హోమ్ /వార్తలు /సినిమా /

OTT Platform languages: ఓటీటీలో వచ్చే ఏ భాష సినిమాలు, వెబ్ ​సిరీస్​లైనా తెలుగులో చూడొచ్చు? ఎలా అంటే?

OTT Platform languages: ఓటీటీలో వచ్చే ఏ భాష సినిమాలు, వెబ్ ​సిరీస్​లైనా తెలుగులో చూడొచ్చు? ఎలా అంటే?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కరోనా తర్వాత ఓటీటీ ప్లాట్​ఫాం విలువ పెరిగిపోయింది. ఇంట్లో కూర్చోని సినిమాలు, వెబ్​ సిరీస్​లు చూస్తున్నారు జనం. అయితే ఇక నుంచి మనకు నచ్చిన మూవీ, సిరీస్​​ వేరే భాషలో ఉన్నపుడు దానిని తెలుగులో కూడా చూడవచ్చు. అదెలా అంటే?

(M. BalaKrishna, News 18)

ఓటీటీలో (OTT Platforms) మీకు న‌చ్చిన ఏ భాషలోని సినిమా (Movies), వెబ్​ సిరీస్​ (Web series) అయినా సరే స‌బ్ టైటిల్స్ గోల లేకుండా మీకు న‌చ్చిన భాషలోనే (language) చూసేయవచ్చు. ఇలాంటి  క్రేజీ సాప్ట్ వేర్ (Software) ను రూపొందించారు మన హైద‌రాబాదీ యువ‌కులు.  కోవిడ్ త‌రువాత ప్ర‌పంచ సినిమా ముఖ చిత్ర‌మే మారిపోయింది. తెలంగాణ‌లో కూర్చొని స్పానిష్ సినిమాని కూడా మ‌నం చూడోచ్చు. దీనికి కార‌ణం ఓటీటీ ప్లాట్​ఫామ్స్​ (OTT Platforms) అందుబాటులోకి రావ‌డం. ప్రపంచంలో ఉన్న ఎంట‌ర్టైమెంట్ కంటెంట్ మొత్తం ఒక్క బ‌ట‌న్ తో మ‌నం చూసే వెసులుబాటు క‌లిగింది. అయితే మ‌నం ఓటీటీలో ఇత‌ర భాషల‌కు సంబంధించిన సినిమాలు లేదా వెబ్ సిరీస్ (Web series) లు చూస్తున్న‌ప్పుడు స‌బ్ టైటిల్స్ రూపంలో వాటిని అర్ధం చేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తుంటాం. కొన్ని వెబ్ సిరిస్ లు అండ్ సినిమాలు మ‌న‌కు తెలుగు (Telugu)లో డ‌బ్​ చేసి ఉంటున్నాయి. కాని చాలా వ‌ర‌కు స‌బ్ టైటిల్స్ (Sub titles) ద్వారానే ఆ భాషను మ‌నం అర్థం చేసుకుంటున్నాం. ఇప్ప‌టి వ‌ర‌కు ఇలా క్రింద వ‌చ్చే స‌బ్ టైటిల్స్ చ‌దువుకుంటూ సీనిమాలో చాలా కీల‌క స‌న్నివేశాల‌ను కూడా మ‌నం అప్పుడ‌ప్పుడు మిస్ అవుతుంటాం. సరిగ్గా ఇదే సమ‌స్య‌కు ప‌రిష్కారం క‌నుగొన్నారు హైద‌రాబాద్ కు చెందిన ఇద్ద‌రు పీహెచ్ డి విద్యార్థులు (Ph.D. Students).

లిప్ సింక్​తో అనువాదం..

ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ  (IIIT Hyderabad)హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ విజువల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి చెందిన ఇద్దరు పీహెచ్‌డీ స్కాలర్‌లు (Ph.D. Scholars) రూపొందించిన డీప్ టెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెబ్ యాప్ (Deep Tech Artificial Intelligence Web App) ఈ స‌మ‌స్య‌కు చ‌క్క‌టి ప‌రిష్కారాన్ని ఇస్తోంది . వీరు రూపోందించిన టెక్నాల‌జీ ద్వారా ఇత‌ర భాషల‌కు సంబంధించిన వీడియోల‌ను అప్ప‌టిక‌ప్పుడు లిప్ సింక్ (Lip sync) తో స‌హా మ‌న‌కు న‌చ్చ‌ని భాషలోకి అనువాదం (Translate) చేస్తుంది. నెట్‌ఫ్లిక్స్‌లో లేదా ఇత‌ర ఓటీటీ ప్లాట్ పామ్స్ (OTT Platforms) లో దీన్ని ఏకీకృతం చేస్తే, సబ్‌స్క్రైబర్ (Sub scriber) తెలంగాణలో కూర్చొని స్పానిష్ సినిమాని తెలుగు (Telugu dubbing)లోకి సరిగ్గా డబ్బింగ్ డైలాగ్‌లతో చూడోచ్చు. హైద‌రాబాద్ కు చెందిన డెవలపర్లు రుద్రభా ముఖోపాధ్యాయ (Rudrabha Mukhopadhyay), ప్రజ్వల్ (Prajwal) KR దిన్ని రూపొందించారు.

టెస్టింగ్ విజ‌య‌వంతం..

వీరు రూపొందించిన ఈ అప్లికేష‌న్ కు IIIT-H  ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రూపోందిన స్టార్టప్, న్యూరల్ సింక్(NeuralSync AI )నుంచి పేటెంట్ కూడా ఈ సాఫ్ట్​వేర్​ పొందింది. వీరు రూపోందించిన ఈ  న్యూరల్ సింక్(NeuralSync) సాఫ్ట్‌వేర్ కు ఇత‌ర దేశాల నుంచి పెట్టుబ‌డులు పెట్ట‌డానికి చాల కంపెనీలు ముందుకొస్తున్నాయి. అయితే ఇప్ప‌టికే వీరు రూపోందిచిన సాఫ్ట్​వేర్​ టెస్టింగ్ లో కూడా విజ‌య‌వంతం అవ‌డంతో ఇప్పుడు దీన్ని మార్కెట్ లో అందుబాటులో ఉంచ‌డానికి ఈ బృందం క‌స‌ర‌త్తు చేస్తోంది.

సమయాన్ని తగ్గించడానికి..

మేం రూపొందించిన ఈ సాప్ట్ వేర్ (Software)  ఒక నిమిషం వీడియోను రెడీ చేయడానికి 45 సెకన్లు తీసుకుంటుంది. అయితే ఆ స‌మ‌యాన్న 15-20 సెకన్లకు తగ్గించాలని మేం వ‌ర్క్ చేస్తున్నాం. ఈ సాప్ట్ వేరు మీరు మీకు న‌చ్చిన ఓటీటీ ప్లాట్ ఫామ్ తో అనుసంధానం చేసుకుంటే మ‌న చూసే వీడియో కంటెంట్ ను విత్ లిప్ సింక్ తో మనం ఎంచుకున్న భాషలోకి అనువదిస్తుందని " రుద్రభ న్యూస్ 18 కి తెలిపారు.

సినిమా పరిశ్రమ కోసం..

ప్ర‌స్తుతం ఈ సాప్ట్ వేరు ను రూపొందించిన యువ‌కుల‌తో చాలా విదేశీ కంపెనీలు చ‌ర్చ‌లు జ‌రుపుతున్నాయి. అయితే ప్ర‌స్తుతం ఈ యువ‌కులు సినిమా పరిశ్రమ అంతిమ లక్ష్యంగా త‌మ సాప్ట్ వేరును వ్యాప్తి చేయాల‌ని భావిస్తున్నారు. ఇప్ప‌టికే సినిమా పరిశ్రమ కోసం పూర్తి స్థాయి వెర్షన్ ను రూపొందించే  పనిలో కూడా ఉన్నారు. దీంతోపాటు స్టార్టప్తో కొన్ని సన్నివేశాలను ఎగ్జిక్యూట్ చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్న బాలీవుడ్ సినీ నిర్మాతతో కూడా చర్చలు జరుపుతోంది.

First published:

Tags: Aha app, Amazon prime, Cinema, Dubbing, Netflix, Ott platform, Telugu language, Telugu movies, Web Series

ఉత్తమ కథలు