దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకుని ఇంటికి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ హీరో అర్జున్ ఓ భావోద్వేగ వీడియోను విడుదల చేశారు. మరొకరు పుట్టి వచ్చినా ఎస్పీబీలా ఘనతను సాధించలేరని పేర్కొన్నారు. దక్షిణాదితో పాటు యావత్ దేశంలో ఎస్పీబీకి ఎవరూ సాటిలేరని వ్యాఖ్యానించారు. దేవుడి దయతో ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోందన్న కథనాల పట్ల సంతోషం వ్యక్తంచేశారు. ప్రార్థనలకు మించిన మెడిసిన్ లేదని...ఎస్పీబీ కోలుకోవాలని కోట్లాది మంది ప్రార్థిస్తున్నారని అన్నారు. వీలైనంత త్వరగా ఎస్పీబీ సార్ పూర్తి ఆరోగ్యంతో ఇంటికి వెనుదిరగాలని అందరూ దేవుణ్ని వేడుకోవాలని పిలుపునిచ్చారు.
ఎస్పీబీ పోరాటయోధుడన్న విషయం తమకు తెలుసన్న అర్జున్...ఆయన రాక కోసం తాము ఎదురుచూస్తున్నామన్నారు. ఎస్పీబీ కొత్త పాట వినాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.