మలైక అరోరా పెళ్లిపై పగలబడి నవ్విన మాజీ భర్త అర్బాజ్ ఖాన్

మాజీ భార్య మలైకా పెళ్లి వార్తలపై స్పందించాలంటూ ఓ కార్యక్రమానికి వచ్చిన ఆమె మాజీ భర్త అర్బాజ్‌ ఖాన్‌ను ప్రశ్నించారు.

news18-telugu
Updated: March 31, 2019, 3:47 PM IST
మలైక అరోరా పెళ్లిపై పగలబడి నవ్విన మాజీ భర్త అర్బాజ్ ఖాన్
అర్బాజ్ ఖాన్, మలైక అరోరా, అర్జున్ కపూర్
  • Share this:
బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్, ఐటమ్ సాంగ్ స్పెషలిస్ట్ మలైకా అరోరా ఒక్కటి కాబోతున్నారు. గత కొన్నాళ్లుగా వీళ్ల మధ్య ప్రేమాయణం నడుస్తున్నట్లు పుకార్లు షికార్లు కొట్టాయి. దీంతో ఈ జంట తాజాగా ఏప్రిల్ 19న పెళ్లికి ఏర్పాట్లు చేసుకుంటోంది. అయితే మాజీ భార్య మలైకా పెళ్లి వార్తలపై స్పందించాలంటూ ఓ కార్యక్రమానికి వచ్చిన ఆమె మాజీ భర్త అర్బాజ్‌ ఖాన్‌ను ప్రశ్నించారు. మలైకా పెళ్లిపై ప్రశ్న వేయగానే అర్జాబ్ పగలబడి నవ్వాడు. ‘మీరు నన్ను ఈప్రశ్న అడిగినందుకు రాత్రంతా నిద్రలేకుండా చాలా ప్రిపేర్ అయినట్లు ఉన్నారు’ అన్నారు. ‘నేను కూడా ఒకరోజు టైం తీసుకొని సమాధానం ఇస్తానంటూ...పడిపడి నవ్వాడు అర్బాజ్ ఖాన్. దీంతో ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయ్యింది. మాజీ భార్య పెళ్లి చేసుకుంటుంటే కొంచెం కూడా ఫీల్ లేకుండా అర్బాజ్ ఎంత హ్యాపీగా నవ్వుకుంటున్నాడని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

2016 మార్చిలోనే భర్త అర్బాజ్ ఖాన్‌తో వేరు అయిపోయింది మలైక అరోరా. ఆ తరువాత 2017 మేలో బాంద్రా ఫ్యామిలీకోర్టు వీరిద్దరికి విడాకులు కూడా ఇచ్చేసింది. దీంతో అర్జున్ కపూర్‌ను పెళ్లాడేందుకు సిద్ధమైంది మలైకా. పెళ్లి తర్వాత వీరిద్దరు కలిసే ఉండేందుకు ముంబై అంధేరి ప్రాంతంలోని లోఖండవాలాలో అపార్టమెంట్‌ కూడా కొనేశారు.

మొత్తానికి డేటింగ్‌పై వచ్చిన వార్తల్ని నిజం చేసేలా పెళ్లి చేసేసుకుంటోంది ఈ జంట. అయితే వీరిద్దరు క్రిస్టియన్ వెడ్డింగ్ స్టైల్లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు మలైకా అరోరా భర్త అర్బాజ్ ఖాన్ ఇటాలియన్ మోడల్‌లో డేటింగ్ చేస్తున్నాడు.

First published: March 31, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>