Home /News /movies /

Vaisshnav Tej - Krithi Shetty: ‘ఉప్పెన’ జంట వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి నిజంగానే ప్రేమలో పడ్డారా..?

Vaisshnav Tej - Krithi Shetty: ‘ఉప్పెన’ జంట వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి నిజంగానే ప్రేమలో పడ్డారా..?

వైష్ణవ్ తేజ్ కృతి శెట్టి (Vaishnav tej krithi shetty)

వైష్ణవ్ తేజ్ కృతి శెట్టి (Vaishnav tej krithi shetty)

Vaisshnav Tej - Krithi Shetty: తొలి సినిమాతోనే ప్రేమలో పడిన జంటలు చాలా మంది ఉన్నారు మన ఇండస్ట్రీలో. ఇద్దరికీ తొలి సినిమా అయినపుడు వాళ్ల మధ్య చనువు పెరగడానికి కొన్ని రోజులు వాళ్లను వదిలేస్తుంటారు దర్శక నిర్మాతలు.

తొలి సినిమాతోనే ప్రేమలో పడిన జంటలు చాలా మంది ఉన్నారు మన ఇండస్ట్రీలో. ఇద్దరికీ తొలి సినిమా అయినపుడు వాళ్ల మధ్య చనువు పెరగడానికి కొన్ని రోజులు వాళ్లను వదిలేస్తుంటారు దర్శక నిర్మాతలు. అలాంటి జంట వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి. ఈ ఇద్దరూ ఉప్పెన సినిమాతో పరిచయం అయ్యారు. తొలి సినిమానే బ్లాక్‌బస్టర్ కావడంతో గాల్లో తేలిపోతున్నారు. బుచ్చిబాబు సన తెరకెక్కించిన ఉప్పెన ఇప్పటికే 80 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది. దాంతో ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాసాడు వైష్ణవ్. అప్పుడెప్పుడో కహో నా ప్యార్ హై సినిమాతో అప్పట్లోనే 70 కోట్లకు పైగా వసూలు చేసాడు హృతిక్ రోషన్. ఓ కొత్త హీరోకు ఇదే ఇప్పటి వరకు రికార్డు. దాన్ని ఇప్పుడు తిరగరాసాడు వైష్ణవ్ తేజ్. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నటించిన తర్వాత నిజంగానే కృతితో వైష్ణవ్ ప్రేమలో పడిపోయాడేమో అనే అనుమానాలు వస్తున్నాయి. వీళ్లు నిజంగానే పెళ్లి కానీ చేసుకుంటారా ఏంటి అనే స్థాయిలో ఈ ఇద్దరి మధ్య ప్రేమను పండించాడు దర్శకుడు బుచ్చిబాబు. బయట కూడా వాళ్లు ఇద్దరూ అలాగే కనిపిస్తున్నారు కూడా. బేబమ్మా అంటూ కృతిని వైష్ణవ్ ప్రేమగా పిలుస్తున్నాడు.. మరోవైపు ఆశి అంటూ వైష్ణవ్ తేజ్‌ను చాలా ప్రేమగా పిలుస్తుంది కృతి. ఆ పిలుపుతో మెలికలు తిరిగిపోతున్నాడు మెగా మేనల్లుడు. మా ఇద్దరి కెమిస్ట్రీ బాగా కుదిరింది.. ఆమె అంటే నిజంగా చాలా యిష్టం అంటూ చెప్పుకొచ్చాడు వైష్ణవ్ తేజ్.
Vaisshnav Tej,Vaisshnav Tej twitter,Krithi Shetty twitter,Vaisshnav Tej krithi shetty love story,uppena Vaisshnav Tej krithi shetty love,telugu cinema,వైష్ణవ్ తేజ్,కృతి శెట్టి,వైష్ణవ్ తేజ్ కృతి శెట్టి లవ్ స్టోరీ
వైష్ణవ్ తేజ్ కృతి శెట్టి (Vaishnav tej krithi shetty)

కృతి కూడా తనకు వైష్ణవ్ అంటే చాలా యిష్టమని.. ఆయన ఎంతో స్వీట్ అంటుంది. ఆశి లాంటి ప్రియుడు అందరికీ కావాలంటుంది బేబమ్మ. బయట ఎక్కడ కనిపించినా కూడా ఈ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం చూస్తుంటే మాత్రం నిజంగానే ప్రేమలో పడిపోయారేమో అనే అనుమానాలు కూడా రాక మానవు. అప్పట్లో జెనీలియా, రితేష్.. నాగార్జున, అమల.. సమంత, నాగ చైతన్య లాంటి జంటలు ఒక్క సినిమాతోనే ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. మరి ఇప్పుడు ఉప్పెన జంట ఏం చేయబోతున్నారో చూడాలి.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Krithi shetty, Telugu Cinema, Tollywood, Uppena, Vaishnav tej

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు