గెటప్ శ్రీను లేకపోతే సుధీర్‌ను చూడలేం.. నాగబాబు సెన్సేషనల్ కామెంట్స్..

గెటప్ శ్రీను వల్లే సుధీర్ టీమ్ అంతలా కామెడీ పండిస్తోందని అంటున్నాడు నాగబాబు. ఈ టీమ్‌కు గెటప్ శ్రీను ప్రాణవాయువు లాంటి వాడని, అతడు స్కిట్‌లో లేకపోతే కామెడీలో వెలికి కనిపించేదని వ్యాఖ్యానించాడు.

news18-telugu
Updated: December 1, 2019, 5:21 PM IST
గెటప్ శ్రీను లేకపోతే సుధీర్‌ను చూడలేం.. నాగబాబు సెన్సేషనల్ కామెంట్స్..
సుడిగాలి సుధీర్, నాగబాబు
  • Share this:
సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రామ్‌ప్రసాద్.. ఈ ముగ్గురు కెమెరా ముందుకు వచ్చారంటే నవ్వుతూనే ఉంటాం. సుధీర్‌పై పడే పంచ్‌లు, గెటప్ శ్రీను వేసే వింతైన గెటప్‌లు, రామ్‌ప్రసాద్ ఆటో పంచ్‌లు ప్రేక్షకులకు కావాల్సినంత ఆనందాన్ని పంచుతాయి. సుడిగాలి సుధీర్ టీమ్‌లీడర్‌గా వీరంతా నవ్వులను పంచుతారు. వీరందరిలో సుధీర్ ఎప్పుడు తెరపైకి వచ్చినా ప్రేక్షకులు కాస్త ఎక్కువగా నవ్వుతారు, అయితే, గెటప్ శ్రీను వల్లే సుధీర్ టీమ్ అంతలా కామెడీ పండిస్తోందని అంటున్నాడు నాగబాబు. ఈ టీమ్‌కు గెటప్ శ్రీను ప్రాణవాయువు లాంటి వాడని, అతడు స్కిట్‌లో లేకపోతే కామెడీలో వెలికి కనిపించేదని వ్యాఖ్యానించాడు. అన్ని రకాల క్యారెక్టర్లు, గెటప్‌లు వేయగల సత్తా ఉన్నవాడని తెలిపాడు. అసలు.. గెటప్ శ్రీను లేకపోతే సుడిగాలి సుధీర్ స్కిట్ చూడలేమని స్పష్టం చేశాడు. వాస్తవానికి, అమ్మాయిల్లో బోలెడంత మంది అభిమానులను సంపాదించుకున్న సుధీర్.. తన కామెడీతో, స్టైల్‌తో, నటనతో, మాట్లాడే తీరుతో ప్రేక్షకుల మదిని దోచుకున్నాడు. అయితే.. నాగబాబు సుధీర్‌ను తక్కువ చేసినట్లు మాట్లాడుతున్నాడని సోషల్ మీడియాలో జోరుగా చర్చించుకుంటున్నారు.

టీమ్ లీడర్లందరి గురించి చెప్పే క్రమంలో నాగబాబు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. డాడీ.. డాడీ.. అంటూ ప్రేమగా పిలిచే సుధీర్ పట్ల నాగబాబు అభిప్రాయం ఇలాంటిదా అంటూ నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు. కొత్త షోకు వెళ్లిన నాగబాబు.. తనతో రమ్మన్నందుకు రాలేదన్న కోపంతో మెగా బ్రదర్ ఇలా మాట్లాడుతున్నాడని కూడా సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: December 1, 2019, 5:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading