Kajal Aggarwal : అలా ఉంటే జీవితంలో ఏం నేర్చుకోలేము..కాజల్ అగర్వాల్

Kajal Aggarwal : కాజల్ అగర్వాల్..ఈ అందాల మెరుపుతీగ 'చందమామ' సినిమాతో ఎక్కువమంది తెలుగువారికి పరిచయమైంది. అప్పటినుండి..దాదాపు ఓ దశాబ్దం కాలంగా తెలుగువారిని తన అందచందాలతో అలరిస్తూనే ఉంది.

news18-telugu
Updated: June 19, 2019, 12:01 PM IST
Kajal Aggarwal : అలా ఉంటే జీవితంలో ఏం నేర్చుకోలేము..కాజల్ అగర్వాల్
కాజల్ అగర్వాల్ Photo: Instagram.com/kajalaggarwalofficial
  • Share this:
కాజల్ అగర్వాల్..ఈ అందాల మెరుపుతీగ 'చందమామ' సినిమాతో ఎక్కువమంది తెలుగువారికి పరిచయమైంది. అప్పటినుండి..దాదాపు ఓ దశాబ్దం కాలంగా తెలుగువారిని తన అందచందాలతో అలరిస్తూనే ఉంది. అంతేకాకుండా స్టార్ హీరోయిన్‌గా కూడా గుర్తింపు పొంది ఇటు తెలుగు సినిమాలు చేస్తూనే అటూ తమిళ్, హిందీ సినిమాలు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. అయితే కేరిర్ మొదట్లో  గ్లామర్ పాత్రలకే పరిమితమైన కొంత కుదురుకున్న తర్వాత నటనకు ప్రాధాన్యమున్న సినిమాలతో అభిమానుల్ని సంపాదించుకుంది కాజల్. అభినయంతో అగ్ర కథానాయికగా రాణిస్తున్న కాజల్‌ ఇటీవల.. ఎలాంటీ మేకప్ లేకుండా దిగిన ఫొటోల్ని తన సోషల్‌మీడియాలో షేర్‌ చేసింది. అప్పట్లో అవి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ ఫోటోలను చూసిన నెటిజెన్స్.. ఆమె ధైర్యాన్ని మెచ్చుకున్న సంగతి తెలిసిందే. కాజల్ మీరు సూపర్..అంటూ పొగిడారు. దీనికి తోడు కాజల్, ఆ ఫోటోల కింద.. 'అందం అంటే మనల్ని మనం స్వీకరించుకోవడమని' ఓ క్యాప్షన్‌గా కూడా రాస్తూ.. మేకప్‌ లేని ఫొటో షేర్ చేయడానికి ధైర్యం కావాలని పేర్కోంది. అది అలా ఉంటే కాజల్ మరోసారి కొన్ని స్టెట్ మెంట్స్ చేసి ట్రెండ్ అవుతోంది. ఆమె మాట్లాడుతూ.. ‘‘చేసే పని ఏదైనా సరే, అది ఇంతకుముందు చేసినట్టు ఉండకూడదు. కొత్త ప్రయత్నాలు, కొత్త ఆలోచనలు మనకు, మనసుకు ఉత్తేజాన్నే కాదు.. సరికొత్త అనుభవాల్నీ పంచుతుంటాయి. నలుగురు నడిచిన దారిలో నేనూ వెళితే నా ప్రత్యేకత ఏముంటుంది? ఒకవేళ అలా ప్రయాణం చేస్తే జీవితంలో ఏమీ నేర్చుకోలేం’’ అంటోంది కాజల్‌.




 



Instagramలోని ఈ పోస్ట్‌ని వీక్షించండి




 

@tisharth_by_shivani @shreejarajgopal @vishalcharanmakeuphair @divya.naik25 @ankitanevrekar_photography


Kajal Aggarwal (@kajalaggarwalofficial) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది





అది అలా ఉంటే కాజల్ తమిళ్ సినిమా 'పారిస్ పారిస్'లో గ్లామర్ డోస్‌ను పెంచేసి కొంత బోల్డ్‌గా నటించిందని టాక్. పాత్రకి అవసరమంటూ కాజల్ కూడా కన్విన్స్ అయి ఆ సన్నివేశాలలో నటించాల్సి వచ్చిందట. దానికి బలం చేకూర్చుతూ... ఇటీవల విడుదలైన ఆ చిత్రం టీజర్ వైరల్ అయిన విషయం తెలిసేందే. ఆ టీజర్‌లో ఓ బోల్డ్ సన్నివేశం‌లో కాజల్ ఛాతి భాగాన్ని మరో నటి పట్టుకొనే దృశ్యం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేసింది.
First published: June 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading