ్రత్తగా ఎలా ఉండాలో సుమ తన వీడియో ద్వారా తోటి కళాకారులకు సలహా ఇస్తోంది. షూటింగ్ ముగియగానే వెంటనే మాస్క్ ధరించాలనీ కోరుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anchor suma, Tollywood news